top of page

కలియుగ నీతి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kaliyuga Neethi' New Telugu Story


Written BY Kolla Pushpa


రచన: కొల్లా పుష్ప




"ఒరేయ్ రాజా! ఇవాళ నాకు ఫస్ట్ సాలరీ వచ్చింది. నాగార్జున సాగర్ వెళ్లి ఎంజాయ్ చేద్దాం" అన్నాడు వేణు.


"సరే" అన్నాడు రాజా.


వేణుది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. తండ్రి, తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ వేణుని చదివించారు. వేణు చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చింది, జీతం 40,000 రూపాయలు.

డబ్బులు చూడగానే చాలా సంతోషం వేసింది. తండ్రికి డబ్బులు పంపిద్దాము అనుకున్నాడు కాని 'అన్ని డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు.. పల్లెటూరు కదా!' అని కేవలం 5000 రూపాయలు పంపించాడు.


ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు. కొంతసేపటికి "ఆకలి వేస్తుందిరా! ఈ దారిలో ఏమీ లేనట్టు ఉన్నాయి" అన్నాడు రాజా.


ఇంతలో ఒక పెద్దాయన "ఉడకబెట్టిన గుడ్లున్నాయి బాబూ. తింటారా? గుడ్డు 20 రూ/లు" అన్నాడు.


"ఎందుకు? 15 రూ/లు ఇస్తాను, ఇవ్వు. లేకపోతే లేదు" అన్నాడు వేణు.


"బాబూ! గుడ్డు ఖరీదు పన్నెండు రూపాయలు. ఉడక పెట్టి ఇంతదూరం తెచ్చాను కదా బాబూ!" అన్నాడు పెద్దాయన.


"15 రూ/లు అయితే తీసుకుంటాను. లేకపోతే వెళ్ళు" అన్నాడు వేణు.


" సరేలే బాబూ.. ఇవ్వండి" అని చెప్పి నాలుగు గుడ్లు చేతిలో పెట్టి, డబ్బులు తీసుకుని ముందుకు సాగాడు పెద్దాయన.


"రేయ్ వేణు.. బండి ఆపరా. ఒక నిమిషం.. వాష్ రూమ్ కి వెళ్లి ఇప్పుడే వస్తాను" అన్నాడు రాజా.


ఆ పని అయ్యాక మళ్లీ ఇద్దరూ బయల్దేరారు.


కొంతసేపటికి పెద్ద హోటల్ కనిపించింది. ఇద్దరూ వెళ్లి సుష్టిగా భోంచేశారు.


"బిల్లు ఎంత అయింది" అని బేరర్ని అడిగాడు వేణు.


"1700 రూ/ లు అయింది సార్" అన్నాడు బేరర్.


స్టైల్ గా జేబులోంచి 2000రూ/ల నోటు తీసి బేరర్ కి ఇచ్చి, "బిల్లు కట్టి, మిగతా 300 నీ టిప్పు కింద ఉంచుకో" అన్నాడు వేణు.


“ఒరేయ్ వేణూ! ఆగరా..” అంటూ, బేరర్ని "నీ జీతం ఎంత" అని అడిగాడు రాజా.


"20,000 సార్" అన్నాడు బేరర్.


" నువ్వు వెళ్ళు" అని బేరర్ కి చెప్పి వేణుతో "నువ్వు వెనుకటి పెద్దాయన తో 5 రూపాయల కోసం బేరమాడేవు. ఇప్పుడు బేరర్ అడగకుండానే 300 రూపాయలు టిప్పు ఇచ్చావు. నేను వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ పెద్దాయనకు 500 రూపాయలు ఇచ్చాను. నిరాకరించాడు.


ఎందుకని అడిగితే 'మా ఆడది, నేను కూలి చేసి పిల్లల్ని పోషిస్తున్నాము సారూ. రాత్రి మా ఆడదానికి పాణం బాగలేకపోతే మందులు కొనడానికి డబ్బులు లేక, పిల్లలకు తెచ్చిన గుడ్లను ఉడికించి దానికి మందు కొందారని ఇలా వచ్చిన సారూ.

నీ డబ్బులు వద్దు సారూ, మాకు నిజాయితీగా వచ్చిన సొమ్ము చాలు సారూ' అని దండం పెట్టి వెళ్ళిపోయాడు.


నువ్వేమో అలాంటి వారి దగ్గర ఐదు రూపాయల కోసం బేరం ఆడావు, ఇక్కడ ఏసీలో వేలు సంపాదించుకుంటున్న వాడికి 300 రూపాయలు ఇచ్చావు.


ఇది ఏమి నీతి రా" అన్నాడు రాజా.


రాజా చెప్పింది వినగానే తన తల్లి, తండ్రి గుర్తుకొచ్చారు. వాళ్లు కూడా ఇలాగే కూలి పనులు చేస్తూ తనని చదివించారన్న విషయం మర్చిపోయాడు డబ్బులు రాగానే.


ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్లు చేయాలి. అమ్మ, నాన్న ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ ఆరోగ్య విషయం చూసుకోవాలి. ఈ విషయాలన్నీ ఎలా మర్చిపోయాడు. తన సంస్కారం ఏమైపోయింది?


తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు వేణు.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప


20 views0 comments
bottom of page