కార్తీకం పుణ్యప్రదం
- Yasoda Gottiparthi

- Nov 6, 2025
- 1 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #కార్తీకంపుణ్యప్రదం, #KartheekamPunyapradam

Kartheekam Punyapradam - New Telugu Poem Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 06/11/2025
కార్తీకం పుణ్యప్రదం - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
శివ కేశవుల ఆరాధించు కార్తీకం
కోటి దీప మహోత్సవ మాసం
శౌరి ముకుంద దామోదర గోవర్ధన పూజా మహత్యం
భక్తి భావం తో దేవతారాధన పూజా ఫలితం
ప్రతినిత్యం చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తం
తులసీదీపం కాoచిన తొలగును అనారోగ్యం
ఆవు నెయ్యి దీపాల తొలగును కాలుష్య వాతావరణం
జ్వాలా తోరణం ఆకాశ వెలుగుతో తొలగును తిమిరం
తెల్లవారుజాము గంగా స్నానం కలిగించును ముక్తి
తిరు నామo ధరించి దేవుడి ఎదుట దీపం వెలిగించి
భక్తిశ్రద్ధలతో పూజించుట ఎంతో పుణ్య ప్రదం.
కృత్తిక నక్షత్రం రోజున పౌర్ణమి కార్తీక పున్నమి ప్రత్యేక మాసం
అఖండ దీపం వెలిగించి ,పసుపు కుంకుమలు,పూలతో పూజించి
ఉపవాస దీక్షలతో దేవతా రాధన ప్రారంభం
చాతుర్మాస దీక్షల్తో తరించిన భక్తులు కార్తీక మాసం
లక్ష్మీ నారాయణుల , శివుని, విష్ణువుకు ప్రీతికరం.
ఉసిరిక స్నానాలు,బ్రాహ్మణులకు దీప దానాలు ఎంతో పుణ్యం
తులసీ కళ్యాణ , దేవుని కైంకర్యాలు శుభప్రదం శివారాధనల మాసం
శ్రీసత్యనారాయణ వ్రతాల పూజా పుణ్య ఫలం
భక్తులు అయ్యప్ప దీక్ష లో శబరిమల దర్శనం
హరిత వన భోజనo ఆరోగ్య ప్రదం
హరి భక్తులైన ,శివ భక్తులైన సమ భావం
స్త్రీలు సౌభాగ్య కోసం వెలిగించిన అరటి దోప్పలలో దీపాలు ఆకాశ కాంతిని అవనిలో పూజించి నది విలో వదలడం
నువ్వుల నూనె దీపాలు ఇంటి గుమ్మం కిరువైపుల వెలిగించిన
మృత్యు దోషాలు తొలగునని నమ్మకం
వేదాల హోరు వివిధ దేవాలయాలు, ప్రాత:కాల పూజలు పవిత్రం
ఆధ్యాత్మిక దైవ చింతనలతో భక్తుల మనో నిగ్రహం
బలపడు పావనమగు జన్మ సార్థకం
వివాహాది శుభకార్యాలకు శుభప్రదం
వాతావరణం అనుకూలం
***

-యశోద గొట్టిపర్తి




Comments