#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KannavaruGoppavaru, #కన్నవారుగొప్పవారు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 14
Kannavaru Goppavaru - Somanna Gari Kavithalu Part 14 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 03/02/2025
కన్నవారు గొప్పవారు - సోమన్న గారి కవితలు పార్ట్ 14 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
కన్నవారిని కళ్ళల్లో
అనునిత్యము గుండెల్లో
పెట్టుకుంటే దీవెనలు
వర్ధిల్లునోయి బ్రతుకులు
ప్రతిరోజూ ప్రేమతో
వారి పట్ల శ్రద్ధతో
ఉంటేనే సంతసము
ఉప్పొంగును మానసము
చివరి దశలో అండగా
కళ్లెదుటే కొండగా
కన్పిస్తే సంబరము
తాకుతుందోయ్! అంబరము
అమ్మానాన్నల రుణము
ఎవ్వరూ! తీర్చలేరు
వారిలోని త్యాగగుణము
దేనితోను పోల్చలేరు

మహోన్నతుడు దేవుడు
----------------------------------------
దేవుడుంటే సమృద్ధి
జీవితాన అభివృద్ధి
లేక భువిని అనావృష్టి
కల్లోలం ఈ సృష్టి
జీవకోటికి పెన్నిధి
భగవంతుని సన్నిధి
నీటి బుగ్గలా ఉండును
జీవితాల్లో నెమ్మది
దైవం లేని జీవితము
వట్టి ఎడారి ప్రాంతము
అభివృద్ధి గగనకుసుమము
నీరింకిన భూగర్భము
భగవంతుని దినదినము
కొలవాలోయ్! భక్తితో
వారు లేక భూలోకము
తలపించును శ్మశానము

సాటిలేని మేటి నాన్న
----------------------------------------
నాన్న మాటలు వినుము
అందు ప్రేమను కనుము
గైకుంటే మాత్రము
ధన్యమే! జీవితము
తండ్రిలోని త్యాగము
ఘనమగు అనురాగము
వర్ణింపనెవరి తరము!
వారే గొప్ప వరము
సదనానికి అధిపతి
శ్రేష్టమైన బహుమతి
వారుంటే పరపతి
లేకున్న అధోగతి
ఇంటిలోన దీపము
భగవంతుని రూపము
కొలువాలోయ్! నిత్యము
గుడిని చేయి హృదయము

విలువైన స్నేహము
----------------------------------------
స్నేహితులను దూరము
చేసుకోకు నేస్తము
వెలలేనిది స్నేహము
నిలువుకొనుము సతతము
స్నేహానికి ద్రోహము
ఎప్పుడు చేయరాదు
కలనైనా మోసము
తలపెట్టకూడదు
స్నేహమే జీవితము
కాకూడదు వ్యర్ధము
అదేనోయ్! శాశ్వతము
మహిలో మహోన్నతము
సాటిలేని స్నేహము
వెలగల బహుమానము
భువిలో అసమానము
లేదోయ్! కొలమానము
ఆపదలో మిత్రుడు
ఆదుకొనే ఆప్తుడు
వాస్తవానికతండు
వెలుగులీను సూర్యుడు

పెద్దయ్య సుద్దులు 2
----------------------------------------
కన్నవారి ఆశలు
చిగురింపజేయాలి
గురుదేవుల ఆజ్ఞలు
శిరసావహించాలి
పెద్ద పెద్ద చదువులు
ఇష్టపడి చదవాలి
దేశ పేరుప్రతిష్ఠలు
ఎల్లెడల చాటాలి
తల్లిదండ్రుల ప్రేమలు
గుర్తుపెట్టుకోవాలి
వారు చెప్పు మాటలు
సదా ఆలకించాలి
గొప్పవారు మిత్రులు
గౌరవము ఇవ్వాలి
గౌరవానికర్హులు
మదిని స్థానమివ్వాలి

