ముందు మాట
- Bhallamudi Nagaraju
- Mar 9
- 1 min read
Updated: Mar 14
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #ముందు మాట, #Mundu Mata, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems,

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (08/03/2025) సందర్భంగా
Mundu Mata - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 09/03/2025
ముందు మాట - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
ఓ బేబీ !
నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు
తెల్లగానో ..నల్లగానో ..
పచ్చని దబ్బ పండు లానో
బక్క గానో. .బలంగానో
నాకు తెలీదు తల్లీ!
సముద్రం లో ఈదే చేప పిల్లలా
అమ్మ బొజ్జ లో తిరుగుతున్నావు
నీ కదలిక లే
మా గుండె చెప్పళ్ళు తల్లీ!
నీ రాక కోసం ఎదురు చూస్తున్నా
బొజ్జ భూగోళం లో
ఇప్పటిదాకా
హాయిగా విహారిస్తున్నావు తల్లీ
మానవ మృగారణ్యం లోకి
రావాలని ఉరకలేస్తున్నావు
ఈ భూమి మీద పడ్డాక
నా మాటలు అర్ధం అయ్యేందుకు
ఎంతో కాలం పడుతుంది తల్లీ
అందుకే ఈ ముందు మాట
వెంటాడే వెయ్యి కళ్ళనుంచి
తప్పించు కువాలంటే
వీర నారిలా ఎదగాలమ్మా
ఆడ పిల్ల లా కాకుండా
ఆడ పులిలా ఉండాలమ్మా
చదువు తోనే సంస్కారం
ఆ చదువే నీకు శ్రీరామ రక్ష
ఉన్నత చదువులు చదవాలి
ఉత్తమం గా ఎదగాలి
..భళ్లమూడి నాగరాజు
రాయగడ.
Comments