top of page
Original.png

మంత్రం


దానం చేయని సంపద… 👉 శాశ్వతం కాదు

Manthram -  Telugu Comedy Story |Mohana Krishna Tata

మంత్రంతెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 29/03/2026


చాలాకాలం కిందట ఒక వర్తకుడు ఉండేవాడు. బాగా డబ్బుండి, ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. ఎంత డబ్బున్నా, ఎప్పుడూ ఎవరికీ దానం, ధర్మం చేసి ఎరుగడు. ఉన్న సంపదతో తాను విలాసవంతంగా జీవించసాగాడు.


ఒకరోజు, భిక్షాటన కోసం ఒక మనిషి ఆ వర్తకుని ఇంటిముందర నిల్చొని ఉన్నాడు. ఎప్పటిలాగానే, ఆ వర్తకుడు...


"ఉదయం అయితే చాలు...ఈ అడుక్కునేవారు ఎక్కువైపోతారు. మా దగ్గరున్నదంతా దానం చెయ్యడానికా ఏమిటి? ఏమీ లేదు వెళ్ళు " అని గట్టిగా అరిచాడు 


ఇలా ఎంతమంది వచ్చినా ఎవరికీ దానం చేసేవాడు కాదు ఆ వర్తకుడు. ఒక రోజు ఊరిలోకి ఒక మహిమ గల సాధువు వచ్చాడని ఆ నోట ఈ నోట విని ఆ సాధువుని సందర్శించడానికి వెళ్ళాడు ఆ వర్తకుడు.


"నమస్కారం గురుజీ..!" అన్నాడు ఆ వర్తకుడు 


"రా నాయనా..!"


"గురుజీ..! నేను ఒక వర్తకుడను. నాకు డబ్బుకు లోటు లేదు. ఇలాగే ఎప్పుడూ ఉండేలాగ నాకు ఏమైనా మంత్రం చెప్పండి"


"నీ దగ్గర ఎంత ధనం ఉన్నా..నువ్వు ఎప్పుడు ఎవరికీ ఏమీ పెట్టలేదు..అవునా?"


"అవును స్వామి..పెడితే అంతా పోతుంది కదా..దానాలు చేసి, ఆస్తులను పొగొట్టుకునేవారు చరిత్రలో చాలా మంది గురించి విన్నాను"


"నేను చెప్పేది కాస్త విను.."


"ఏమిటి గురుజీ?"


"అక్కడ ఉన్న అతను గత జన్మలో బాగా ధనవంతుడు. ఇంట్లో పెద్దవారు, గురువులు ఉన్నదానిలో దానాలు చెయ్యమని ఎంత చెప్పినా.. ఎప్పుడు వినకుండా విలాసవంతంగా జీవితం గడిపేవాడు. పరుల కోసం ఎప్పుడు ఏమీ చెయ్యలేదు"


"నాలాగే అనమాట.." అనుకున్నాడు వర్తకుడు


"అవును...ఈ జన్మలో అతనిని చూసావా? పూర్తి వ్యతిరేకంగా ఉంది అతని జీవితం. భిక్షాటన చేసుకుంటూ కాలం గడపవలసి వస్తోంది. పూర్వజన్మలో అతను చేసిన తప్పిదమే ఈ జన్మలో ఇలాగ ఉండమని శాసించింది. ఈరోజు ఉదయం భిక్షాటన కోసం మీ ఇంటి దగ్గరకు కూడా అతను వచ్చాడు "


"అవును గురుజీ! నిజమే!"


"నువ్వు కూడా ఈ జన్మలో దానాలు చెయ్యకపోతే, మరుజన్మలో ఇతనిలాగే కష్టాలు పడతావు. ఇంకా దారుణమైన జన్మ లభించినా, ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి..ఉన్నదానిలో కొంత దానం చేసి నలుగురికి ఉపయోగపడితే, ఎన్ని జన్మలైనా  సిరిసంపదలతో జీవిస్తావు...సంతోషంగా జీవిస్తావు"


"మీరు చెప్పింది నిజమా స్వామీ..?"


"మేము నిత్యం ధ్యానం చేసుకునే సాధువులం. మాకు అన్నీ తెలుస్తాయి...సందేహించకు. నీ మంచికోసమే చెబుతున్నాను. ఇదే నీకు నేను చెప్పే మంత్రం"


"అలాగే స్వామీ..మీరు చెప్పినట్టే ఈసారి నుంచి నాకు ఉన్నదానిలో కొంత భాగాన్ని ఇతరులకోసం దానం చేస్తాను స్వామీ..! నన్ను ఆశీర్వదించండి" అని గురుజీ ఆశీర్వాదం తీసుకుని ఆ వర్తకుడు వెళ్ళిపోయాడు.


సమాప్తం. 

***********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

తాత మోహనకృష్ణ, తెలుగు హాస్య కథ, Telugu Moral Stories, Daanam Importance, Inspirational Stories Telugu, Kids Stories Telugu, Mantram Story


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page