top of page

కస్తూరి రంగ రంగా!! 6


'Kasthuri Ranga Ranga Episode 6' Telugu Web Series


Written By Ch. C. S. Sarma
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

ప్రియురాలు మువ్వతో కలిసి గెస్ట్ హౌస్ లో ఉంటాడు భూషణ్ కుమార్.

మల్లేష్ అతన్ని కలిసి, పోలీసులు తనకోసం వెతుకుతున్నట్లు చెబుతాడు.

అతనికి డబ్బులు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళమంటాడు భూషణ్.

సయ్యద్ ను ఒక గదిలో బంధిస్తాడు.

ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 6 చదవండి...


ఆ యిరువురు బాలికలు అమాయకంగా తలలను ఆడించారు. టీ గ్లాసులతో ఓ పదిహేనేళ్ల బాలుడు లోనికి వచ్చాడు. అతను మూగవాడు. పేరు చాన్... పేరుకు తగ్గట్టుగానే చాలా సుందరంగా వుంటాడు. తల్లి తండ్రి లేని అనాధ. ఖాజా ఆదరించాడు. ఇరానీ షాపులో పెట్టాడు.

చాన్ వారిని సమీపించి ఆడపిల్లలకు, పీర్ కు టీ గ్లాసులు అందించాడు. ఖాజావైపుకు వచ్చి గ్లాస్ ను ఇవ్వబోయాడు.


సయ్యద్ తలుపును కాళ్లతో తంతూ ఎక్కువ శబ్దాన్ని చేశాడు. ఖాజాకు ఆవేశం పెరిగింది. వేగంగా కుర్చీనుంచి లేచాడు. అతని చేయి టీగ్లాస్ వున్న చాన్ చేతికి తగిలింది. గ్లాస్ కిందపడి పగిలిపోయింది. టీ నేలపాలైంది. ఆవేశంలో వున్న ఖాజా చాన్ చెంపలు వాయించాడు. చాన్ బాధతో ఏడ్చాడు. వేగంగా బయటకి వెళ్లిపోయాడు.


ఖాజా సయ్యద్ గది తలుపు తెరచి పీర్ ను పిలిచాడు. అతను ఆ గదిని సమీపించాడు. ఇరువురూ ఆ గదిలోకి నడిచారు... లాఫ్ట్ పైన వున్న గోనె సంచిని తీసి... సయ్యద్ కాళ్లూ చేతులు, మెడను గట్టిగా కట్టేసి.. నోట్లో గుడ్డలను తురిమి ఆ సంచిని అతనికి తొడిగి ఆ సంచి మూతిని గట్టిగా బిగించి గదిలో ఓమూల పడేసి చేతులు దులుపుకొన్నారు.

"రేయ్!... పీర్!..."

“హా... సాబ్...”

“వీడెవడో తెలుసా!...".

"తెలీదు సాబ్...."


“మన ఇర్ఫాన్ తండ్రి... ఇర్ఫాన్ని పోలీసులకు అప్పగించాలని వచ్చాడు... వీడిని మూసీనది బురదలో పారేయాలి. వీడు చావాలి... టాక్సీని బులావ్... హెూటల్లో పనిచేసే ఇద్దరిని పిలుస్తాను. ఆ మూటను టాక్సీలో వేసుకొనిపోయి మూసీ నదిలో బాగా తుంగ పెరిగిన చోట పారెయ్యాలి. సరేనా!..."


తల ఆడించాడు పీర్....

ఇరువురూ గదినుండి బయటకు నడిచి తలుపు బిగించారు. ఖాజా టాక్సీవాలాకు ఫోన్ చేశాడు.


“పీర్!..."

"సాబ్..."

"ఇన్ దోనోంకో లాడ్జి రూమ్ మే చోడ్కర్ ఆనా!..."

