మనోహరమైన మురళిగానం
- Nallabati Raghavendra Rao
- Jun 25, 2024
- 6 min read

'Manoharamaina MuraliGanam' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 25/06/2024
'మనోహరమైన మురళిగానం' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
నా పేరు మురళీ మనోహర్. నా వయసు 15 సంవత్సరాలు. నేను నైన్త్ క్లాస్ పాసయ్యాను. నాకు ఇప్పటి వరకు అన్ని ఫస్ట్ క్లాసులే. అయితే మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి మా నాన్న నన్ను చదువు మానేయమన్నాడు. మా నాన్న కష్టాన్ని చూడలేక చదువు కోవాలని ఎంత ఆశ ఉన్నా తప్పని పరిస్థితిగా ఆలోచించి నేను కూడా టెన్త్ క్లాసులో చేరకుండా మానేయాలి అనుకున్నాను. నిశ్చయించేసుకున్నాను.. టెన్త్ క్లాసులో జాయిన్ కాలేదు.. ఒక నెల మానేశాను.
నాతోటి నైన్త్ క్లాస్ పిల్లలందరూ నాకు దారిలో కని పించి నేను టెన్త్ క్లాసులో జాయిన్ కావడం లేదని తెలుసుకుని చాలా బాధపడ్డారు. ఒకరు ఇద్దరు పిల్లలు అయితే మా నాన్న గారి దగ్గరికి వెళ్లి.. నన్ను స్కూలు మానిపించేయకుండా టెన్త్ క్లాస్ లో జాయి న్ చేయమని బ్రతిమలాడుతూ చెప్పారు కూడా.
నెల గడిచింది..
ఒకరోజు బజార్లో మా హిందీ మాస్టారు రామారెడ్డి గారు నాకు కనబడి నేను చదువు మానేసినట్టు తెలుసుకొని.. కేవలం డబ్బులు లేని మూలంగా మాత్రమే మానేసినట్టు కూడా తెలుసుకొని నా ద్వారా మా నాన్నను స్కూలుకు రప్పించుకున్నారు. ఏం చెప్పారో తెలియదు.
మర్నాడే మా నాన్న నన్ను పిలిచి ''నువ్వు స్కూల్ కి వెళ్ళరా.. చదువుకో.. ఫీజు డబ్బులు ఎలాగోలా చూసి కడతాను'' అన్నాడు.
ఆ మాటలు నాన్న అనేటప్పుడు ఒక పెద్ద బండరాయి తన నెత్తి మీద పెట్టుకొని బరువు మోస్తూ మాట్లాడినట్టు నాకు అనిపించింది.
తల తాకట్టు పెట్టుకుని నన్ను ఎలా చదివించాడో, నాకు బట్టలు ఎలా కుట్టించాడో.. నాన్నకు మాత్రమే తెలుసు.. చివరికి నాకు అన్నం కూడా పెట్టి ఎలా స్కూలుకి పంపించగలిగాడో
ఆ భగవంతుడికి.. నాన్నకు మాత్రమే తెలుసు.
త్రిమూర్తుల కన్నా గొప్ప దేవుడుగా మా నాన్న నాకప్పుడు కనిపించాడు. ఇంతకన్నా హీరోచితo ప్రపంచంలో ఎవ్వరైనా చేయగలరా.. అని నాకు అప్పుడే కాదు గుర్తుతెచ్చుకుంటే ఇప్పుడు కూడా అనిపిస్తుంది.
మా కుటుంబం అగాధంలో ఉన్న ఆరోజు మా నాన్న నాపట్ల హీరోగా తీసుకున్న గొప్ప డెసిషన్ నా జీవితాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్లింది.
అప్పుడు నేను టెన్త్ క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ కాబట్టి ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులలో కొంచెం మార్పు రావడంతో ఇంకా ఉన్నత చదువులు కూడా చదివి.. రకరకాల ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి.. ఇప్పుడు నేను.. ఎవరెస్టుశిఖరం మీద ఉన్నాను.
నాకు దైవం తర్వాత అంతకు మించిన హీరో మా నాన్నే కదా.
ఇది మా నాన్నకు ఒకవైపు..
*
రెండవ వైపు మా నాన్నగా కంటే నాకు విలన్గా ఆయన గుర్తుండిపోయిన సంఘటన కూడా గుర్తు చేసుకుని తీరతాను ప్రతిరోజు.
