top of page

కస్తూరి రంగ రంగా!! 5


'Kasthuri Ranga Ranga Episode 5' Telugu Web Series

Written By Ch. C. S. Sarma





(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా ఐదవ భాగం



గత ఎపిసోడ్ లో

సుల్తాన్ జీప్ పైనా, రేపల్లెలో సయ్యద్ ఇంట్లో, బ్రహ్మయ్యగారి ఇంట్లో పన్నెండు ప్రాంతంలో బాంబు ప్రేలుళ్లు జరిగాయి. జీప్ లోని వారు.... సయ్యద్ భార్య ఫాతిమా, బషీర్.. బ్రహ్మయ్య, కుసుమ, శాలివాహన దారుణంగా మరణించారు.


ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 చదవండి...


సమయం.... రాత్రి పదిన్నర... భూషణ్ కుమార్ తన గార్డెన్ గెస్టు హౌస్ లో సిటీకి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో ప్రియురాలితో త్రాగుతూ ఛలోక్తులు విసురుతున్నాడు. ఆమె పేరు మువ్వ. ఆ కాంతామణి అమృతాన్ని సేవించింది..... కైపులో తేలిపోతూ వుంది.

భూషణ్ సెల్ మ్రోగింది.


“హలో!...”

"సార్!... నేను సెక్యూరిటీని...."

"ఏంట్రా... ఈ సమయంలో ఫోన్ చేశావు?...".

“సార్ మన్నించండి... మల్లేష్ వచ్చాడు సార్... మిమ్మల్ని అర్జంటుగా కలవాలంటున్నాడు..." భయం భయంగా మెల్లగా చెప్పాడు సెక్యూరిటీ...


“వాడు ఇక్కడదాకా ఎలా వచ్చాడు రా!..."

"కాలినడకన అడ్డదారిలో సార్!..."

“సరే... గేటుకు తాళం వేసి వాణ్ణి తీసుకొనిరా!..." సెల్ కట్ చేశాడు.


“మువ్వా!...”

"ఆ... చెప్పు రాజా!...".

“ఆ కాంట్రాక్టు మనకు ఎలాగైనా రావాలి... నీవు ఎవరిని కలుస్తావో.. ఏం ఆశ చూపిస్తావో... అదంతా నీ సామర్థ్యం!... కాంట్రాక్టు మనకు వచ్చి తీరాలి....." అహంకారంగా అన్నాడు భూషణ్ కుమార్.


“అలాగే బాస్!.. వస్తుందిగా!..." పకపకా నవ్వింది మువ్వ... కొన్ని క్షణాల తర్వాత....

“మరి ఖర్చు!!!..”

"ఎంతైనా ఫర్వాలేదు మువ్వా!!... చెప్పానుగా!... నామాటమీద నీకు సందేహమా!..."

"ఆ సెక్రటరీగాడు ఎండుగడ్డి... పచ్చిగడ్డి అనే తేడా లేకుండా ఏదైనా తింటాడు బాస్..."

భూషణ్ నవ్వాడు.


“ఎందుకు నవ్వుతున్నారు?... మువ్వ ప్రశ్న....

“నీవు అన్నమాటలు మూలంగా!...”

“అవును బాస్... నేను చెప్పింది నిజం!...”

“ఓకే... ఓకే..!.. అయితే నీపని మహా సులువు అన్నమాట మువ్వా!...”


తలుపు తట్టిన శబ్దం...

మువ్వ రెస్టు రూమ్ లోకి వెళ్లి తలుపు మూసుకొంది.

భూషణ్ వెళ్లి తలుపు తెరిచాడు.

వాచ్ మెన్ దానయ్య... మల్లేష్ లోనికి వచ్చారు. మల్లేష్ భోరున ఏడుస్తూ భూషణ్ కాళ్లపై పడ్డాడు.


"అయ్యా!... తమరే నన్ను కాపాడాల... పోలీసులు నాకోసం తెగ గాలిస్తుండారు అయ్యా!..." దీనంగా చెప్పాడు మల్లేష్.