"జీ..సాబ్!..." ఆ పిల్లలను చూస్తూ..., "మీరు నాతో రండి. పైన మన లాడ్జిరూమ్ లో భోంచేసి విశ్రాంతి తీసుకొందురుగాని.... టికెట్లు వస్తాయి... రాగానే బస్టాండ్ కు బయలుదేరుతాము. ఈ లోపల నాకు వేరే పని వుంది. దాన్ని ముగించి నేను మీ గదికి వస్తా... రాగానే మనం బయలుదేరుదాం..." విశ్వసనీయంగా మెల్లగా చెప్పాడు పీర్.


ఆ ఇరువురు తలలాడించారు. వారి బ్యాగులను చేతికి తీసుకొన్నాడు పీర్. ముగ్గురూ ఆ గదినుండి బయటకు వచ్చి పై అంతస్తులోని లాడ్జిలో ప్రవేశించారు. ఓగది రూమ్ తలుపు తెరచి వారిని లోనికి వెళ్లి తలుపు మూసుకోమని చెప్పాడు పీర్. బ్యాగ్ తో వారు లోనికి వెళ్లి తలుపు మూసుకొన్నారు. పీర్ క్రిందికి నడిచాడు.


ఓలా టాక్సీ వచ్చింది... బేస్మెంట్ కు చేరాడు పీర్. ఖాజా ముందు గన్నీ బ్యాగ్.... ఇరువురు మనుష్యులు సిద్ధంగా ఉన్నారు. మూటను ఆ ఇరువురూ ఎత్తుకొని పైకి వచ్చి టాక్సీ డిక్కీలో వేశారు. పీర్ డ్రయివర్ ప్రక్కన కూర్చున్నాడు. టాక్సీ కదిలింది. మూగవాడు ఆ సన్నివేశాన్ని చూచాడు.


ఎవరికంటా పడకుండా మూగ మస్తాన్ రోడ్లో ప్రవేశించాడు. సయ్యద్ ను డిక్కీలో వేసుకొని పోతున్న ఆ టాక్సీని మరో టాక్సీలో కూర్చొని ఫాలో చేశాడు.


ఆ టీస్టాల్ చాలా ఫేమస్, మూగ మస్తాన్ కు 'టివ్స్' రోజుకు ఐదారువందల పైగా వస్తాయి. ఆరోజు అప్పటికి నాలుగువందల అరవై టిప్ దొరికింది. మ్యానేజర్ కు కడుపునొప్పిగా వుందని చెప్పి బయలుదేరాడు.


సయ్యద్ టాక్సీ లకిడీకాపూల్ ప్రక్కగా కొంతదూరం వెళ్లాక పీర్ టాక్సీని ఆపమన్నాడు. డ్రైవరు టాక్సీని ఆపాడు. డ్రైవర్ కు అనుమానం రాకుండా తాను దిగి వెనక్కు వెళ్లి డిక్కీ తెరచి ఆ మూటను కిందకు దింపాడు పీర్.

డ్రైవరుకు డబ్బు ఎంతని అడిగి, అతను చెప్పినంత ఇచ్చేశాడు. అతను వెళ్లిపోయాడు. సన్నటి తూర ప్రారంభమయింది. కొంతదూరం ఆ సంచిని పీర్ లాక్కొని వెళ్లాడు. వర్షం వేగం పెరిగింది. మూటను రోడ్డు ప్రక్కగా మూసీనది వైపుకు దొర్లించాడు. అది నదివైపు పల్లపు ప్రదేశం. మూట ఆ పల్లంలో పడిపోయింది. పీర్ ఆటో ఎక్కి వెళ్లిపోయాడు.


ఫాలో చేస్తూ వచ్చిన మూగ మస్తాన్ ఆ ప్రాంతానికి వచ్చి టాక్సీని ఆపాడు. దిగి రోడ్డు ప్రక్కన మూసీనది ఒడ్డున పరీక్షగా చూచాడు. పల్లంలో మూట కనిపించింది. మస్తాన్ కు అతన్ని కాపాడాలనే సంకల్పం... సయ్యద్ కాళ్లూ చేతులతో సంచిని కదిలేలా చేయసాగాడు.


