top of page

తీరిన వేదన

Writer's picture: Yasoda GottiparthiYasoda Gottiparthi

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #తీరినవేదన, #ThirinaVedana, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Thirina Vedana - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 03/02/2025

తీరిన వేదన - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


 నగలు తయారు చేసే ఇల్లు, అందులోనే చిన్న దుకాణం. అందరికీ అతి నమ్మకమైన ఇష్టమైన, పేరు పొందిన, మంచి పని తనమున్న నగల తయారీదారుడు నరసయ్య, 


ఇంట్లోనే ముందు గదిలో మధ్యలో చాప మీద కూర్చొని, ముందు చిన్న డెస్క్, మూడు వైపుల పనివాళ్ళు పనిముట్లతో, చిన్న చెక్క పీటలు ఇనుప సామాన్లతోటి నిండి ఉంటుంది. 

*********************

చేతిలో బంగారం పనైనా ఇంట్లో రోజు తిండికి మాత్రమే సంపాదన. 

తండ్రి వారసత్వంగా చేస్తున్న వృత్తి. తనకు చదువు అబ్బలేదు. 


 ఈ పని తోటి కాలం గడవడం కష్టం. ముడి బంగారం కరిగించడంలో నుండి అసలైన బంగారం తీసి నచ్చిన రత్న, రాళ్ళ, మాణిక్యాలు కూర్చి నగలు తయారు చేయడం అంటే చాలా సున్నితమైన పని. 

యంత్రాల సహాయం లేకుండా కేవలం చేతిద్వారా కళ్ళ దృష్టి తీక్షణతో తయారు చేయాలంటే శారీరక కష్టం చేయవలసి ఉంటుంది. 


“ ‘నీవైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి రా’ అని నన్ను ఎంతో ప్రోత్సహించిన నేను మా నాయన కోరిక తీర్చలేకపోయాను” అంటూ తన భార్యతో చెప్పి, తన కొడుకును బాగా చదివించాలని అనుకున్నాడు. 


సొంత ఊర్లో బడి ఐదవ తరగతి వరకే. ప్రక్క ఊరు రెండు కిలో మీటర్లు నడిచి వెళ్తే. అక్కడ కాలేజ్ లో చదవవచ్చునని కొడుకుకు ఒక సైకిల్ కొనిచ్చాడు. 


పంతులు “మీ అబ్బాయికి మంచి తెలివితేటలు ఉన్నాయి, కాస్త కష్టపడి ఇష్టంతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంద”ని చెప్పడంతో ఇంకా కొడుకు చదువు పైన శ్రద్ధ పెరిగింది నరసయ్యకు. 


 “నాయనా! నువ్వు డిగ్రీ కూడా చేయాలి” ఫీజు కట్టి, హాస్టల్ లో పెట్టి కొడుకు భవిష్యత్తు కోసం చాలా ఆరాటపడుతూ తన బంగారు నగల తయారు పైన కూడా శ్రద్ధ పెట్టాడు. 

**********************


కొంతలో కొంత కూలి తగ్గించమని, తరుగు తీయవద్దని, ఏదో విధంగా సతాయించినా, ఓపికతో చేసేవాడు. ‘నీకు తరుగు తయారీలో ఎంతో కొంత బంగారం మిగులుతుందిలే.. మీకు వచ్చే లాభం అదే కదా..’ అంటూ ‘మీరు మాత్రo ఎలా బతకాలి? లెండి’ అంటుంటే.. 

తయారుచేసే బంగారాన్ని చూపిస్తూ ‘అందులో చిన్న చుక్క కూడా మిగలదు. కాకపోతే యంత్రాల ఖర్చు లేక, సొంత కష్టం కూలితోనే గిట్టుబాటు మాకు’ అనే వాడు. 

***************

 బయటకు వెళ్లిన కొడుకు తెల్లవారుజాము వరకు రాక పోయే సరికి ఆందోళన పెరిగింది. కంగారులో ఉదయం తొమ్మిది అయిన ఇంటి తలుపులు తీయలేదు. 


“ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎటు వెళ్లాడు?” భార్యను మళ్ళీ మళ్ళీ అడుగు తుంటే.. 

 “తెలిస్తే నేను ముందుగా చెప్తాను కదండీ” అని గొంతు వణుకుతూ ఉంటే.. 

 “వాడి బట్టలు అన్నీ ఉన్నాయో లేవో? చూడు. బ్యాగుతో వెళ్ళాడో ఏమో?”


 బీరువాలో చూచి బట్టలు లేకపోవడంతో.. వెంటనే మూల మూల వెతుకుతూ తన నగలు పెట్టి తీసాడు.. అందులో ఆర్డర్ మీద తయారు చేసిన మూడు పెద్ద చైన్లు, రెండు ఉంగరాలు రెండు జతల దుద్దులు ఒక్కొక్కటి చూస్తుంటే.. అందులో పెద్ద చైన్ కనపడలేదు. నక్షత్ర డిజైన్తో ధగ ధగ మెరుస్తుండేది లేకపోయేసరికి గుండెలో దడ మొదలైంది. 


డబ్బుల పెట్టి తెరిచి చూశాడు. కొన్ని నోట్ల కట్టలు కూడా కనపడలేదు. ఇప్పుడు కస్టమర్స్ వచ్చి అడిగితే నేను ఏమి చెప్పాలి.. 


కొడుకు చేసిన నిర్వాకానికి పోలీస్ రిపోర్ట్ ఇస్తే పరువు పోతుంది. ఎక్కడికీ వెళ్ళాడో? బుద్ధిమంతుడు అని అను కున్నందుకు ఎంత నమ్మక ద్రోహం చేశాడు. 


గుండెలో ఎందరో శూలాలతో పొడిచినట్లు చెప్పలేని బాధ, తీయని పాలలో విషం చుక్క కల్పినట్లు, తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నది ఇంతేనా? అని వాపోయాడు. 

******************** 

 చీకటి పడుతుండగా స్టూడియో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి, “ఎవ్వరు నువ్వు? నీ పేరేమిటి?” అని అడిగాడు.


“నా పేరు సునీల్ అండి. నేను సినిమాలో నటించడానికి ట్రై చేస్తున్నానండి. శిక్షణ కూడా పొందాను. గత కొన్ని రోజుల నుండి ఎండ వాన చూడక నిద్రాహారాలు మాని కూడా ఇక్కడే ఉంటున్నాను. ఈ వాచ్మెన్ నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు”.

 

“అవునా! ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయినా ఇలాంటి వాటిని కోరుకునే వారికి కష్టాలు తప్పవు. నువ్వు ఎన్ని అర్హతలు సంపాదించినా దానికి తోడుగా చాలా డబ్బు కూడా ఉండాలి. ఉన్నా అది నీది కాదు అని ఆశ వదులుకోవాలి”.

 

“సార్! నేను డబ్బులు కూడా తెచ్చాను”.. బ్యాగ్ లో నుండి కట్టలు తీయబోతుంటే


 “అలా అని కాదయ్యా..” అన్నాడు ఆ వ్యక్తి.

 

 “అయితే నేను ఒక బంగారం చైన్ కూడా తెచ్చాను”  సునీల్ అని అనగానే.. 


 “నీ బ్యాక్ గ్రౌండ్ లో నటులు ఉండాలి. అన్నట్లు మీ నాన్నగారు ఎం చేస్తుంటారు?”

  

“నేను మామూలు కంసాలి కొడుకును”.

 

 ఎవరు.. అంటూ బంగారు చైన్ త్రిప్పి త్రిప్పి చూసాడు. 


లోలోపల ఆశ పడుతున్నాడు సునీల్. 

 

 చైన్ పైన N అని చూసి “నువ్వు నరసయ్య కొడుకువి కదూ. మీ నాన్న నా స్నేహితుడు. ఇంతకు ముందే ఫోన్ చేశాడు.. నీ గురించి అంతా చెప్పాడు. "తీరని వేదన"లో ఉన్నాడు..”

 

అంటూ “ముందు నువ్వు ఇంటికి పద!" నీకు తర్వాత సినిమాలో ఎలా చేరాలో చెప్తాను "అంటూ కార్లో ఎక్కించు కొని వెళ్ళాడు ఆ వ్యక్తి రచయిత కమలాకర్. 

 

సమాప్తం 


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




37 views2 comments

2 Comments


తీరని వేదన: యశోద 

అందరూ చదవాలి, సినిమా పిచ్చి పోవటానికి ... ఇంట్లోని వస్తువులు తీసికెళ్ళి హీరోలు అయిపోరు, స్టార్లు అయిపోరు.

సినిమా ఇన్స్టిట్యూట్ లో చేరి, సినిమా కోర్స్ చేసి ... సినిమాలకు, సినిమా వృత్తిలోకి వెళ్ళటం వేరే మాట.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like

mk kumar
mk kumar
Feb 03

"తీరిన వేదన" కథలో నరసయ్య, బంగారు నగల తయారీదారుడిగా కష్టపడి తన కొడుకును చదివించే ప్రయత్నం చేస్తాడు. కానీ కొడుకు, తన ఆశలను విస్మరించి, కుటుంబ నమ్మకాలను ధ్వంసం చేస్తాడు. నరసయ్యకు ఈ శోకం తీవ్ర బాధను కలిగిస్తుంది. అయితే, సునీల్ అనే యువకుడు, నరసయ్య కొడుకుగా పరిగణించబడే అవకాశాన్ని పొందడం ద్వారా ఒక కొత్త దారిని తీసుకుంటాడు. కథలో కుటుంబ బంధాలు, నమ్మకాలు, ఆర్థిక కష్టాలు కీలకమైన అంశాలు. మొత్తం కథ భావోద్వేగంతో నిండి ఉంటుంది.


Like
bottom of page