Kukka Buddhiki Pinnu Debba New Telugu Story
Written By Damaraju Visalakshi
రచన: దామరాజు విశాలాక్షి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సినిమా మంచి రసవత్తరంగా ఉంది. అందులో లీనమై చూస్తోంది అలివేలు.
అదే పనిగా పైపైన చేతులు వేస్తున్నారెవరో? ప్రక్కకి చూసింది. పగలుచూస్తే రాత్రి కలలోకి వచ్చేంత పరమ వికారి ఒకడు తన ప్రక్కసీట్లో..
పళ్ళన్నీ ఇకిలించి ప్రక్కకి ముఖం తిప్పి వెకిలిగా నవ్వుతున్నాడు.
“సరిగా కూర్చోండి” హెచ్చరించింది అలివేలు.
"సరిగానే కూర్చునానే.. మీ ఒళ్ళో పడ్డానా?” వాడి వ్యంగ్యం..
పది నిమిషాలు కాకుండావాడి పాపిష్టి చేతులు ప్రక్క టెముకలవరకూ వచ్చి తాకుతున్నాయి.
పళ్ళు పటపట కొరుక్కుంది అలివేలు.
వాడి కాలు తన కాలుని రాయడం మొదలుపెట్టింది. పాపం లేచి వెళదామనుకుంది.
చేయిపట్టిలాగి కూర్చోపెట్టింది స్నేహితురాలు పంకజం.
పాపం దుఃఖంముంచుకొస్తుంది. “పాపిష్టోడు చూడవే.. పాత తారుడబ్బాలా ముఖం వీడూను. నాకు వాడి కూతురు వయస్సుంటుంది.. నాతో పరాచికాలా?” ప్రక్కన కూర్చున్న పంకజంతో అంది గుసగుసగా అలిమేలు.
పంకజం అంది “పది నిమిషాలు ఓపిక పట్టు” అని.
ఒకపెద్ద పిన్ను ఇచ్చింది. పదిలంగా పర్స్ లోంచి తీసిఇచ్చింది..
పళ్ళికిలించి పైన చేయివేసిన ప్రక్కసీటు పాపికి, అరచేతిలో దిగింది పిన్ను.. అరచేతిలోకి బాగా వెళ్ళిందో ఏమో !
అమ్మో! అని పెద్దకేక పెట్టి లేచాడు. అందరూ వెనక్కి తిరిగి చూచారు విసుగ్గా..
“ఏటా అరుపు? అంత నాగ అరవాలేటి..? ఆ సీను చూస్తే అంత భయమయితే కళ్ళుమూసుకో.. భలే ఓడివే, ..
అంతపిరికోడివి సినిమా కెందుకొచ్చినావు? సాల్లే కూర్చో, .. ఇందాకటి నుండి సూత్తన్నా. సీట్లో సరిగా కూసోకుండా
తెగ నులుసుకు పోతున్నాడు. ఎందుకలా నులుసుకు పోతన్నావు.. గమ్మునకూర్చో. మాటాడకు. మంచిసీను వత్తాఉంటే. మధ్యన నీ గోల” తిట్టాడు వెనక సీటతను..
ఆ పల్లెటూరి ఆసామి అయితే, ప్రక్కకి తల త్రిప్పకుండా, ఫైట్స్ చూస్తూ మాట్లాడేస్తున్నాడు. పక్క సీటు వ్యక్తి లేచి వెళ్లి పోయాడు..
హాలంతా చీకటి. చేతికి తడి తగిలింది.. కుర్చీ చేతిపై. ఇంటర్వెల్లో చూస్తే కుర్చీ చేతిపై రక్తం.. అతగాడు సీట్లో లేడు.
“ఏ మేకో, గుచ్చిసినాదేమో?ఎర్రి కేకేసాడు.. ఇందాకటి బట్టి సూత్తన్నా. తెగ కుర్సీలో నులుసుకుపోతున్నాడు.
ఇదుగో.. కుర్చీ మేకులు, బయట కొచ్చినాయి. మనల్ని సినిమా సూడనీయనేదురా బాబూ!” పల్లెటూరి ఆసామి స్వగతంలా చెప్తునే ఉన్నాడు.
పంకజం, అలిమేలు సీట్లు మారిపోయాయి. పకపకా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ మిగతా సినిమా చూశారు.
చున్నీతో ముఖాలు కప్పుకొని బయిటకు వచ్చారు..
ఆటోలో వస్తుంటే అంది పంకజం.. ఆడవాళ్లు ఆత్మస్థైర్యంతో ఉండాలని మా అమ్మమ్మ చెప్తుంది.. ఎలాంటి సమస్యలైనా తెలివిగా ఎదుర్కోవాలట..
ప్రయాణాలు చేసేటప్పుడు.. బయిటకు వచ్చేటప్పుడు.. ఆరోజుల్లోనే ఆడవాళ్లు అతిచిన్నఆయుధాలు బట్టల్లో భద్రపరచుకొని ప్రయాణాలు చేసేవారట..
అమ్మమ్మవాళ్లూ దూరపు ప్రయాణాలలో చురకత్తులు, కారంపొడి, మిరియంపొడి.. ఏదీ లేకపోతే ఇసుక పట్టుకు బయిల్దేరేవారట.
ఇలాంటి జాగ్రత్తలు ఆమెచెప్పినవే.. నేనెక్కడికి బయిటకొచ్చినా జాగ్రత్తలన్నీ చెప్తోంది.. మారోజులే నయం విలువలుండేవి. ఈరోజుల్లో ఆడపిల్లలకు ఎంతో భద్రత అవసరం.. అందుకే నే బయిటకు వస్తే జాగ్రత్తలు తీసుకుంటానే” అంది పంకజం..
నిజమే ! ఇందాకటి ఆ వెధవలా పిచ్చికుక్కల్లాటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు.. ఇప్పడు నువ్వు రక్షించావు. ప్రతీసారీ నువ్వు ఉండవు కదా!..”
“మా అమ్మమ్మ చెప్పినట్లు మన భద్రత మనంకూడా చూసుకోవాలి”.
“మీ అమ్మమ్మకు నమస్కారాలు చెప్పు.. అయినా టెక్నాలజీ చెడుకు ఎంత ఉపయోగపడుతోందో మంచికి అంతకంటే పదిరేట్లు పనికొస్తోంది.. ఇక ఆ టెక్నాలజీ మన దగ్గర పెట్టుకుని దుర్మార్గుల ఆట కట్టించాలి” ధృడమైన సంకల్పంతో అంది అలివేలు.
“గుడ్.. నీకూ ధైర్యంవచ్చిందే.. కుక్కకాటుకి చెప్పుదెబ్బ వేసా”మంది సంతోషంగా పంకజం..
“కాదు కాదు. కుక్క బుద్ధికి పిన్ను దెబ్బ” పకపకా నవ్వింది అలిమేలు..
సమాప్తం..
దామరాజు విశాలాక్షి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు దామరాజు విశాలాక్షి. విశ్రాంతౌపాధ్యాయని, విశాఖపట్నం.
ప్రస్తుతం కెనడానుండి.
Comentarios