మూగ మస్తాన్ ఆ టాక్సీ డ్రైవర్ కు సైగతో చెప్పి... ఇరువురూ ఆ మూటను సమీపించారు. వర్షం కురుస్తూ వుంది. అతికష్టంమీద మూటను విప్పారు. సయ్యద్ నోటిలోని గుడ్డను, అతని కాళ్లకు చేతులకు కట్టిన తాడు కట్లను విప్పారు.


సయ్యద్ చంకలో తమ చేతులను వేసి టాక్సీ దరికి చేర్చి వెనుక సీట్లో కూర్చోపెట్టారు. మూగమస్తాన్ తో సయ్యద్ మాట్లాడ ప్రయత్నించాడు. తాను మాట్లాడలేనని మూగ మస్తాన్ సైగలతో చెప్పాడు.


సయ్యద్ టాక్సీని ఇమ్లీ బస్టాండుకు వెళ్లవలసిందని చెప్పారు. అరగంటలో టాక్సీ బస్టాండుకు చేరింది. సయ్యద్ టాక్సీవాలాకు డబ్బులిచ్చాడు. అతను వెళ్లిపోయాడు. సయ్యద్ విజయవాడ బస్సు ఎక్కి మస్తాన్ ను తనతో రమ్మన్నాడు. సైగలతో సయ్యద్ కు జాగ్రత్తలు చెప్పి మస్తాన్ వెళ్లిపోయాడు. విజయవాడ బస్సు కదిలింది.. టికెట్ తీసుకొని సయ్యద్ కళ్లు మూసుకొన్నాడు.

***

రంగా తన నిలయానికి చేరాడు. స్నానం చేసి కాళీమాత ఆలయానికి వెళ్లి మాతను దర్శించి... పేదలకు కానుకలను అర్పించి... లేక్ మార్కెట్ ప్రాంతంలోని తన గదికి చేరాడు. ఒకటి కాదు... రెండు కాదు... పదిహేను సంవత్సరాలు... ఆ మహానగరంలో శాంతినికేతన్ లో చదువు పేరున తన జీవితం దశలవారీగా సాగింది. ఉద్యోగంలో చేరి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ప్రస్తుతంలో... తాను కోరిన విధంగా తెలంగాణాకు... ఎస్.పి., హెూదాలో... బదిలీ అయింది.


తన ఉన్నతికి కారకులు ఇరువురు... మొదటి వ్యక్తి చిన్ని... రెండవ వ్యక్తి శశాంక్... తన బావగారు... చిన్నీ అన్నయ్య... భోజనం చేసి వచ్చి చిన్నీకి ఫోన్ చేశాడు.

రంగా: “హలో!..."

చిన్ని: " ఆ... చెప్పండి... ఎలా వున్నారు?"


రంగా: "అంతా కుశలమేనా!... నీకు ఒక శుభవార్త!..."

చిన్ని: "ఏమిటది?...”

రంగా: “వూహించు...”

“నిద్ర వస్తోంది...” గోముగా అంది చిన్ని...

రంగా: "ఏం... అపుడే నిద్రా!... భోంచేశావా!... డాక్టర్ దగ్గరకు వెళ్లావా?..."

చిన్ని: "ఆ..."

రంగా: "డాక్టర్ ఏంచెప్పింది... అంతా ఓకేనా!..."

చిన్ని: “అవును...”

రంగా: "డేట్ ఎపుడో చెప్పిందా!...".

చిన్ని "ఈసారి టెస్టింగ్ టైమ్ లో చెబుతానంది. అన్నయ్య వదినా నన్ను కదలనివ్వడం లేదు. ఇక నా చెల్లెళ్లు కవిత కమలలు నన్ను ఎంతో అభిమానంగా చూచుకొంటున్నారు ..... నాకు ఏ దిగులూ లేదు. ఒక్క మీకు దూరంగా ఉన్నాననే చింత తప్ప!..."

