top of page

కస్తూరి రంగ రంగా!! 3


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Kasthuri Ranga Ranga Episode 3'

New Telugu Web Series


Written By Ch. C. S. Sarma










(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా మూడవ భాగం


గత ఎపిసోడ్ లో

బ్రహ్మయ్య ఇరవై లక్షలు కిడ్నాపర్లకు ఇచ్చి , తన మనవడు శాలివాహనను విడిపించుకుంటాడు.

ఇంటికి వచ్చి, జరిగిన కథను వివరిస్తాడు.

ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3 చదవండి...



పోలీస్టేషన్...

సుల్తాన్ కుర్చీలో కూర్చొని, క్రింద తనకు దగ్గరలో కూర్చొనివున్న ఒక వ్యక్తిని విచారిస్తున్నాడు. అతని కాలికి తుపాకి గుండు తగిలింది. హాస్పటల్ కు తీసుకెళ్లి తుపాకీగుండును తీయించి డ్రసింగ్ చేయించి... ఇంజక్షన్, మందులు ఇప్పించి జైలుకు తీసుకొని వచ్చారు పోలీసులు....


"రేయ్!... నిజం చెప్పు... నీతో ఎంతమంది వచ్చారు?....

“ఇద్దరు సార్!...”


“వాళ్ల పేర్లు?...”

"తెలీదు సార్....”


"నిజం చెప్పు...”

“చెప్పింది నిజమేసార్!...”

“వాళ్లది ఏవూరు?...''

“తెలియదు సార్!..."


"నిజంగా!...."

"నిజంగానే సార్... నేను సెప్పింది నిజం..." భోరున ఏడ్చాడు…


"గంగరాజూ!..." సుల్తాన్ హెడ్ కానిస్టేబుల్ని పిలిచాడు.

"సార్!..."


“వీడు ఈరీతిగా నిజాన్ని చెప్పడు... సెల్లోకి తీసుకెళ్లి మన ట్రీట్మెంట్ ను ప్రారంభించండి... నిజాన్ని వాడి నోటితో కక్కించండి..." నవ్వుతూ చెప్పాడు సుల్తాన్.


పోలీసు సోము వాణ్ణి గదిలోకి తీసుకొని వెళ్లారు... తోటే గంగరాజు కూడా వెళ్లాడు.


“ఒరేయ్!... వాళ్లిద్దరూ ఎవరో... ఏవూరో... వాళ్లకు నీకూ వున్న సంబంధం ఏమిటో చెప్పు. నీ కాలికి దెబ్బ తగిలినందున నిన్ను మంచి మాటలతో నిజం చెప్పమని అడుగుతున్నాము. నీ కాలిగి గాయం కాకపోతే నీచేత ఈపాటికి నిజాన్ని చెప్పించేవాళ్లం... మమ్మల్ని బుకాయించి మోసం చేయాలనుకొంటే... నీకు నరకాన్ని చూపిస్తామ్... చూడు... బుద్ధిగా నిజం చెప్పరా... నీ మంచి కోరి చెబుతుండా!... దెబ్బలు తినకుండా నిజం చెప్పు!..." అనునయంగా చెప్పాడు హెడాకానిస్టేబుల్ గంగరాజు.


సుల్తాన్ అతన్ని పిలిచాడు.

అతని గొంతును విన్న గంగరాజు సుల్తాన్ని సమీపించాడు.

"సార్!...”

“పదండి... ఆ స్పాట్ కు ఒకసారి వెళ్లి వద్దాము..."

ఇరువురూ జీప్ లో కూర్చున్నారు.

డ్రైవరు జీప్ స్టార్ట్ చేశాడు.

ఎక్కడికి వెళ్లవలసింది ముందు సీట్లో కూర్చున్న సుల్తాన్ డ్రైవర్ కి చెప్పాడు...


జీప్ పూరిని దాటి పంటకాలవ ఎడమచేతి వైపు గ్రావెల్ రోడ్ పైన ముందుకు సాగింది.