బాధ్యత తెలియని ఆ అల్లరి చిల్లర వయసులో ఆ టెంత్ క్లాస్ చదువుతున్నప్పుడే నేను నా ఎదుట బెంచ్ లో కూర్చున్న బాబురావు అనే వ్యక్తిని కిటికీలోంచి క్లాస్ రూమ్ లోకి వచ్చే సూర్యకాంతిని బట్టి అతని షర్టు మీద పడుతున్న సూర్య కిరణాలు ఆధారంగా నా దగ్గర ఉన్న పెద్ద భూతద్దంతో అతని షర్టు అలా కాలిపోయేలా ఫోక్సింగ్ పెట్టాను. షర్ట్ అంటుకుపోయింది అతని శరీరం కూడా కొంత భాగం బొబ్బలు ఎక్కింది. అతను లబోదిబో మన్నాడు. క్లాస్ రూమ్ అంతా హడావిడి. నాన్నకు కబురు వచ్చింది.
''ఇది చాలా ఘోరం మా వెధవను డిస్మిస్ చేసేయండి'' అని హెడ్మాస్టర్ గారికి నాన్న చెప్పి నన్ను ఆ స్కూల్లోనే చేత్తో చితక బాదేశాడు.
హెడ్మాస్టర్ నన్ను డిస్మిస్ చేయడంతో.. దారి లో మళ్లీ కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడితో ఆగ కుండా మూలనున్న పెద్ద కర్ర తీసుకుని నన్ను రక్తం వచ్చేలా ఇంటిదగ్గర చితక కొట్టాడు. నేను భయపడి మంచం కిందకి దూరిపోతే బయటకు లాగి మరీ కొట్టాడు.
ఆ సమయంలో నాన్న నాకు భయంకరమైన విలన్ గా కనబడ్డాడు.
నాన్నలాంటి వాడి కడుపున ఎందుకు పుట్టానా అని.. నేను మనసులో మా నాన్నని చాలా తిట్టు కున్నాను.
ఆ తర్వాత 15 రోజులు గడిచాక నాకు తెలియకుండా స్కూలుకు పెద్దమనుషులను తీసుకొని వెళ్లి బ్రతిమలాడి మళ్ళీ నన్ను స్కూల్ కి పంపాడు మా నాన్న.. అయినా మా నాన్న నా దృష్టిలో భయం కరమైన విలన్గానే గుర్తుండిపోయాడు.
అప్పుడే మొదటగా భయం అనే పదం పుట్టింది నాలో.. భయంతో పాటు భక్తి కూడా అప్పుడే ఏర్పడటం మొదలైంది.
అయితే అప్పటి ఆ చర్య జీవితంలో ఒకలా నాకు చాలా బాగా ఉపయోగించింది. మా నాన్నలో అప్పుడు ఆ రెండవ పార్శ్వం నాకు కన పడకపోతే నేను ఎప్పటికీ ఒక జులాయిలా మారి ఉండే వాడిని.. అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది.
నిజమే.. ఆ చిన్న వయసులో మనల్ని పెద్దవాళ్లు నెత్తి మీద ఎక్కించుకున్న, కొట్టిన, తిట్టిన.. ఏం చేసినా అది భవిష్యత్తులో మనకు ఒక గుణపాఠం.. భవిష్యత్తు జీవితాన్ని నడిపించే వెలుగు రహదారి గా మిగిలిపోతుందని 40 సంవత్సరాల తర్వాత ఇప్పటికి నాకు అర్థమైంది.
నాన్న ఏ లోకంలో ఉన్న ఆయన చల్లని చేతులతో నేను బ్రతికున్నన్నాళ్ళు ఆనందంగా ఉండమని నన్ను ప్రతిరోజు దీవిస్తూనే ఉన్నాడు.. అందుకనే నేను ఈరోజు ఎవరెస్టు శిఖరం మీద ఉన్నాను.
ఇది నాన్నకు నాకు మధ్య జరిగిన బంగారం లాంటి జ్ఞాపకం. ఈ జ్ఞాపకం నాకు ఎన్ని జన్మలకైనా అలాగే గుర్తు రావాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని చూసిన.. నాన్న నాకు 70 కేజీల బంగారపు ముద్దలా కనిపిస్తాడు!!
ఈ జ్ఞాపకం అందరితో పంచుకోవాలనిపించి చెప్పాను.
ఇట్లు మురళి మనోహర్
నమస్కారం
***
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments