'Maranasasanam' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 15/09/2024
'మరణశాసనం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"మీరు నన్ను చంపినా సరే..నాకు దొరికిన ఆ అమూల్యమైన వజ్రం మీకు దక్కనివ్వను.." అన్నాడు రాజు.
"ఆ వజ్రం నువ్వు ఎక్కడ దాచినా సరే, అది మాకే కావాలి. అది చాలా విలువైనది..అది నీకే దొరికింది. దానితో మా ముగ్గురూ ఎన్నో తరాలు హ్యాపీ గా ఉండొచ్చు.."
"మీ బుద్ధి నాకు తెలుసు.. మీలాంటి వారికి నేను దానిని దక్కనివ్వను..అది ప్రజల మంచికి ఉపయోగిస్తాను.."
"నిన్ను చంపి.. ఆ వజ్రాన్ని ఎలాగైనా సాధించుకుంటాము. నీతో పాటే, ఆ రహస్యం కుడా ఎవరికీ తెలియకుండాపోతుంది.." అన్నారు ఆ ముగ్గురు.
"అప్పట్లో నా పొలంలో..తవ్వకాలలో..నాకు ఆ అపురూపమైన వజ్రం దొరికింది. ఆ విషయం తెలుసుకున్న మా ఊరిలో ముగ్గురు.. నన్ను చంపేసి దానిని దక్కించుకున్నారు. నేను లేక, బాధతో నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి ఆ ముగ్గురి మీద పగ తీర్చుకోడానికి చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. చుట్టూ సెక్యూరిటీ, వారిని చంపి నా పగ తీర్చుకోవడం నాకు సాధ్యం కాదు..అంతా పక్కగా ఏర్పాటు చేసుకున్నారు. వారి చేతికి మంత్రించిన తాయత్తులు ఎప్పుడూ ఉండడం చేత.. నేను వారిని ఏమీ చేయలేను..ఇక్కడే ఇలా దెయ్యాన్ని అయి తిరుగుతున్నాను. నీ సహాయం నాకు కావాలి మిత్రమా...." అన్నాడు రాజు.
"అలాగే మిత్రమా..! నీ కథ విన్నాక..నీకు ఎలాగైనా సహాయం చెయ్యాలనే ఉంది. కొన్ని రోజుల కిందట, నాకు ఈ పుస్తకం దొరికింది..దీని మీద 'మరణశాసనం' అని రాసి ఉంది. నీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడు.." అంది మిత్రదెయ్యం.
"ఇది చాలా పురాతన పుస్తకం..ఎన్నో వందల సంవత్సరాల కిందట..ఇది ఉండేదని నేను అప్పట్లో చదివాను..దీని మహిమ చాలా గొప్పది. ఇది ఇప్పుడు నాకు చాలా సహాయపడుతుంది మిత్రమా..! ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పుస్తకం సహాయంతో వారిని సులువుగా చంపుతాను.." అన్నాడు రాజు ఆనందంతో.
పుస్తకాన్ని ఉపయోగించడం తెలుసుకుని...తనని ఇబ్బంది పెట్టిన వారిలో ఇద్దరిని అంతం చేసింది ఆ దెయ్యం. కానీ..మూడో మనిషి మీద మాత్రం ఆ పుస్తకం ప్రభావం చూపించలేదు. ఎందుకో అర్ధం కాలేదు రాజుకి.
"మిత్రమా..! నీ సహాయం నాకు ఇప్పుడు చాలా అవసరం..ఆ ముగ్గిరిలో ఒక్కడిని మాత్రం నేను చంపలేకపోతున్నాను..ఎందుకో నువ్వు తెలుసుకుని నాకు చెప్పగలవు. వాడే నన్ను ఆఖరిగా పొడిచి చంపాడు. వాడిని ఎలాగైనా చంపాలి. .."
"సరే మిత్రమా.."
రెండు రోజుల తర్వాత...
"మిత్రమా..! ఆ మూడో మనిషి తన పేరు మార్చుకున్నాడు. అందుకే అతనిని ఆ పుస్తకం ఏమీ చెయ్యలేదు.." చెప్పింది మిత్రదెయ్యం.