జీప్ గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని సమీపించింది.

“ఆపు...” అన్నాడు సుల్తాన్.


డ్రైవరు సోము జీపును ఆపాడు... సుల్తాన్, గంగరాజు దిగారు.

గత రాత్రి... ఆ కిడ్నాపర్స్ ను బ్రిడ్జి ప్రారంభంవరకు జీప్ లో ఫాలో చేశారు. బ్రిడ్జికి ముందు జీప్ టైర్ పంచరయింది. ఆ కిడ్నాపర్స్.... హీరో హెూండాపై వేగంగా బ్రిడ్జిపైన ముందుకు వెళ్లిపోయారు. జీప్ ప్రాబ్లమ్ తో సుల్తాన్, గంగరాజులు వారిని ఫాలో చేయలేకపోయారు.


డ్రైవరు సోము... జీప్ టైర్ ఆ చీకటిలో మార్చేటప్పటికి పాతిక నిముషాలు గడచిపోయాయి.


సుల్తాన్... ఆ ప్రాంతాన్ని ఎంతో పరీక్షగా చూచాడు. సిల్వర్ రింగ్ ఒకటి కనిపించింది. దాన్ని చేతికి తీసుకొన్నాడు.

తన చేతికి ఓ సిల్వర్ రింగ్ వుంది. దాన్ని... దొరికినదాన్ని మార్చి మార్చి చూచాడు. అతని మనస్సున ఏదో సంశయం... జీప్ ను వెనక్కు తిప్పమని డ్రైవర్ సోముకు చెప్పాడు.

సోము జీవ్ను వెనక్కు త్రిప్పాడు. అరగంటలోపల వూర్లోకి వచ్చేశారు.

"సోమూ!... నన్ను ఇంటి దగ్గర దించు!..." చెప్పాడు సుల్తాన్...

“అలాగే సార్!..."


జీప్ సుల్తాన్ ఇంటిముందు ఆగింది. అతను దిగాడు. భోంచేసి గంట తర్వాత రమ్మని సోముకు చెప్పాడు.


గంగరాజు, సోము జీప్ లో వెళ్లిపోయారు.

సుల్తాన్ సాలోచనగా ఇంట్లోకి ప్రవేశించాడు.


తండ్రి సయ్యద్... తల్లి ఫాతిమా అతన్ని చూచి నవ్వుతూ పలకరించారు.

"భోంచేయబోతున్నాను. నీవూ వచ్చావ్... కాళ్లు చేతులు కడుక్కొనిరా!... భోంచేద్దాం..." చెప్పాడు సయ్యద్.


తల ఆడించి రెస్టురూమ్ కు వెళ్లి పది నిముషాల్లో బయటికి వచ్చాడు.

ఫాతిమా ఇరువురికీ భోజనాన్ని అందించింది.


సాధారణంగా ఆ తండ్రీ కొడుకులు కలసి భోంచేసే సమయంలో వూరి కబుర్లు... రాజ్యాంగ సమాచారాలు... నాయకుల మనస్తత్వాలను గురించి.... చర్చించుకొంటూ భోంచేయడం వారికి అలవాటు.


మౌనంగా... ఏదో ఆలోచనతో భోంచేస్తున్న సుల్తాన్ని చూచిన తల్లికి తండ్రికి ఆశ్చర్యం...

"ఛోటే... క్యా బాబా... గప్ చిప్ హై!..." అడిగాడు సయ్యద్.


"నిన్న జరిగిన విషయాన్ని గురించి... దొరికిన వాడిని ఎన్నివిధాలా అడిగినా... నిజం చెప్పడం లేదు. వీడితో కలిపి ఆ కిడ్నాప్ ను సాగించింది ముగ్గురట.... ఆ ఇద్దరూ పారిపోయారు. జీప్ టైర్ పంచర్ కాకపోతే... ఆ ఇరువురినీ నిన్న రాత్రే పట్టుకొని వుండేవాడిని. బాబా!... ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్లాను. అక్కడ నాకు ఒక సిల్వర్ రింగ్ దొరికింది... మీరు భోంచేయండి.. చూపిస్తాను..." మెల్లగా చెప్పాడు సుల్తాన్.