“ఒరే మల్లేష్!... తప్పు చేసినవాణ్ణి పట్టుకొనేటందుకే కదరా పోలీసులుండేది!... చూడు... నీవు నీ అవతారాన్ని మార్చు... కాషాయం పంచె, పైపంచె పైతలమీద అదేరంగు టోపీ... మెడలో రుద్రాక్షమాలలు ధరించు. ఓ సైకిల్ కొనుక్కో... సెకండ్ హ్యాండ్... దానిపై ఎక్కి కూర్చొని అయోధ్యకు బయలుదేరు... నీజోలికి వచ్చేవాడుండడు... నీ పెళ్లాం పిల్లకాయల్ని నేను జాగ్రత్తగా చూచుకొంటా... ఆ... ఇంతకీ నీకెంతమంది పిల్లలు?...."


“ఇద్దరు సార్!...”

"రేయ్!... దానయ్యా!....

"సార్!..."

“నీవు మల్లేష్ పిల్లల్ని హాస్టల్లో చేర్చు. వాడి భార్యను ఈ గెస్టు హౌసు క్లీనింగు పనిలో పెట్టు...."


"అట్టాగేసార్!..." దానయ్య జవాబు.

“రేయ్... మల్లేష్!... చెప్పింది అర్థం అయిందా!...""

"అర్ధం అయింది సామీ!...”

జేబునుంచి ఇరవైవేల రూపాయల కట్టను తీసి మల్లేష్ కు అందించాడు.


"అయోధ్యకు రేపే బయలుదేరు.... సరేనా!..."

"అట్టాగే సామీ!"


“సరే వెళ్లండి... దానయ్యా నీవు ఆ పిల్లల్ని హాస్టల్లో చేర్చడం... వాడి భార్యను ఈడకి తీసుకొని రావడం... జాగ్రత్తగా చూచుకో... ఇంద..." దానయ్యకు పదివేలు ఇచ్చాడు.

"ఆ... ఇక మీరు వెళ్లండి..." చెప్పాడు భూషణ్.

ఇరువురూ వారికి నమస్కరించి నిష్క్రమించారు.


మువ్వ నవ్వుతూ రెస్టురూమ్ నుంచి బయటకు వచ్చింది. మంచాన్ని సమీపించి వెలుగుతున్న బార్ లైటును ఆర్పి... బెడ్ లైటును ఆన్చేసింది...

వయ్యారంగా మువ్వ... భూషణ్ కుమార్ ను సమీపించింది....

ఆయన చేతిని తన చేతిలోకి తీసుకొంది.


భూషణ్ సెల్ మ్రోగింది. తన చేతిని మువ్వ చేతినుండి తీసుకొన్నాడు.

“ఎవరు?..."

“ఖాజా!...”

"ఏం... ఈ సమయంలో ఫోన్ చేశావ్? పదిగంటల తర్వాత నాకు ఫోన్ చేయెద్దని ఎన్నిసార్లు చెప్పాను?...” కోపంగా అరిచాడు భూషణ్ కుమార్...


"ఇర్ఫానుకు డబ్బు కావాలి...".

“ఇపుడు వాడు ఎక్కడ ఉన్నాడు?...”


"ప్రస్తుతం బాంబేలో వున్నాడు... వాడు కొంతకాలం దేశంలో లేకుంటే... మన ఇద్దరికీ మంచిది సార్!...".

“వాడు పోలీసులకు దొరికితే... మీరు కటకటాల వెనక్కో లేక సరాసరి పైకో వెళ్లాల్సి వుంటుంది...." వికటంగా నవ్వాడు ఖాజా...