ఇప్పటికే హార్ట్ ఎటాక్ తో చనిపోయిన ఇద్దరి ఫ్రెండ్స్ గురించి ఆరా తీస్తే, పోలీసులకి అనుమానం వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్ లో చనిపోయిన ఇద్దరూ.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశమే లేదు. ఇదేదో తాంత్రిక శక్తి అయి ఉండవచ్చని..వారు ఒక గురూజీని కలిసారు. ఆ గురూజీ తన శక్తి ద్వారా 'మరణశాసనం' పుస్తకం గురించి తెలుసుకుని..అది బయటకు వచ్చి, ఎవరికో దొరికి ఉండవచ్చు. ఆ పుస్తకాన్ని వెంటనే కనిపెట్టి నాశనం చెయ్యాలి..లేకపోతే ప్రపంచం తలకిందులైపోతుందని చెప్పాడు..
"ఆ పుస్తకం ఏమిటి స్వామి..దాని గురించి కొంచం వివరిస్తారా..?"
“చాలా వందల సంవత్సరాల కిందట, రాజుల కాలం లో..జోతిష్యం చెప్పేవారు చాలా గొప్పగా, కరెక్ట్ గా ఉండేవారు. అప్పటి కాలంలో ఉన్న శాస్త్రి అనే పండితుడు జోతిష్యం చెబితే.. ఖచ్చితంగా జరుగుతుందని అందరి నమ్మకం. అతని దగ్గర జాతకం చెప్పించుకోవాలంటే, అందరికి చాలా భయం ఉండేది. ఏది జరుగుతుందంటే, అది ఖచ్చితంగా జరుగుతుంది, డేట్, టైం తో సహా..
శాస్త్రి గారిని చూసి ఈర్ష పడేవారు కూడా లేకపోలేదు. అదే రాజ్యం లో తాంత్రిక విద్య లో బాగా పేరున్న మనిషి తంతి ఉండేవాడు. ఆయన క్షుద్ర పూజ చేస్తే, ఎంతటి వారికైనా పతనం, పరాజయం, చావు కూడా తప్పదు. జోతిష్యాన్ని కూడా జయించగలనని నమ్మకం అతనిది. చేతబడి, క్షుద్రపూజలు ద్వారా మనుషులను చంపవచ్చని..దానికి రాబోయే తరానికి ఒక అద్భుతాన్ని సృష్టించి ఇవ్వాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా, ఆచరణలో పెట్టాడు. ఒక శక్తి గల పుస్తకాన్ని సృష్టించాడు. ఆ పుస్తకంతో రాబోయే కాలంలో క్షుద్ర పూజలు తెలియకపోయినా, అందులో మనిషి కరెక్ట్ పేరు, సమయం రాస్తే..ఆ మనిషిని ఆ సమయానికి చంపవచ్చు. దీని కోసం, ఆ మనిషి జాతకం కూడా మార్చబడుతుంది..ఏ శక్తి అతని చావుని ఆపలేదు. ఆ పుస్తకం పేరు 'మరణశాసనం'. దానిలో ఎవరిని చంపాలో, ఎలా చంపాలో అందులో రాసి పెడితే...అలాగే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఎవరు చంపారో కుడా తెలియదు.
ఆ పుస్తకం బయటకు రాక ముందే, తంతి చనిపోవడం జరిగింది. ఆ పుస్తకం భూస్తాపితం అయిపోయింది. ఇప్పుడు అది తవ్వకాలలో బయటకు వచ్చింది. కానీ..అది ఎక్కడ ఉందో తెలియదు.
ఈలోపు మూడో మనిషి పేరు మార్చుకున్నాడని తెలుసుకున్న దెయ్యం..ఆ పేరు తెలుసుకుని..పుస్తకం సహాయంతో చివరిగా అతనిని చంపేసింది. క్రురంగా తనని హత్య చేసి, తన కుటుంబం చావుకి కారణమైన ఆ ముగ్గిరి మీద పగ తీర్చుకుంది. కోరిక తీరిన ఆ దెయ్యం మాయమైపోయింది. ఆ పుస్తకం మళ్ళీ ఎక్కడో భూస్తాపితం అయిపోయింది..
*********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
コメント