సయ్యద్ కు ఇరువురు మొగపిల్లలూ... ముగ్గురు ఆడపిల్లలు. మొదటి ఇద్దరూ ఆడపిల్లలు... వారి వివాహాలు అయినాయి. మూడవవాడు ఇర్ఫాన్... గ్రాడ్యుయేట్.... హైదరాబాదులో వారి మేనమామ ఖాజాసాబ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రిందట వివాహం అయింది. అమ్మాయిది హైదరాబాదే. సంవత్సరం లోపలే బేధాభిప్రాయాలు కారణంగా 'తల్లాక్' పలికి ఇరువురు విడిపోయారు. ఆ అమ్మాయి ఆరునెలల లోపలే మరొకరిని వివాహం చేసుకొంది. ప్రస్తుతానికి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.


ఇర్ఫాన్... అన్ని అలవాట్లు ఉన్నాయి. రౌడీగా మారిపోయాడు. అతని తమ్ముడు సుల్తాన్ పోలీస్ ట్రైనింగ్ ముగించి మూడు సంవత్సరాలుగా వుద్యోగంలో వున్నాడు. ప్రస్తుతంలో అతను సబ్ ఇస్పెక్టర్. నిప్పులాంటి మనిషి... దేనికీ ఎవరికీ భయపడడు. కర్తవ్య నిర్వహణలో తన మన పరాయిల బేధం లేదు. ధర్మం.... నీతి... న్యాయం... సత్యం... ఈ నాలుగు లక్షణాలను అభిమానించి గౌరవించి పాటించే తత్వం సుల్తాన్ ది.


చివరి సంతతి బషీర్ ఆడబిడ్డ... వివాహం జరిపించాలి... సయ్యద్ సార్... సంబంధాలను విచారిస్తున్నారు. ఫాతిమాకు ఆమె దగ్గరిలో వుండాలనే ఆశ. అర్ధాంగి ఆశను తీర్చే ప్రయత్నంలో సంబంధాలను విచారిస్తున్నారు సయ్యద్.

భోజనం అయింది. ఇరువురూ చేతులు కడుక్కొన్నారు.


ఇంటి ముందు వరండాలోకి వచ్చి తండ్రి కొడుకులు కూర్చున్నారు. జేబునుండి సిల్వర్ రింగ్ ను తీసి సుల్తాన్ తన తండ్రి చేతికి ఇచ్చాడు. సయ్యద్ ఉంగరాన్ని పరీక్షగా చూచాడు. అతని ముఖంలో రంగు మారింది.


సుల్తాన్ తన చేతికి వున్న రింగ్ ను తీసి తండ్రి చేతిలో వుంచాడు. సయ్యద్ రెండు ఉంగరాలను రెండు చేతుల్లో పెట్టుకొని పరీక్షగా చూచాడు.


సుల్తాన్ దీక్షగా తండ్రి ముఖంలోకి చూస్తున్నాడు.

సయ్యద్ కళ్లల్లో నీళ్లు... దీనంగా సుల్తాన్ ముఖంలోకి చూచాడు.


"బాబా!... ఆ రింగులు రెండూ!...".

"నేను... నీకు... మీ అన్నకు చేయించి ఇచ్చినవి."


కుడిచేతిలోని రింగ్ను చూపుతూ... "ఇది ఇర్ఫాన్ ది.. సుల్తాన్!..." విచారంగా చెప్పాడు సయ్యద్.

"బాబా!... అంటే ఆ పారిపోయిన ఇద్దరిలో!..."


"ఒకడు మీ అన్న ఇర్ఫాన్... సందేహం లేదు సుల్తాన్!...”

"బాబా!... ఇపుడు నేను ఏంచేయాలి?...”

"నీవు ఏంచేయాలనుకుంటున్నావ్?..." ఆవేశంగా అడిగాడు సయ్యద్.