"ఏరా!... బెదిరిస్తున్నావా!... బ్లాక్మెయిల్ చేయాలనుకొంటున్నావా!... ఎవరితో మాట్లాడుతన్నదీ మరచి నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్... రేయ్ ఖాజా!... గతాన్ని గుర్తు తెచ్చుకో... నిన్ను రక్షించాలన్నా... భక్షించాలన్నా... ఆ సామర్ధ్యం వున్నది నాకొక్కడికే... నేను తలచుకొంటే తెల్లవారే లోపలే నీ చీకటి సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయగలను. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. రేపు వుదయం... పదిగంటలకు మా దానయ్యను కలువు. ఐదులక్షలు ఇస్తాడు... తీసుకెళ్లు... దాన్ని ఇర్ఫాన్ గాడికి పంపు... ఇకమీదట... ఎప్పుడూ రాత్రి పదిగంటల తర్వాత ఫోన్ చేయకు... తెలుసుగా... భూషణ్ మంచికి మంచివాడు... చెడుకు మహాచెడ్డవాడు... గుర్తు పెట్టుకో... గుడ్ నైట్..." సెల్ కట్ చేశాడు... మాయదారి కాకినాడ మువ్వ ఆ సంభాషణంతా తన సెల్ఫోన్లో రికార్డు చేసింది.


“ఏయ్!... ఒక గ్లాసు కలుపు...”

రెండు గ్లాసుల్లో విస్కీపోసి ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ యాడ్ చేసి భూషణ్ కు ఒక గ్లాసు అందించింది.


తాను ఒకదాన్ని చేతికి తీసుకొంది.

భూషణ్ వెళ్లి ద్వార గడియ బిగించి వచ్చి కూర్చున్నాడు. అమృత సేవనం... చెలితో సరస సంభాషణ సక్రమంగా సాగించి భూషణ్

అనందంగా శయనించాడు..... మువ్వ సోలి నిద్రపోయింది.

***

హైదరాబాద్ నుంచి వసంత్ దేశాయ్ అనే డి.యస్.పి., రేపల్లెకు వచ్చాడు. ఆ స్టేషన్లో వున్న సిబ్బందిని జరిగిన సంఘటన... వివరాలను అడిగి తెలుసుకొన్నాడు....


సయ్యద్... పుండరీకయ్యలను కలుసుకొన్నాడు.... ఆ కేసుకు సంబంధించిన... వారికి తెలిసిన విషయాలను... పాయింట్ పాయింట్ గా అడిగి నోట్ చేసుకొన్నాడు. బాంబులు ప్రేలిన స్థలాలను ఫొటో తీసుకొన్నాడు. హైదరాబాద్ వెళ్లిపోయాడు. భూషణ్... అతని తల్లి... బ్రహ్మయ్య... శాలివాహనల అంత్యక్రియలను శశాంక్ ముగించి. అతను ముంబై వెళ్లిపోయాక వచ్చి... పుండరీకను సయ్యద్ ను గ్రామ పెద్దలను పరామర్శించి మొసలికన్నీరు కార్చి వెళ్లిపోయారు.


అది లేబర్ వాడలో రచ్చ అరుగు. మధ్యన వేపచెట్టు. జనాల మధ్యన అభిప్రాయాలు... తగాదాలు వస్తే ఇరువర్గాలు ఆ వాడ పెద్దమనిషి... ఆ చెట్టు అరుగు దగ్గర సమావేశం అయేవారు.


పెద్దయ్యకు ఇరువర్గాల వారూ... ఒకరి తరువాత ఒకరు... ఎదుటివారివలన తమకు జరిగిన అన్యాయాన్ని బాధను పెద్దాయనకు చెప్పుకునేవారు. వారు ఇరువురి వాంగ్మూలాన్ని విని... నిష్పాక్షికంగా... న్యాయబద్ధంగా తన తీర్పు... నిర్ణయాన్ని తెలియచేసేవారు ఆ సమూహం పెద్ద. ఆ ఇరువర్గాలకు సాన్నిహిత్యం కలిగేలా... బేధాభిప్రాయాలను మరచి హితులుగా మారేలా... ఆ పెద్దాయన మంచి మాటలు తన తీర్పుగా చెప్పేవారు.


