top of page
Original.png

మా ఇంటికి రండి!

#AAnnapurna, #అన్నపూర్ణవ్యాసాలు, #MaIntikiRandi, #మాఇంటికిరండి,


Ma Intiki Randi - New Telugu Article Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 18/06/2025

మా ఇంటికి రండి! - తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


''మా ఇంటికి రండి.. ఇల్లు చూద్దురుగాని.. '' అంటూ పిలిచారు బంధువులు. 


ఇల్లు కాదు అపార్టుమెంటులో ఫ్లాటు వాళ్ళది. ఫ్లాటులోవుంటున్న నాకు అలాంటిదే చూడటానికి ఏమివుంది.. 


ఫంక్షన్ అంటే వెళ్ళచ్చు. టూ -త్రీ-ఫోర్- అలా బెడ్రూమ్స్, హాల్.. అంతేగా !

దాదాపు ఒకేలా ఉంటాయి. దాన్నిబట్టి ఫర్నిచర్ ఉంటుంది. విల్లాలు ఇంకాస్త రిచ్ గా ఉంటాయి. 


ఇక ఇంటిని తీర్చి దిద్దుకునేవారి స్వభావాన్ని బట్టి డెకొరేషన్ ఉంటుంది. రిటైర్ అయినవారి ఇల్లు ఒకలా ఉద్యోగాలు చేసే భార్యాభర్తల ఇల్లు మరొకలా ఉంటుంది. వయసు మళ్ళిన భర్త-భార్య కూడా ఇంటిని నీట్గా వుంచుకునేవారు వున్నారు. 

పనివాళ్ళమీద ఆధారపడిన వారి ఇల్లు దానికి తగట్టే ఉంటుంది. 


హైదరాబాదులో పనివాళ్ళు ఆదివారం రారు. మిగిలిన రోజుల్లో ఒకపూట వస్తారు. అప్పుడప్పుడు వూరికెళ్ళడం, ఆరోగ్యం బాగాలేదని మానేయడం మామూలు. ఇల్లు బాగుచేసుకోడానికి రోబో కొనుక్కోవడం, వారానికో నెలకో స్తోమతునుబట్టి అర్బన్ కంపెనీ వాళ్ళను పిలిచి క్లీన్ చేఇఎంచుకోడం మామూలు. 


పిల్లలు ఉన్నఇల్లు చెప్పక్కరలేదు. వెనకాల ఎంత చేసినా మల్లి అష్ట వ్యస్తం చేసేస్తారు. పైగా ado ఆటగా ఉంటుంది వాళ్లకు. అవన్నీ సర్దుకోడంలో అమ్మ బాధకూడా ఆనందమే పిల్లలకు. 


ఉద్యోగాలు చేసే మహిళకు పనివాళ్ళమీద ఆధారపడటం తప్పదు. పనివాళ్ళు మేడం ఇంట్లో ఉంటే శ్రద్ధగా పనిచేస్తారు. తాళం ఇచ్చివేడితే పై పైన అయినది.. అనిపిస్తారు. అన్ని తెలిసి ఏమి చేయలేక సర్దుకుపోవడం

తప్పదు. ఇక ఆదివారం కాస్త సర్దుకుందాం ఎవరైనా వస్తారు.. అనుకుంటే బోలెడు పని ఉంటుంది. ఇంటికి కావలసిన సామాను కొనుక్కోవాలి. ఏదైనా రిపేర్లు ఉంటే చేసుకోవాలి. ఇలా ఇంతా బయటా అన్ని చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యం చూసుకోవాలి. చదువు వాళ్ళ సరదాలు పట్టించుకోవాలి. 

 ఇక బంధువులను స్నేహితులను ఇంటికి విందు వినోదాలకు పిలవలేరు.

 

అదే రిటైర్ ఐనవాళ్లు టైం ఎలా గడపాలి ? ఎటువెళ్ళాలి? అని ఆలోచిస్తారు. ఇంటిపనిలో మగవారు హెల్ప్ చేస్తారు. షాపింగ్కి వెడతారు. స్వయంగా కొన్ని పనులు చేసుకుంటారు. బద్దకస్తులు రోగ గ్రస్తుల సంగతి వదిలేద్దాం. ఎంత పెద్ద ఇల్లు ఐనా కొందరికి ఇరుకుగానే ఉంటుంది. అర్ధంలేని పర్నిచర్తో నింపుతారు. 

ఎంత పెద్ద ఫ్లాట్ లో వున్నా దుమ్ము కొట్టుకుని చీదరగా ఉంటుంది. పనివాళ్లకు జీతం ఎక్కువ (కనీసం ఐదు వేలు ) ప్రాంతాలనుబట్టి బెడ్ రూమ్లనుబట్టి ఇవ్వాలి. వాళ్ళు జీతాన్నిబట్టి పనిచేస్తారు. 


కొందరు చక్కగా చురుకుగా అన్నిపనులు ఆధునిక యంత్రాలతో చేసుకుంటారు. రెండు వారాలకు నెలకో అర్బన్ కంపెనీ వారిని పిల్చి పని చేయిన్చుకుంటారు. కొందరికి అతి శుభ్రత. అలా రోజంతా కడుగుతూ తుడుస్తూ వుంటారు. రక రకాల అలవాటు. 


ఇల్లు సంగతి సరే! ఒక ఏజ్ వచ్చాక పిల్లలు స్థిరపడ్డాక మనకంటూ ఒక వ్యాపకం కల్పించుకుంటూ స్నేహితులం కావచ్చు బంధువులం కావచ్చు వోకోళ్ల ఇంటిలో వోకోవారం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆరోజేనా ఇష్టమైన దుస్తులు ధరించి ఇష్టంవున్న ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిని రోజంతా గడపటం ఎంతోబాగుంటుంది. 


సంతోషం ఆరోగ్యం కూడా! ఇలా చేయడం మీకు ఇష్టమే కదూ! మన సంతోషం మన చేతిలో వుంది. 


*******************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page