"హైదరాబాదు వెళ్లి వాణ్ణి ఆరెస్టు చేయాలనుకుంటున్నాను... బాబా... అది నా ధర్మం!..."


“అవును!... ఎలాంటి సందేహం లేకుండా వాణ్ణి అరెస్టు చెయ్యి!...”.

వరండాలోకి వచ్చిన ఫాతిమా సయ్యద్ చివరి మాటలను విని... "ఎవరిని చేయాలండీ ఆరెస్టు?...." అడిగింది.


తండ్రీ కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

“అడిగిన దానికి జవాబు చెప్పండి?...” అడిగింది ఫాతిమా.


"నీ పెద్దకొడుకు ఇర్ఫాన్ ను!.. బ్రహ్మయ్యగారి మనుమడిని కిడ్నాప్ చేసి ఇరవైలక్షలు కాజేసిన వారిలో నీ పెద్దకొడుకు ఒకడు. ఇదిగో సాక్షి!..." తన చేతిలోని సిల్వర్ ఉంగరాన్ని ఫాతిమా చేతిలో వుంచాడు సయ్యద్.


ఫాతిమా ఆశ్యర్య పోయింది. సయ్యద్ లేచి ఇంట్లోకి వెళ్లాడు. సుల్తాన్ తల్లి ముఖంలోకి చూచాడు.

"అన్న తప్పు చేశాడమ్మా!... శిక్షను అనుభవించక తప్పదు..." మెల్లగా చెప్పాడు.

వాకిట్లో జీప్... హారన్ వినిపించింది.....

సుల్తాన్ లేచి జీప్ వైపుకు నడిచాడు. ఫాతిమా ఏడుస్తూ... ఇంట్లోకి వెళ్లింది...


స్టేషన్కు వెళ్లిన సుల్తాన్... మనస్సులో కల్లోలం... ఆ కిడ్నాపర్స్ లో ఒకడు తన అన్న.. వాడు వుండేది హైదరాబాద్. తోళ్ల వ్యాపారి ఖాజా సాబ్ కు రైట్ హ్యాండ్... వారు మామా అల్లుళ్లు…


సుల్తాన్ హైదరాబాద్ వెళ్లటానికి నిశ్చయించుకొన్నాడు. హెడ్ కానిస్టేబుల్ గంగరాజుకు విషయం చెప్పాడు.

"ఇంట్లో విషయం చెప్పి నేను మిమ్మల్ని కల్సుకొంటాను సార్..."


"నీ ఇల్లు దార్లోనేగా.. హైదరాబాద్ వెళుతున్నానని ఇంట్లో చెప్పి రెడీగా వుండు. నేను వచ్చి పికప్ చేసుకొంటాను..."

"అలాగే సార్...." గంగరాజు సైకిల్ పైన ఇంటికి వెళ్లాడు.


సుల్తాన్ ఇంటికి వచ్చాడు.

తల్లి తండ్రి విచారంగా కూర్చొని వున్నారు. ఇరువురి ముఖాలను పరీక్షగా చూచాడు సుల్తాన్…


తల్లిముందు మోకాళ్లమీద కూర్చున్నాడు.

“అమ్మా!... అన్న తప్పుచేశాడు. నేను హైదరాబాద్ వెళ్లి వాడిని పట్టుకోవాలి. బయలుదేరనా!... వద్దా!...” విచారమైన నవ్వుతో అడిగాడు.


ఫాతిమా కన్నీళ్లతో సుల్తాన్ ముఖంలోకి చూచింది.

"నీవు ఏంచేయాలనుకుంటున్నావు?...” ఫాతిమా ప్రశ్న....

"అమ్మా!... ద్రోహిని శిక్షించటం నా ధర్మం!...”.


పమిటితో కన్నీటిని తుడుచుకొని....


“వాడు నిజంగా ద్రోహి అయితే శిక్షించు!..."


“వాడు ద్రోహి కాదో లేదో... ఈ వుంగరాన్ని చూస్తే మీకే తెలుస్తుంది....” జేబులోని సిల్వర్ ఉంగరాన్ని తల్లికి చూపించాడు.