వారి మంచిమాటల వలన ఇరువర్గాలు వారిలోని ద్వేషభావం... సమసిపోయి... హితులుగా మారి పెద్దాయనకు నమస్కరించి అనందంగా కలసి ఇండ్లకు వెళ్లిపోయేవారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణ 19.12.1952.... ముఫ్పై జిల్లాలు... తొలుత కర్నూలు రాజధాని... తర్వాత హైదరాబాదుకు మార్చారు. సముద్రతీరపు జిల్లాల నుంచి... రాయలసీమ ప్రాంతాన్నుంచి ఎందరో హైదరాబాద్ వ్యాపారరీత్యా వెళ్లారు. వారు స్థాపించిన వ్యాపారం కనస్ట్రక్షన్స్... గృహ, భవన నిర్మాణాలు. కొద్దికాలంలోనే వారు హైదరాబాద్ రూపురేఖలను మార్చేశారు. అన్ని విషయాలలో గొప్ప నగరంగా మారిపోయింది. ముఖ్యమంత్రులు హైదరాబాద్ పట్టణాభివృద్ధికి ఎంతగానో శ్రమించారు. శ్యాట్ లైట్స్ మూలంగా టీవీలు, సెల్స్, ల్యాప్ ట్యాప్ లు, ఐఫోన్స్, స్కయిప్స్ విరివిగా వెలిశాయి.


జనాలు నవనాగరికతా మోజును బాగా అలవరచుకొన్నారు. చెట్టు క్రింద కూర్చొని ఆ పెద్దాయన చెప్పే తీర్పు విని తప్పులను సరిచేసుకొనే రోజులు పోయాయి. అందరికీ విద్య అందుబాటు... ముందు తరాలల్లో విద్య, సంప్రదాయ బద్ధంగా... సంస్కృతి పరంగా విజ్ఞాన ప్రదాయినిగా వుండేది. ఆ విద్యను నేర్పే గురువులయందు గౌరవం... అభిమానం... వుండేది. కానీ ఈ నూతన నవనాగరీకత ప్రారంభం యువతలు... సమాజంలో మన హైందవతకు వున్న... తాత తండ్రులు పాటించిన మన మహెూన్నత సంస్కృతిని... ఆచార వ్యవహారాలను పాటించేవారు. తరిగిపోయారు. అమ్మా నాన్నా... అని నోరారా పిలిచేదానికి బదులుగా మమ్మీ.. డాడీ... అనే ఆంగ్లపలుకులు జనాన్ని అమ్మానాన్నలను కొందరిని... ఎంతగానో ఆకర్షించాయి... పిల్లలు ఆ వాలుగాలిలో ముందుకు సాగారు.


ఏ అబ్బాయి... ఏ అమ్మాయి... ఏ తప్పుచేసినా... దానికి కారణం వారి తల్లిదండ్రుల పెంపకం... కొడుకూ కూతురూ ఇంగ్లీషు తెగమాట్లాడుతున్నారని సంబరపడి.. వారు అడిగినంత డబ్బు వారికి పెద్దలు ఇచ్చిన కారణంగా....చిత్ర విచిత్రమైన అలంకరణలు... పబ్బులు.. క్లబ్బులు... పార్కులు... షికార్లు... ప్రేమలు.. పొరపాట్లు.. అసహనం... ఒకవర్గపు తల్లిదండ్రుల వ్యతిరేకత... ఆవేశం... ఆత్మహత్యలు.. ఎన్నో... వీటన్నిటికి పెద్దలు పిల్లలను క్రమశిక్షణా రహితంగా పెంచడమే కారణం... దీనికి వ్యతిరేకత రీతిలో పిల్లల ఆలనాపాలనలను చూస్తూ... వారికి చక్కని చదువు సంస్కారం... వున్నతి.. గౌరవాన్ని కల్పించే తల్లిదండ్రులు కొందరున్నారు. అలాంటి తల్లిదండ్రులవలన పిల్లలకు ఆనందం... ఆ సంతతి వలన తల్లిదండ్రులకు ఎంతో సంతోషంతో కూడిన గర్వం.... అహంకారంతో కాదు... బిడ్డల అణకువ... వృద్ధిని చూచిన పరమానందంతో... సంతోషించే వారు కొందరు....