నాన్న సూక్తి సుధ
---------------------------------------
సత్కార్యాలు చేస్తే
మానవుడే మాధవుడు
పనికిరాని పనులతో
అవుతాడోయ్! దానవుడు
పగటినేలే ఘన రేడు
జగతిలోన మార్తాండు
చీకటిని తరిమికొట్టు
వెలుగు మోము మొనగాడు
ఆపదలోన ఆప్తుడు
కనిపించే భగవానుడు
అట్టి వాడు ఆత్మీయుడు
గౌరవానికి పాత్రుడు
చెడ్డ పనులు చేసి చేసి
తెచ్చుకోకు పెద్ద కీడు
వ్యసనాలే ముదిరితే
బ్రతుకగును వల్లకాడు
చేతనైతే సాయపడు
ఆపకారము తలపెట్టకు
ముందు చూపు కలిగి నడు
ఆందోళన చెందబోకు

సృష్టికర్త దైవము
---------------------------------------
భక్తకోటి ప్రాణము
జీవితాన దీపము
సృష్టికర్త దైవము
చూడ వెలుగు రూపము
వారి మాట వేదము
లేదు లేదు వాదము
భగవంతుని నామము
అదే స్వర్గధామము
బద్దకం వీడితే
భక్తితో వేడితే
బ్రతుకంతా వేడుక
దైవాన్ని నమ్మితే
దైవమే తోడుగా
అనుదినము నీడగా
ఉంటేనే క్షేమము
రక్షణ కవచంగా

సుభాషితాలు
---------------------------------------
పండుటాకు రాలును
గుణపాఠము నేర్పును
వనమున విరబూసిన
పూవు వాడిపోవును
అలలు పైకి లేచును
భీభత్సం చేయును
సాగర గర్భంలో
ఒరిగి ఒరిగి పోవును
పాలు పొంగిపొర్లును
బూడిదలో కలుసును
అహం కల్గిన వారి
స్థితి ఇలాగే ఉండును
సూర్యుడస్తమించును
తూర్పున ఉదయించును
కష్టసుఖాలు కూడా
ఈ రీతిని ఉండును

ప్రాణదాతలు చెట్లు
---------------------------------------
తరువులేమో తరిగిపోయెను
ఎండలేమో అధికమాయెను
ఓజోన్ పొర పల్చబడిపోయెను
జీవకోటికి ముప్పు వచ్చెను
ముందు చూపే కరువాయెను
స్వార్థమేమో పెరిగిపోయెను
మనిషి మితిలేని స్వార్ధానికి
మ్రానులెన్నొ బలియైపోయెను
మన ప్రాణదాతలు వృక్షాలు
అవి ఉంటేనే జీవితాలు
విచక్షణ రాహిత్యం ముప్పు
తెలుసుకోవాలి వాస్తవాలు
జగమంతా చెట్లను పెంచాలి
ప్రతిచోట మొక్కలు నాటాలి
నందన వనముగా చేయాలి
పుడమి పచ్చచీర కట్టాలి
'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు'
ఈ సత్యం మరువకూడదు
లేకపోతే తప్పవు పాట్లు
నిర్లక్ష్యం ఉపేక్షించరాదు

సూక్తి రత్నావళి
---------------------------------------
ప్రవాహానికి ఎదురీదు
చేప తీరు గమనించు
దైనందిన జీవితంలో
కష్టాలను ఎదురించు
నింగిలోన విహరించే
నీటిలోన జీవించే
పక్షులను పరీక్షించు
జీవన విధానం గాంచు
కూత వేయు కోడిపుంజు
చురుకుదనం వీక్షించు
బద్దకాన్ని దులుపుకుని
మెరుపులాగ జీవించు
భూమి పొరలు చీల్చుకొచ్చు
విత్తు స్ఫూర్తి స్వీకరించు
చీకట్లో దూసుకొచ్చు
రవి కిరణమై కన్పించు
సృష్టి నేర్పే పాఠాలు
బ్రతుకులో గుణపాఠాలు
గైకుంటే బహు మంచిది
పెద్దల సూక్తి రత్నాలు
-గద్వాల సోమన్న
సోమన్న
I) కన్నవారు, గొప్ప వారు
సరే ... కానీ ప్రతి కుటుంబం ఫ్యామిలీ కౌన్సిలర్స్ వద్ద తరచు వెళ్లి ... సంతోష పూరిత మాటలు, నిర్వహణ చిట్కాలు తీసుకోవాలి.
Ii) చిన్నారులే ముఖ్యం:
లేత పసి హృదయాలు
పి.వి. పద్మావతి మధు నివ్రితి