"ఫాతిమా!... ఆ పుంగరం ఇర్ఫాన్ దే. ఐదేళ్లనాడు నేను ఇద్దరికీ చేయించాను....” చెప్పాడు సయ్యద్.

“అంటే... వాడు ద్రోహి అని మీరు నిర్ణయించారా?....”


“నేను కాదు నిర్ణయించింది... సుల్తాన్ కు చిక్కిన సాక్ష్యం...”

"అది వాడిదేనని మీరు రూఢిగా ఎలా చెప్పగలరు?.....”


“ఆ రెండు ఉంగరాలను చేయించింది నేను కాబట్టి...”

ఫాతిమా మౌనంగా కన్నీటితో తల దించుకొంది.


"ఏడెనిమిదేళ్ల పసివాణ్ణి కిడ్నాప్ చేసి... ఇరవైలక్షల డబ్బు వసూలు చేశారంటే.... అది ఒక ఇద్దరి పనికాదమ్మా. ఒక ముఠా చర్య... ఆ గుంపును పట్టుకోవాలంటే అన్నను ముందు పట్టుకోక తప్పదు. ఒకవేళ వాడిచేతి వుంగరం వుండివుంటే వాడు నిర్దోషి... వ్రేలికి ఉంగరం లేకపోతే వాడిని దోషిగానే భావించి అరెస్టు చేస్తానమ్మా!.... ఈ నా నిర్ణయం మారదు..." లేచి నిలబడ్డాడు సుల్తాన్.


“సుల్తాన్... నీ నిర్ణయాన్ని ఆ తల్లిని ఈ తండ్రిని చూచి మార్చుకోవద్దు. బయలుదేరు. ప్లీజ్ డు యువర్ డ్యూటీ స్ట్రిక్ట్లీ!..." సయ్యద్ సందేశం.


ఫాతిమా ఇరువురి ముఖాల్లోకి పరీక్షగా చూసింది.

ఇర్ఫాన్ పదేపదే గుర్తుకు రావటంతో ఆ తల్లి హృదయంలో ఎంతో కలవరం... ఆవేదన....


అలాగే... రెండవవాడు సుల్తాన్ కు డ్యూటీ నిర్వహణలో వున్న పేరును మనసున తలచుకొని కొంత సంతోషం...

సుల్తాన్ ఆ తల్లి పాదాలను తాకి... తండ్రిని సమీపించి వారి పాదాలను తాకాడు.


“తు ఇన్సాన్ హై... హమేషా ఇన్సాన్ నియత్కు జితానా తేరా పరజ్ హెూగా బేటా... హైవానియత్కూ దఫాకర్నా తేరా పర్జ్ హెూగా!... అన్నీ ధర్మమ్ కో నిభావో!.... నికలో..." వేదాంతిలా ధర్మసూక్తులను చెప్పాడు సయ్యద్.


సుల్తాన్ వేగంగా నడిచి వీధి గేటును సమీపించి వెనక్కి తిరిగి చూచాడు. తన తండ్రి తల్లి ఒకరి ప్రక్కన ఒకరు వరండాలో నిలబడి తన్నే చూస్తున్నవిషయాన్ని గమనించాడు.


చేతిని పైకెత్తి చిరునవ్వుతో ఆడించాడు. జీప్ లో కూర్చున్నాడు.

డ్రైవరు సోమూ జీప్ ను కదిలించాడు.

సోమూ... సుల్తాన్ చెప్పిన ప్రకారం గంగరాజు ఇంటిముందు జీప్ ను ఆపాడు.


రెడీగా వాకిట్లోవున్న గంగరాజు... జీప్ ఎక్కాడు.

“హైదరాబాద్" చెప్పాడు సుల్తాన్.

సోమూ తల ఆడించాడు.

జీప్ ను ముందుకు నడిపాడు.

ఇంకా వుంది...



సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



42 views0 comments

댓글


bottom of page