ఇలా పై రెండు వర్గాలకు చెందిన పెద్దలు... వారి సంతతి... ఎవరెవరి ఇష్టానుసారంగా వారు వర్తించే కాలమిది... కలికాలం.....


శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ 07-05-1861లో కలకత్తాలో జన్మించారు. వారు బెంగాలీ చిత్రకారులు... రచయిత... పద్యనవలరచన... సంఘసంస్కర్త... వేదాంతి.... నాట్య సంగీతకర్త... చిత్రకళాభిమాని... పందొమ్మిదవ శతాబ్ద పరభాగాన 20వ శతాబ్దపూర్వభాగాన వసించి చరిత్రకెక్కిన భరతమాత మహోన్నతముద్దుబిడ్డ వారు. వారు ఎన్నో రచనలుచేశారు. అందులో అతి ప్రశస్తమైనది గీతాంజలి... (పద్యకావ్యం) వారికి 1913లో వారు సాహిత్యానికి ... కళలకు... చేసిన మహోన్నత సేవలకు సంతసించి... వారి ప్రతిభను గుర్తించిన ఆంగ్లేయులు గౌరవించి... ఠాకూర్ గారికి నోబుల్ ఫ్రైజ్ ఇచ్చి సత్కరించారు. జొరసన్కో ఠాకూర్ బారి... వారి చరిత్ర కడు రమణీయం. కలకత్తాలో వారు 07/08/1941న స్వర్గస్థులైనారు.


మన జాతీయగీతం... జనగణమన అధినాయక జయహే... వ్రాసిన మహనీయులు... శ్రీ రవీంద్రనాథ్ ఠాకూర్ గారు. వారు 1910లో కలకత్తా నుండి శాంతినికేతన్ కు వెళ్లి ఆశ్రమాన్ని స్థాపించారు. వారి ఆశ్రమంలో శశాంక్ చిన్నీని....కల్పన పేరుతో చేర్పించాడు.

భూషణ్ కుమార్ బాంబే వచ్చి... ఆమెను గురించి అడిగినప్పుడు... ఆమె తన వద్దకు రాలేదని... ఎక్కడవుందో ఏమైందో తనకు తెలియదని చెప్పాడు శశాంక్... శశాంక్ పోర్టులో మిలటరీ ఆఫీసరు కొలోనిల్... కస్తూరిని ఎక్కడ వున్నా వెతికి పట్టుకొని తన దాన్నిగా చేసుకోవాలనేది... భూషణ్ కుమార్ చిరకాల నిర్ణయం.... అందుకోసం అనుచరులను నియమించాడు. అదే చోట రంగ డిగ్రీ చదువు... ఐ.పి.ఎస్. ట్రయినింగ్... కలకత్తాలో వుద్యోగం... ఎవరికీ తెలియని రీతిలో ఏర్పాటు చేశాడు శశాంక్.


గోపాలయ్యగారు గతించి పదహారు సంవత్సరాలు... చిన్నీ కలకత్తా ఆశ్రమంలో చేరి పధ్నాలుగు సంవత్సరాలు... కాంతం... కనకం (డబ్బు) మనిషిని మృగంగా మార్చుతాయి.. భూషణ్ తల్లి అన్న గోపాలయ్య మీద పగతో తన కొడుకు భూషణ్ కుమార్ ను వారికి బద్ద శత్రువుగా మార్చింది. ఆ పగకు కారణం గోపాలయ్య భూషణ్ కు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారి మధ్య వయస్సు వ్యత్యాసం రీత్యా తాను చేయబోనని నిర్మొహమాటంగా చెప్పడం.


