top of page
Original.png

మట్టి మహత్యం


'Matti Mahathyam' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 06/12/2023

'మట్టి మహత్యం' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


మట్టిలొ ఉండును మహిమలు ఎన్నో

చెట్టు చేమలు చీమల పుట్టలు

రాయి రప్పలు రంగుల కుప్పలు

బంగరు గనులు వజ్రపు తునకలు

మంచి గంధము మణి మాణిక్యాలు

ధాతువు లెన్నో ధరిత్రి పైన

మట్టి లోపలె పుట్టుచు ఉండు

పూవులు పండ్లు కాయ గూరలు

ఆరు రుచుల ఆహారాలు

దేహ ధారణకు వస్త్రాలైనా

దేహ పోషణకు తిండేదైనా

విస్తుపోక ఆలోచిస్తె

సమస్త మంతా మట్టి మహత్యమె

అమృత మంతటి ఔషధమైనా

అసువులు బాసే విషమైనా

అంతా పుట్టును మట్టి లోపలె

సృష్టి స్థితి లయ లన్నిటికి మూలము

మట్టి మహత్యమని మరువలేమిక

హలభూతికి హంగులు తోడుగ

నివాస వాసము తలుపుల కలుపయు

పుడమి నందే పుట్టుచు ఉండు

వంట చెరుకు పంటల ఫలము

వంటి యింటి వెచ్చములన్ని

ఒకటా రెండా ఎంచి జూడ

ఎనుబది నాలుగు లక్షల జీవులు

మట్టి ప్రభావముతొ పుట్టుచు



మట్టి గణపతిని పెట్టిన ఫలము

ఇహ పర సుఖముల కూడబెట్టిన విధమగు


- సుదర్శన రావు పోచంపల్లి



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page