top of page

కోతి - మనిషి

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #KothiManishi, #కోతిమనిషి, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ree

Kothi - Manishi - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 11/09/2025

కోతి - మనిషి - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 

తూర్పు కనుమలలో 'కపివనం' అనే ప్రాంతం ఉంది. అక్కడ రకరకాల కోతులు స్వేచ్ఛగా జీవిస్తుంటాయి. అక్కడే ఉన్న ఒక చిన్న కొండ గుహలో ఒక సాధువు, అతని శిష్యుడు నివసిస్తున్నారు. అక్కడే ఒక సుందరమైన జలపాతం కూడా ఉంది. ఆ చుట్టుపక్కల దొరికి పండ్లను, కాయలను తిని ఆ జలపాతం లోని నీరు తాగి, కోతులు జీవించేవి. కోతులు కానీ ఇతర జీవులు కానీ కొండ గుహ వైపు ఏనాడూ వచ్చేవి కాదు. అందువల్ల సాధువు, అతని శిష్యుడు ప్రశాంతంగా జీవించేవారు. 


ఇదిలా ఉండగా కొందరు అన్వేషకులు అడవిలో పర్యటిస్తూ అనుకోకుండా జలపాతం వద్దకు వచ్చారు. ఆ ప్రాంతం వారికి ఎంతో నచ్చింది. ఆ రోజంతా సరదాగా గడిపి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత మరింత మందిని వెంటబెట్టుకుని వచ్చారు. అలా అలా ఆ నోటా ఈ నోటా పడి ఆ ప్రాంతం గురించి చాలామందికి తెలిసింది. దాంతో సెలవు రోజుల్లో ఆ ప్రాంతానికి రావడం మొదలుపెట్టారు. 


అలా వచ్చినవారు రోజంతా ఉండాల్సి వస్తుంది కాబట్టి తమ వెంట ఆహారాన్ని తెచ్చుకునేవారు. వారిలో కొందరు తమకు దగ్గరగా వచ్చిన కోతులకు తాము తెచ్చిన పండ్లు, తినుబండారాలను సరదాగా అందించేవారు. అది చూసిన సాధువు వారిని వారించే ప్రయత్నం చేశాడు. మీరు తెచ్చిన పండ్లను, తినుబండారాలను కోతులకు అందించవద్దని యాత్రికులకు చెప్పేవాడు. అయినా కూడా లెక్క చేయకుండా కొంతమంది వాటికి ఆహారం అందించసాగారు.

 

కొంతకాలం గడిచింది మొదట్లో యాత్రికులు అందించే ఆహార పదార్థాలను సరదాగా తీసుకున్న కోతులు రాను రాను జనం ఎక్కువమంది రావడంతో వాటి పైనే ఆధారపడ సాగాయి. ఆహారం తేలికగా లభించడంతో అడవిలోకి ఆహార అన్వేషణకు వెళ్లకుండా జలపాతం దగ్గరే ఉండసాగాయి. యాత్రికులు ఎక్కువగా వచ్చే రోజులలో వాటికి ఆహారం బాగా లభించేది. 


యాత్రికులు తక్కువగా వచ్చే రోజు వాటికి ఆహారం దొరక్క వచ్చిన యాత్రికుల పైకి దాడి చేసి వారి సంచుల్లో ఉన్నవి లాక్కుపోయేవి. యాత్రికులు రాని రోజు సాధువు నివసించే కొండ గుహలోకి కూడా ప్రవేశించి వారి ఆహార పదార్థాలు ఎత్తుకుపోవడం మొదలుపెట్టాయి. 


ఒకరోజు సాధువు శిష్యుడితో మనం ఇంకా ఇక్కడ ఉండటం క్షేమం కాదు. మరొక చోటు చూసుకుందాం పద అని చెప్పి అక్కడికి దూరంగా మరొక కొండ గుహను నివాసం చేసుకుని ఉండటం మొదలుపెట్టాడు. 


శిష్యుడు సందేహంతో గురువును "అక్కడ మనకు బాగానే ఉంది కదా గురుదేవా! ఎందుకు స్థావరం మార్చారు?" అని అడిగాడు. దానికి సాధువు "ఇంకా అర్థం కాలేదా నాయనా! మొదట్లో కోతులు తమ సహజ ప్రవృత్తికి తగినట్లుగా ఆహార అన్వేషణ గావించి జీవించేవి. 


ఎప్పుడైతే మనుషులు వాటి ఆవాసంలోకి అడుగు పెట్టారో అప్పటినుండి వాటి ఆహారపు అలవాట్లలో తేడా వచ్చింది. మొదట మనుషులు అందించేవి సరదాగానే తీసుకుని తినేవి. కానీ రాను రాను అవి కష్టపడడం వదిలేసి ఉచితంగా లభించే ఆహారం పైనే ఆధారపడడం మొదలుపెట్టాయి. 


తర్వాత దశలో అది తమ హక్కుగా భావించి, బలవంతంగా నైనా సరే మనుషుల నుండి లాక్కోవాలనే ఆలోచనకు వచ్చాయి. ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మన గుహపైన కూడా దాడి చేసి దొంగతనంగానైనా ఎత్తుకుపోవాలనే స్థితికి వచ్చాయి. ఇక ముందు ముందు ఏ విధమైన మానసిక స్థితిలోకి అవి వెళ్తాయో తెలియదు. 


అందుకే స్థావరం మార్చాను. మానవుడు తన అనాలోచిత నిర్ణయాలతో ఇతర జంతువుల జీవన శైలిని కూడా మారుస్తున్నాడు. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది" అన్నాడు. 


 శిష్యుడికి విషయం పూర్తిగా అర్థమైంది. 



పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

Comments


bottom of page