ఆ తల్లి దుర్గాదేవి... పెద్దకొడుకు భూషణ్ కుమార్ ల మాట... చేత... ఒక్కటే... తన కోర్కెను కాదన్న పెద్దన్న చిన్నన్నల వంశాన్ని నాశనం చేయాలనేది దుర్గాదేవి ఆకాంక్ష... దానికి తగినట్లుగా ఈ భూషణ్ కుమార్ ను అమానుషత్వంగా తయారు చేసింది... స్త్రీ ఆగ్రహావేశాలు అంతానికే దారితీస్తాయి... చెప్పుడు మాటలను విచక్షణ లేకుండా వినేవారు జ్ఞానశూన్యులు... భూషణ్ ఆ వర్గానికి చెందిన మూర్ఖుడు...


సయ్యద్ సార్ హైదరకాబాద్ కు వచ్చి తన పెద్దకొడుకు ఇర్ఫాన్ ను కలసికోవాలని ప్రయత్నించాడు. వారి బావమరిది ఖాజాసాబ్... వాడు వ్యాపార రీత్యా బాంబే వెళ్లారు. వచ్చేదానికి పదిరోజులు పైనే పడుతుందని సయ్యద్ సార్ కు చెప్పాడు. ఆ విషయం విన్నతర్వాత... సయ్యద్ సార్...


"రేయ్!... ఖాజా!... నీవు నా కొడుకు జీవితాన్ని నాశనం చేవురా !... అల్లా నిన్ను క్షమించడు!..." ఆవేశంగా చెప్పాడు.


“నీవు చెప్పింది తప్పు... ఏ పనీపాట లేకుండా అడ్డదిడ్డాలుగా తిరిగేవాడికి పని... పనిని... కల్పించాను. బాధ్యత తెలిసేలా చేశాను....”


"ఏమిటి నీవు కల్పించిన పని?... ఏమిటి నీవు వాడికి నేర్పించిన బాధ్యత?... జనాలను చంపడమా!... తమ్ముడనే విచక్షణ లేకుండా వాడు నా చిన్నకొడుకు సుల్తాన్ ను చంపేసాడు.” అరిచాడు సయ్యద్ సార్...


“ఏంటీ.... వాడు నీ చిన్నకొడుకును చంపేశాడా!?...” కొనితెచ్చుకొన్న ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు ఖాజా...


"రేయ్... ఖాజా... నీకు అంతా తెలుసు. ఆ నేరాన్ని నుంచి వాణ్ణి తప్పించాలని నీవే ఎక్కడో దాచావు... నిజం చెప్పు.. ఎక్కడ దాచావో!...” దీనంగా అడిగాడు సయ్యద్.

నౌకర్ వచ్చి ఎవరో ఇద్దరు వచ్చినట్టు చెప్పాడు.


"మీరు ఆ గదిలోకి వెళ్లండి... కస్టమర్స్ వచ్చారు. వ్యాపార విషయం మాట్లాడాలి..." సౌమ్యంగా చెప్పాడు ఖాజా.

సయ్యద్... మౌనంగా ఎదుటివైపున ఉన్న గదిలో ప్రవేశించాడు.

నౌకరుతో... “వాళ్లని లోనికి పంపు..." చెప్పాడు ఖాజా...


అతను వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లో ఇరువురు యువకులు... ముప్పై... ముప్పై అయిదు ప్రాయం... లోనికి వచ్చి ఖాన్ కు విష్ చేశారు. ఖాజా... వారిని కూర్చోమన్నాడు. ఇరువురూ టేబుల్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు.

"ఎంత కావాలి?..."

“కాల్ కిలో...”


ఖాజా వేరే గదిలోకి వెళ్లాడు. ఐదునిముషాల తర్వాత చేతిలో ఒక ప్యాకెట్తో వచ్చాడు. వారికి ఇచ్చాడు.

వారిలో ఒకతను ఖాజాకు డబ్బు ఇచ్చాడు. ఖాజా తీసుకొని లెక్క పెట్టుకొన్నాడు... ఆ యిరువురూ వెళ్లిపోయారు.


ఖాజా కుర్చీనుండి లేచి సయ్యద్ వున్న గదివైపుకు నడిచాడు. అతని సెల్ మ్రోగింది. సయ్యద్ వున్న గది తలుపును మూసి గడియ బిగించి వచ్చి కుర్చీలో కూర్చుంటూ...


