top of page
Original.png

మేం పిల్లలం!!

Nov 26, 2024
1 min read

Updated: Dec 6, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#మేంపిల్లలం, #MemPillalam


Mem Pillalam - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 26/11/2024

మేం పిల్లలం - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


పిల్లలం మేం పిడుగులం

మల్లెపూవుల జల్లులం

అల్లరితో అలరించే

ఎల్లరికిలను ఇష్టులం


ముద్దులొలికే బాలలం

శుద్ధమైన హృదయులం

పెద్ద వారి బాటలోన

హద్దు దాటని జీవులం


తల్లిదండ్రుల ఆశలం

పల్లెసీమ ప్రేమికులం

వల్లిలాంటి మాది మనసు

పిల్లగాలుల విసురులం


మట్టిలో మాణిక్యాలం

చెట్టులోని ఫలములం

వట్టి మాటలే చెప్పని

పట్టు వీడని వీరులం


పువ్వుల పరిమళాలలం

నవ్వుల్లో సొగసులం

దివ్వెల్లో వెలుగులం

మువ్వల్లో రవళులం


చుక్కల్లో చంద్రులం 

మొక్కల్లాంటి వారలం

పక్కిల్లా విహరించే

చక్కని రేపటి పౌరులం


-గద్వాల సోమన్న




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page