ఆమాట అన్నపుడు చిన్నీ కళ్లల్లో కన్నీరు...

విన్న రంగ నేత్రాల్లో తడి…


రంగా: “చిన్నీ!...”.

చిన్ని: “చెప్పండి...”

రంగా: “ఇరవైనాలుగ్గంటల లోపల నీ సాన్నిధ్యంలో వుంటాను...”

చిన్ని: ఆ... చెప్పు...

రంగా: కలకత్తా నుంచి నీకు ఏ తెచ్చేది?...”


"మీరు చెప్పింది నిజమేనా!... మీకు ట్రాన్సఫర్ అయిందా!..." ఆత్రంగా అడిగింది చిన్ని.

" అయింది... ఐ గాట్ ది ఆర్డర్... బావగారు ఇంట్లో వున్నారా?...” అడిగాడు కస్తూరి రంగా.

“ఆ.. ఏమండీ !...” పిలిచింది చిన్నీ...

రంగా: "ఆ!... చెప్పు....”

"నాకు చాలా సంతోషం..." ఆనందంగా నవ్వింది చిన్ని.


"నీవు అన్నమాట మూలంగా నాకూ ఎంతో సంతోషం... చిన్నీ.. నీవు అనేదానివే లేకుంటే... ఈ రంగా గాడు ఏమైపోయివుండేవాడో!..." రంగా కళ్లల్లో కన్నీరు.

అవి కృతజ్ఞతాపూర్వక ఆనందభాష్పాలు....


"మీరు లేకుంటే నేను ఏమైపోయివుండేదాన్నో...” విచారంగా నవ్వింది చిన్ని.

"అమ్మా!... ఎవరూ... రంగానా!...” అడిగాడు శశాంక్... తాను ఆమె గదిలోకి రాగానే…

"ఆ... అవునన్నయ్యా... వారికి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయిందట” ఆనందంగా చెప్పి... సెల్ ను అన్నయ్య చేతికి అందించింది.


“హలో!...” శశాంక్ మాట

"ఆ... బావగారూ!... ఐగాట్ ది ట్రాన్స్ఫర్... రేపు సాయంత్రం నేను ఆరుగంటలకల్లా ఢిల్లీ చేరాను..." సంతోషంగా చెప్పాడు రంగా.


"ఓకే... ఓకే... గ్రేట్... గ్రేట్..." ఆనందంగా చెప్పాడు శశాంక్,

వారు భార్య నిర్మలను, కుమార్తెలు కవిత కమలలను పిలిచారు.

అందరూ ఆ గదిలోకి వచ్చారు.

రంగా ట్రాన్సఫర్... రాకను గురించి చెప్పాడు శశాంక్.

అందరికీ ఎంతో ఆనందం.


చిన్నీకి మూడవ మాసం. వదిన నిర్మల... ఆమెను కన్నతల్లిలా చూచుకొంటూవుంది. చిన్నీ... బ్యాంక్ మేనేజరు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... కలకత్తా నుంచి ట్రాన్స్ఫర్ అయి రెండు నెలలు.


అందరూ కలసి ఆనందంగా కబుర్లతో రంగా రాకను గురించిన మాటలతో భోంచేశారు... కొంతసేపు టీవీ వీక్షణం... ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించారు.


మరుదినం... అందరికన్నా ముందు చిన్నీ లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేసి డ్రస్ చేసుకొని ఆనందంగా తయారయింది. రంగా ఫోన్ చేశాడు. ఇరువురూ సంతోషంగా కొన్ని నిముషాలు మాట్లాడుకొన్నారు. టిఫిన్ చేసి బ్యాంకుకు వెళ్లిపోయింది. రెండు రోజులు లీవ్ అప్లయ్ చేసింది. ఆనందంగా ఎయిర్పోర్టుకు వెళ్లి రంగాను రిసీవ్ చేసుకోవాలని క్రిందికి దిగింది.


ఎదురుగుండా నవ్వుతూ తన అన్నయ్య శశాంక్...

"ఏమమ్మా!... ఎయిర్పోర్టుకేగా!!..”.


“అన్నయ్యా!..." ఆశ్చర్యంతో చూచింది చిన్నీ.

"నాచెల్లి మనస్సు నాకు తెలియదా!..." సంతోషంగా నవ్వాడు శశాంక్.


ఇరువురూ చిన్నీ కార్లో కూర్చున్నారు. కవిత కమలలు శశాంక్ కార్లో ఇంటికి వెళ్లిపోయారు.


ఆడీ కారు గంటలోపల ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టును చేరింది. కారును పార్క్ చేసి శశాంక్, కస్తూరీలు ఎరైవల్ గేట్ ముందు నిలబడ్డారు. రంగా ఫ్లయిట్ దిగాడు... తన బావ శశాంక్ పంపిన మెస్సేజీని చూచుకొన్నాడు. బెల్ట్ మీది లగేజీని తీసుకొని ట్రాలీతో వేగంగా బయటకు వచ్చాడు కస్తూరి రంగా ఆనందంగా…


తన అర్థాంగిని... బావగారిని సమీపించాడు.

డిక్కీలో లగేజిని వుంచి... ముగ్గురూ కార్లో కూర్చున్నారు. కస్తూరి పదనంలో కోటి జ్యోతుల దివ్య కాంతి.

భార్యా భర్తలు... కళ్లతోనే పలకరింపులు... ఇరువురి వదనాల్లో ఎంతో ఆనందం…


శశాంక్: "రంగా!..."

రంగా: "బావా!...".


"మీ బాస్... మనోజ్ చక్రవర్తి... నిన్ను వదిలేదానికి ఇష్టపడ్డాడా..." అడిగాడు. శశాంక్ నవ్వుతూ…


రంగా: "బావా!... జరిగిన దారుణ హింసా కాండకు సంబంధించిన వార్తలను వారు టీవీల్లో విని... చూచారు. నా వీపు తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు... ఎపుడు ఏది అవసరమైనా ఫోన్ చేయమని మరీమరీ చెప్పారు. వారు గ్రేట్ మ్యాన్ బావా!..."

"అవును... రెండు నెలల క్రిందట చిన్నిని తీసుకొని వచ్చేదానికి వచ్చినపుడు పరిచయం చేశావుగా... చాలా మంచి వ్యక్తి... మానవతావాది..." చిరునవ్వుతో చెప్పాడు శశాంక్.


"అమ్మా.." పిలిచాడు శశాంక్....

"అ... చెప్పన్నయ్యా...”


"ఏమ్మా!... ఏమీ మాట్లాడవేం?... నవ్వాడు శశాంక్,

"మీ బావామరదుల మాటల మధ్యన నేను కల్పించుకోవడం... భావ్యం కాదు. కదా అన్నయ్యా... అంటావ్... అంతేనా!...” చిన్నీ పూర్తి చేయకముందే శశాంక్ చెప్పి నవ్వాడు.


రంగ... చిన్నీలు కూడ ఆనందంగా నవ్వారు.

"చిన్నీ!..." పిలిచాడు రంగా.


శశాంక్... తల త్రిప్పి రంగా ముఖంలోకి చూచి నవ్వుతూ... “చిన్నీ!...” శశాంక్ పిలిచాడు... “దేన్ని గురించి అమ్మా ఆలోచన?..."


"అన్నయ్యా!... అదీ.." అగిపోయింది చిన్నీ.

ముందు సీట్లో కూర్చొని వున్న రంగా వెనక్కు తిరిగి రెండు సీట్ల మధ్యనుంచి చిన్నీ ముఖంలోకి చూచాడు నవ్వుతూ రంగ...


"నేటికి నీ ఆశయం నెరవేరింది కదా!" నవ్వుతూ చెప్పాడు కస్తూరి రంగా.

"అవునండి!... నాకు చాలా ఆనందంగా వుంది.... చిరునవ్వుతో చెప్పింది.


"చెల్లెమ్మా!... ఆనందం నీ ఒక్కదానికే కాదు నాకునూ!..." చిలిపిగా నవ్వుతూ చెప్పాడు శశాంక్.


సరదా కబుర్లతో... వారు శశాంక్ ద్వారక లోని నిలయాన్ని చేరారు. వాకిట్లో వున్న కవిత కమలలు వారి బావగారిని చిరునవ్వులతో స్వాగతం పలికారు. వరుసకు రంగాకు ఆక్కయ్య అయిన శశాంక్ భార్య నిర్మల నవ్వుతూ ప్రీతిగా రంగా ముఖంలోకి చూచింది.


“అక్కా!... బాగున్నారా!!..” ఆదరంగా పలకరించాడు రంగ.


“ఫైన్... ఫైన్.... తమ్ముడూ!..." చెప్పింది నిర్మల. ఆమె కేంద్రీయ విద్యాలయంలో హెడ్ మిసెస్.

ఆనందంగా నవ్వుతూ అందరూ ఇంట్లోకి ప్రవేశించారు....


"చిన్నీ!..."

"ఏమండీ..."

"ఇండియా గేట్ వరకు అందరం వెళ్లి కొంతసేపు వుండి ఐస్క్రీమ్, నీకు ఇష్టమైన లావెండర్ తిని వద్దామా?..." అడిగాడు కస్తూరి రంగా....


వారి సంభాషణలు విన్న కవిత కమలలు...

“ఎస్...ఎస్... బావా ... వెళదాం..." మహదానందంతో పలికారు.


"ఏం బావా... వెళదామా!..." అడిగాడు రంగా..

“యస్ రంగా!... చాలా రోజులయింది పద..." ఆనందంగా అన్నాడు శశాంక్.


అందరూ రెండు కార్లలో ఇండియా గేట్ ను చేరారు.... నచ్చిన ఐస్క్రీమ్స్ తిన్నారు. ప్రశాంతమైన వాతావరణం... సరదాగా కబుర్లతో తిరిగారు.... కస్తూరి రంగ... అందరినీ ఫొటోలు తీశాడు.


వాహ్యాళి... ఎంతో ఆనందాన్ని... మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది.... అందరూ సంతోషంగా ఎవరి వూహల్లో వారు... ఒకగంట ఆ అతి నిర్మలమైన వాతావరణంలో గడిపి అందరూ ఇంటికి చేరారు.


నిర్మల భోజనాన్ని డైనింగ్ టేబుల్ పై సిద్ధం చేసింది. అందరూ కబుర్లతో... భోజనం ముగించుకొని వారివారి పడకగదులకు వెళ్లిపోయారు.


రంగా తన బావగారితో.....

"బావా!..."

శశాంక్: “చెప్పు రంగా!..."


"ఒకవారం నేను ఇక్కడ వుంటాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళతాను. మనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించేదానికి వసంత్ దేశాయ్ తో సంప్రదించాను. చర్చించాను. హియీజ్ ఆన్ జాబ్... బావా..." సాలోచనగా చెప్పాడు రంగ.


“ఆ... రంగా!... అలాగే వెళుదువుగాని... ఇక్కడ వుండబోయే వారం రోజులు చిన్నీకి ఆనందం కలిగించేరీతిగా ఆమెతో ఎక్కువ సమయాన్ని గడుపు...." చిరునవ్వుతో చెప్పాడు శశాంక్,


"అలాగే బావా!..."

గుడ్నైట్ చెప్పి రంగా బెడ్రూమ్ లో ప్రవేశించాడు.

చిన్నీ రెస్టురూమ్ లో వుంది.

రంగా సెల్ తీసుకొని తన బాస్... మనోజ్ చక్రవర్తికి ఫోన్ చేశాడు.


"హలో!..."

మనోజ్ చక్రవర్తి: "ఆ... రంగా!..."

రంగా: "ఆ.. చేరాను. మా బావగారు... చిన్నీ వచ్చి ఎయిర్ పోర్టులో నన్ను రిసీవ్ చేసుకొన్నారు....."


మనోజ్ చక్రవర్తి: "ఆ.. ఒక సర్క్యులర్ని నీకు పంపాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడు. గుడ్నైట్..."

"థాంక్యూ సార్... గుడ్నైట్!..." రంగా ల్యాప్టాప్ ను ఓపెన్ చేశాడు.


చిన్నీ... రెస్టురూమ్ నుంచి బయటకు వచ్చింది. రంగాను చూచింది....


“హలో... సార్!.. ఇపుడు టైమ్ ఎంత?...".

రంగ చేతివాచిని చూచి “పదకొండు..."


"ఇంకా ఏమి చూస్తున్నారు ల్యాప్టాప్లో?..."

"మెసేజెస్ని చూస్తున్నాను.!..."


"ఇది నిద్రపోవాల్సిన సమయం... శరీరానికి రాత్రిపూట నిద్రమూలంగా విశ్రాంతి అవసరం. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇరవైనాలుగు గంటలలో శరీరం రాత్రిపూట విశ్రాంతిని కోరుకుంటుందని... దానికి వ్యతిరేకంగా నైట్ షిప్ట్ వలన నిద్రాభంగం కలిగి క్యాన్సర్ వచ్చేదానికి కారణం అవుతుందని... డిఎన్ఎ విలువలు కూడ మారుతాయని పరిశోధకులు విశదీకరించారు.


రాత్రి నిద్రలేనందున శరీరంలో దేని లోపం వలన క్యాన్సర్ ఆశిస్తుందనే విషయంపై రీసర్చి జరుగుతూవుంది. ఈ విషయం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. చాలు.. చాలు... దుకాణాన్ని మూసేయండి సార్...." చిరునవ్వుతో రంగా ముఖంలోకి చూస్తూ చిన్నీ ల్యాప్టాప్ ను మూసేసింది.


సెల్ మ్రోగింది... చేతికి తీసుకొన్నాడు రంగ.

“హలో!..."

"సార్!... నేను...”

" ఆ... చెప్పు వసంత్..." అతను పూర్తిచేయక ముందే చెప్పాడు రంగ…


"మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు సార్...." అడిగాడు వసంత్.


"విషయం ఏమిటి?... ఆందోళనగా ఉన్నారు!.....”


"అవును సార్... కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీతో సమక్షంలో చర్చించి చర్య తీసుకోవాలి!..." ఆందోళనగా చెప్పాడు వసంత్…


"ఓకే!... నేను మీకు రేపు వుదయం ఫోన్ చేస్తాను..."

"మీరు ఇపుడు ఎక్కడ వున్నారు సార్!..."


"అది మీకు అవసరమా?...".

“నో...నో... సార్!... జస్ట్ టు నో... సారీ!..."


నవ్వి... రంగా సెల్ కట్ చేశాడు...

చిన్నీ వారి చేతిలోని సెల్ లాక్కుంది... బుంగమూతితో కోపంగా... రంగా ముఖంలోకి చూచింది.


రంగా చిన్నీని సమీపించి తన చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకొని నొసటన చుంబించాడు... ఆమె పైన అతనికి వున్న ప్రేమాభిమానాల ఆనవాలు…

చిన్నీ... పరవశంతో రంగాను చుట్టుకొంది.

ఇంకా వుంది...

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
65 views0 comments

コメント


bottom of page