" ఆ... పీర్.... బోల్!...."

.... ..... ....

"హెతినే?..."

.... ..... ....

“కబ్ ఆయేగా!..."

.... ..... ....

"క్యా!... టాక్సీమే హై!..."

.... ..... ....

"హెూ!... హెూ!... జత్తన్ సే ఆరే!..."

.... ..... ....

"ఆగయా క్యా!..." ఆశ్చర్యంతో లేచి రెండు గదులు దాటి బేస్మెంట్ నుండి పై ఫ్లోర్ కు వచ్చాడు. ఆ భవంతి సింహద్వారా ముందు నిలబడ్డాడు.


ఒకవైపు పెద్ద ఇరానీ టీ బిస్కెట్ పలావ్ షాపు... రెండవ వైపు లేడీస్ దుస్తుల షాపు... రెండువైపులా నలుగురు స్త్రీమూర్తుల బొమ్మలు... ఒకవైపు బొమ్మలకు మంచిచీరలు... రెండవ వైపు బొమ్మలకు తొడలవరకు జీన్స్ నిక్కర్లు... టీ షర్టు... స్త్రీ జనాలను గొప్పగా ఆకర్షించే సెట్టింగ్... పై అంతస్తులో లాడ్జీ... భవంతి ముందు ఓలా టాక్సీ ఆగింది. ఇరవై సంవత్సరాల ఇరువురు యువతులు... ముప్పై ఏళ్ల పీర్ దిగారు. టాక్సీవానికి పీర్ డబ్బులిచ్చి... ఎదురుగావున్న ఖాజాసాబ్ కు సలాం చేశాడు. ఖాజా వెనుతిరిగి బేస్మెంట్ ఫ్లోర్ వైపుకు నడిచాడు. ఆ అమ్మాయిల చేతిలోని సూట్కేసులను పీర్ అందుకొని... మెల్లగా.... "నిర్భయంగా రండి... ఆయనే మా బాస్!..." చిరునవ్వుతో చెప్పాడు పీర్.


ఆ యిరువురు యువతులు ఆశ్చర్యంతో పీర్ ముఖంలోకి చూచి పీర్ చెప్పినట్టుగా ఖాజా నడిచిన మార్గంలో నడిచారు.

కొద్ది నిముషాల్లో నలుగురూ బేస్మెంట్ హాల్లో ప్రవేశించారు.

ఖాజా వెనుతిరిగి ముగ్గురినీ చూచాడు.


అతని గడ్డం... నెరిసిన జుట్టూ చూచి ఆ పిల్లలు భయపడ్డారు.

దీనంగా పీర్ ముఖంలోకి చూచారు.

ఖాజా చిరునవ్వుతో...

"భయపడకండి... కూర్చోండి..." చెప్పాడు ఖాజా నవ్వుతూ...

ముగ్గురూ కూర్చున్నారు.


సయ్యద్... తలుపును తడుతున్నాడు.... ఆవేశంతో ఆవైపుకు చూచాడు ఖాజా... వేగంగా లేచి వెళ్లి తలుపు తెరచి తలను లోన పెట్టి...

“హేయ్... బుడా!... బల్వాస్ మత్కర్!... కామ్మోహు... ముగించి వచ్చి నీతో మాట్లాడతా!... నోర్ముయ్!...” ఆవేశంగా చెప్పి... తలుపు మూసి గడియ బిగించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఫోన్ చేసి నాలుగు టీ తెమ్మన్నాడు.


“పీర్... మన బాంబే ఏజంట్ అన్వర్ కు చెప్పాను. ఈ రాత్రికే మీ ప్రయాణం బాంబేకి... సరేనా!... ఆ... అమ్మాయిలూ!... బాంబేలో మీ లైఫ్ చాలా బాగుంటుంది... మంచి జీతం... అన్నివిధాలా ఆనందంగా వుండవచ్చు.. సరేనా!...” నవ్వుతూ చెప్పాడు ఖాజా.

ఇంకా వుంది...



సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



43 views0 comments
bottom of page