top of page

మొదటి సంతానం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #ModatiSanthanam, #మొదటిసంతానం, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ree

Modati Santhanam - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 15/10/2025

మొదటి సంతానం - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


మూడు ముళ్ల బంధంతో, పెద్దల ఆశీస్సులతో, ప్రేమా నురాగాలతో, కోటి కోరికలతో అత్తవారింట అడుగుపెట్టారు రమ్య–రవి అనే కొత్త జంట.


రమణీయమైన ఉద్యానవనాలు పలురకాల పుష్పాలతో నిండి కనువిందు చేస్తుండగా, చుట్టూ కొలనులు, జలయంత్రాలతో గాలిలోకి నీటిని విరజిమ్ముతూ, పిల్లగాలుల ద్వారా సుగంధాన్ని మోసుకెళ్తూ, ఆ స్పర్శతో పౌరులను సేదదీర్చి, గ్రీష్మ దినాలను సైతం ఆహ్లాదకరమైన వసంతంలా అనిపింపజేస్తున్నాయి.


కొంగల కలకలాలు, కోయిల రాగాలు, పిల్లకాలువలు ప్రవహిస్తుండగా, ఆ భవంతి పచ్చని తోరణాలతో అలంకరించబడింది.


గులాబీల సౌరభంతో నిండిన శోభన గదిలోకి, జలతార చీరలో, జాజి–మల్లె పూల జడతో అడుగుపెట్టిన రమ్యను చేరదీసి, రవి చేతిలోని పాలగ్లాస్ తీసుకుని మురిపాలు పంచాడు.


“మొదటగా అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా?” అని అడిగాడు రవి. 


“అబ్బాయి కావాలి — అచ్చు నీలాగే ఉండాలి,” అంది రమ్య నవ్వుతూ. 


“మరి మీకు?” అని రమ్య అడగగా — “అమ్మాయే కావాలి — అచ్చు అమ్మలాగే ఉండాలి,” అన్నాడు రవి చిరునవ్వుతో.


వారిద్దరి కోరికలు తొందరగా తీరలేదు. తండ్రి సంపాదించిన ఆస్తులు చాలానే ఉన్నాయి. తనకు వారసుడు కలిగితేనే ఆ ఆస్తి వస్తుంది.


వారసులు రాకపోతే, కష్టపడి సంపాదించిన ఆస్తి తన కుమారులకు, కూతుళ్లకు చెందక, చివరికి ఎవరో ఊరిపేరులేని వారికి వెళ్తుందేమో అని అనుకునేవారు అందరూ.


కారణం ఏమిటంటే — కొడుకు తనకు ఇష్టం లేని అమ్మాయి రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. దగ్గరి చుట్టరికం, తెలిసిన అమ్మాయిలను నిరాకరించాడని తన గౌరవం తగ్గిందనే కోపంతో, రవి పైన ఆస్తి ఆంక్షలు పెట్టాడు తండ్రి.


మొదటి సంతానం కోసం మొక్కలను నాటారు, వాటిని సంరక్షించారు, ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. గోమాతలను రక్షించి, పోషించి, బృందావనాలను పెంచారు. దైవానుగ్రహం వల్ల రమ్య సంతానవతిగా మారింది.


తొలి కాన్పులోనే కవలలను — ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని ప్రసవించింది.


వారి ఆనందానికి అవధులు లేవు. తండ్రి కోరిక తీరడంతో పంతాలు, పట్టింపులు అన్నీ మాయమయ్యాయి.


 సమాప్తం. 

******************

 యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments


bottom of page