top of page
Original.png

మొనాలిసా కోసం

Updated: Feb 16, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #మొనాలిసా కోసం, #MonalisaKosam

Monalisa Kosam - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 03/02/2025

మొనాలిసా కోసం - తెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


ఎక్కడ పుట్టావో తెలీదు

ఎలా పెరిగావో తెలీదు

కోట్ల కళ్ళల్లో మెరిసాయి నీ కళ్ళు

క్షణాల్లో అందరి కళ్ళు నీ కళ్ల మీదే

రాబందు కళ్ల కెమేరాలు

అర్ధం లేని ప్రశ్నల వలయాలు

ఆశల ఆకాశ హర్మ్యాలు

అరచేతిలో వైకుంఠాలు

అన్నీ నీ కళ్ళు చూసాయి

చేతిలో పూసలు

నీ కళ్లను వెక్కిరిస్తున్నాయి

అక్కడికి రాలేక పోయానని

బాధ లేదు నాకు

నీ కళ్లను చూడ లేక పోయానని

చింత లేదు నాకు

రోజు తారస పడే నీ లాంటి చెల్లెళ్లు

మెరిసే వాళ్ళ కళ్ళల్లో నిన్ను చూస్తాను

ఇక్కడ నుండి నీ కోసం

ఓ నిట్టూర్పు విడుస్తాను


-బులుసు రవి శర్మ 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page