ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
- Mohana Krishna Tata

- Feb 11
- 1 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Prema Prema O Prema - New Telugu Poem Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 11/02/2026
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
ఎక్కడ దాగున్నావో చెప్పమ్మా!
ఎక్కడమ్మా నీవు?
అమ్మాయిని పరిచయం చేసి..
నన్ను ప్రేమలోకి దింపిన దానా
ఎక్కడమ్మా నీవు?
నీ పలుకులే నాకు అండగా
నా చెలితో చెప్పాలనుకున్నా..
ఎక్కడమ్మా నీవు?
ఇంతలో నీవు లేవు
ప్రేయసి ఎదురుగా ఉన్నప్పుడు
నా మనసున బందీగా ఉంటావు
ఆమె లేనప్పుడు..
స్నేహితుల ముందుకు వచ్చి చిందులేస్తావు
ఇలాగైతే ఎలాగమ్మా?
నా యదలో నీవు
ఆమె యదలోకి ఎప్పుడు చేరుతావో
మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో
అమ్మాయి మనసు చూసి
అక్కడ ఉండిపోకుమా!
నాకు విరహాన్ని కలిగించకుమా!
త్వరగా ఆమె మనసుని ఒప్పించి
ఆమె చెప్పిన తియ్యటి కబురుతో
నా దగ్గరకు వచ్చేయ్!
వస్తే! నీకు ఏది కావాలంటే అది ఇస్తా
నా ప్రియురాలిని తప్ప!
ఆమె మనసుని తప్ప!
=======================================

Thappadu - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 13/01/2026
తప్పదు - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా..
దానిని విడువక తప్పదు
మరొకటి మార్చక తప్పదు
ఎంత రుచికరమైన తిండి తిన్నా..
విసర్జించక తప్పదు
మళ్ళీ ఆకలి వేయక మానదు
ఎంత ఖరీదైన వాహనం ఎక్కినా..
అది ఎక్కడో ఆగక తప్పదు
దిగి నడవక తప్పదు
ఎంత ఎత్తుకు వెళ్ళినా..
ఎంతో ఎత్తుకు ఎగిరినా..
మళ్ళీ నేలపైకి రాక తప్పదు
ఎన్ని గొప్ప ప్రదేశాలు తిరిగినా..
ఎంత సమయం అక్కడ ఉన్నా..
చివరికి సొంత గూటికి రాక తప్పదు
ఎంత సంతోషం కలిగినా..
గుండెను పిండేసే బాధ పడినా..
మళ్ళీ మాములు స్థితికి రాక తప్పదు
******

-తాత మోహనకృష్ణ
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments