top of page
Original.png

కోరిక

Apr 2
1 min read

భర్త కోసం టెన్షన్ పడుతున్న భార్య… అసలు విషయం తెలిసాక మీరు కూడా నవ్వుతారు!

Korika - Telugu Comedy Story | Sudhavishwam Akondi

కోరిక - హాస్యభరిత తెలుగు కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 02/04/2026


"ఏమిటే! అటూ ఇటూ అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నావు?" అడిగింది అత్తమ్మ అచ్చమ్మ, కొత్త కోడలు అయిన మేనకోడలు మీనాను


 "ఆయన వచ్చే టైమ్ దాటి మూడు గంటలు అయ్యింది. టెన్షన్ అవుతోంది! అవును, ఇప్పుడు టైమ్ ఎంతవుతోంది?" అంది మీనా


 "ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఏదైనా పని ఉన్నదేమోనే! దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతావు?"


 "ఇవాళ ఎప్పటికంటే ఇంకా ముందే వస్తానని అన్నాడు. మరి, టెన్షన్ కాదా? ఏమైందో ఏమిటో? ఎక్కడికి పోయాడో?" అనుకుంటూ మళ్ళీ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది

 "దీనికి ఏమొచ్చింది! ఇంత టెన్షన్ పడుతోంది! దీనికి ఈ అనుమానం ఏంటి? పెళ్లయి నెల మాత్రమే అయింది, కానీ చిన్నప్పటి నుంచి వాడి గురించి తెలుసు దీనికి!" అనుకుని విచిత్రంగా చూసింది అచ్చమ్మ

 చిన్నప్పటి నుంచి ఒక్కతే కూతురు అవ్వడంతో, చాలా గారాబంగా పెరిగింది. తల్లిగారింట్లో లాగే అత్తగారింట్లో కూడా మేనరికం అవ్వడంతోనేమో, ఆమెను బాగానే చూసుకుంటారు.

 వాళ్లిద్దరూ అత్తా కోడళ్లు పైన డాబా పైన కూర్చుని ఉన్నారు. ఇంతలో పైనుంచి చూసిన మీనాకు, కాస్త దూరంలో భర్త రావడం కనిపించింది.

 "అత్తమ్మా! హమ్మయ్యా! వస్తున్నాడు!" అని పరుగెత్తుకుంటూ కిందకు వెళ్ళింది.


పైనుంచి చూసింది అచ్చమ్మ.


పరుగెత్తుకుంటూ వెళ్ళిన మీనా భర్తకు ఎదురుగా వెళ్లి నిల్చుంది.


 "ఇంత లేట్ అయితే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా! నా గుండె ఆగిపోయినంత పని అయింది!" అంది భర్తతో.


 తనపై ఏర్పడిన విరహ భావనలతో ఇలా ఫీల్ అయిందని నవ్వుతూ చూసిన అతను,


 "ఏం! నా విరహం అంత బాధ కలిగించిందా? ఈ మాత్రానికే?!" అని ఆమె చేయి పట్టుకోబోయాడు.


ఆ వెంటనే ఖంగుతిన్నాడు.



 మీనా వెంటనే అతని చేతుల్లోని కవర్ లాక్కుని ఓపెన్ చేసి చూసి, తృప్తిగా చూసి...


 "హమ్మయ్యా! తీసుకురావేమో అని టెన్షన్ పడ్డాను. తెచ్చావా జిలేబి మొత్తానికి! లేట్ అవుతుంటే భయం వేసింది, ఎగ్గొడతావేమోనని!" అని ఆ కవర్ తీసుకుని ఇంట్లోకి పరిగెత్తింది.


 పైనుంచి చూసిన అత్తా, ఇంటిముందు నిల్చుని ఉన్న భర్తా, ఇద్దరూ తల పట్టుకున్నారు, మీనా తిండి పిచ్చిని తలుచుకుని.



 మరి మీరు ఏమనుకున్నారు? మీకు నచ్చిందా ఈ కథ?


సుధావిశ్వం


  


-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page