top of page

మా వాడు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #మావాడు, #MaVadu

Ma Vadu - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 02/02/2025

మా వాడు - తెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


ఎండాకాలం వచ్చిందంటే

ఎక్కడలేని సరదా మావాడికి

అలుపన్నది లేకుండా

అహరహం శ్రమిస్తాడు

ఎప్పటికన్నా ముందు లేచి

అందర్ని లేపుతాడు

పొద్దుగడిచే కొద్ది

పుంజుకుంటాడు ఉత్సాహాన్ని

వేడిగాలులకి వడదెబ్బలకి

అందర్ని బలిచేస్తాడు

అలసి సొలసి

విసిగి వేసారి

నీళ్ళో రామచంద్రా అంటే

ఓ రెండు నెలలకి కరుణించి

తాను ఆవిరి చేసిన నీటినే

తొలకరి చినుకులుగా కురిపిస్తాడు

వాడు ఖచ్చితంగా

సమయం పాటించే -సూరీడు

విశ్వానికి స్ఫూర్తిదాత మావాడు.


-బులుసు రవి శర్మ 




Comments


bottom of page