top of page

మానసిక సంఘర్షణ

Updated: Jan 21

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #మానసికసంఘర్షణ, #ManasikaSamgharshana, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Manasika Samgharshana - New Telugu Poem Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 06/01/2025

మానసిక సంఘర్షణ - తెలుగు కవిత

రచన: భళ్లమూడి నాగరాజు


ఉవెత్తున   ఎగసిపడే కెరటంలా 

మానసిక సంఘర్షణ చట్రంలో 

మంచి ..చెడు లను బేరీజు వేసే 

యంత్రమే బుద్ధి 


మంచిని మనసులో పదిలపరచి 

చెడును అత్యంత దూరం లో ఉంచి 

మనస్సును జాగృత పరచేదే  బుద్ధి 


బుద్ధిని అదుపులో పెట్టి 

వక్రించి. .వెర్రి తలలు వెయ్యకుండా 

కట్టడి చేసిన నాడే మనుగడ 


బుద్ధి గడ్డి తింటే 

అధోగతేరా సోదరా 

నువ్వు బుద్ధుడు 

కాకపోయినా పరవాలేదు 

నిబద్దతతో మెలుగు 


సమాజం లో శాంతి పరిఢవిల్లును 

అభివృద్ధి పథం లో నడుచును 

బుద్ధిని అదుపులో పెట్టుకో 

బుద్ధి మంతుడులా మసలుకో !!



..భళ్లమూడి నాగరాజు

రాయగడ.






Comments


bottom of page