మాతృ వందనం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 11
- 1 min read
#MathruVandanam, #మాతృవందనం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Mathru Vandanam - New Telugu Poem Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 11/05/2025
మాతృ వందనం - తెలుగు కవిత
రచన: కందర్ప మూర్తి
'అమ్మ' అంటే అనురాగం
'అమ్మ 'అంటే ఆప్యాయత
'అమ్మ 'అంటేఆదరణ
నవ మాసాలు గర్భంలో మోసి
బిడ్డగా బయటి ప్రపంచానికి
వెలుగు చూపేది అమ్మే
పొత్తిళ్లలో నులి వెచ్చని స్పర్సలో
నిద్ర పుచ్చేది అమ్మే
పుట్టుకతో చనుబాలతో
ఆకలి తీర్చేది అమ్మ
బిడ్డ బాధతో తల్లడిల్లితే
ఆందోళన పడేది అమ్మే
పసిడి మాటలతో
భాష నేర్పేది అమ్మ
బిడ్డ బోసి నవ్వులకు
మురిసిపోయేది అమ్మే
కంటికి రెప్పలా
కాపాడేది అమ్మ
జన్ననిచ్చిన అమ్మను
ముసలి వయసులో
ఆదరణతో చూడాలి ప్రతి మనిషి
***

కందర్ప మూర్తి
Comments