'Na Kavithvam Jeevitha Sathyam' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 05/12/2023
'నా కవిత్వం జీవిత సత్యం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
లోకంలో జరిగే కొన్ని విషయాలను పత్రికలలో ప్రజలకు తెలిపేవారిని జర్నలిస్టులు అంటారు.
అదే లోకంలో ప్రతి మంచి చెడులను కథలు, కవిత్వం, నాటికలు, నవలలు, వ్యాసాలు ఇంకా రకరకాల పుస్తకాల ద్వారా అక్షర రూపం చేసి ప్రపంచానికి అందించే ఏకైక వ్యక్తి రచయిత.
రచయిత ఈ లోకం నడవడికను ‘నా కవిత్వం జీవిత సత్యం’ కథ ద్వారా అక్షర రూపం ఇచ్చాడు.
ఈ భూమి పై ఇప్పటికీ నాలుగో యుగం నడుస్తుంది.
అయితే ఈ యుగం కంటే గతించిన మూడు యుగాలు ఎంతో నయం అని రచయిత బావించాడు.
అందులో మొదటిది కృతయుగం.
ఈ యుగం పదిహేడు లక్షల ఇరవైఎనిమిది వేల సంవత్సరాలు. ఈ కాలంలో ధర్మం నాలుగు పాదాలపై నడించింది కాబట్టి ఏ ఘోరమైన సంఘటనలు లేకుండా ప్రజలు సంతోషంగా గడిపారు.
రెండోది త్రేతాయుగం.
ఇది పన్నెండు లక్షల తోంభై ఆరువేల సంవత్సరాలు.
ఈ యుగంలో ధర్మం నాలుగింట మూడో బాగంతో నడిచింది. శ్రీరాముడు ఈ యుగంలోనే అవతరించాడు.
మూడోది ద్వాపరయుగం.
ఇది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అయినా ఈ యుగంలో ధర్మం రెండు పాదాల పై నడిచింది.
ఇక
ప్రస్తుతం రచయితతో పాటు మనం జీవిస్తున్న
నాలుగో యుగమే కలియుగం.
ఈ యుగం గూర్చే ముఖ్యంగా రచయిత సత్యాలను వెల్లడించటం జరిగింది.
ఈ యుగంలో ధర్మం మాట దేవుడెరుగు.
సమాజంలో క్రూరత్వం, కుత్సితత్వం, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము, రాజ్యమేలుతున్నాయి. అలాగే మనుషులు పగ, ద్వేషం, ఈర్ష్య లతో రగిలిపోతున్నారు.
దొరలే దొంగలై పాలిస్తున్నారు.
పాపము వలన దుఃఖం అనుభవిస్తామన్న భయమే లేదు.
పుణ్యకార్యాలు కరువయ్యాయి.
ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు.
ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మమను ఆచరించే కాలానికి పోయారు.
వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగి మంచివాళ్ళు దుర్మార్గులచే పీడించబడుతున్నారు.
రెండు, మూడు యుగాల్లో కొందరు రాక్షసులు మనుషులను పీక్కుతిన్నారు. కానీ..
కలియుగంలో మాత్రం మనిషికి మనిషే పిక్కుతింటున్నారు.
అనాదాశ్రమంలో పేదల పిల్లలు ఉంటే..
వృద్దాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటున్నారు.
ఈ యుగంలో.. !
జన్మనిచ్చిన తల్లిదండ్రులుకు కూడా విలువ లేదు.
ఆపదలో ఆదుకున్నోడిని సులభంగా మోసం చేయగలిగే శక్తి ఉన్నవాళ్లు.
వందకోట్లకు అధిపతులవ్వగలరు కానీ ఒక్క నిమిషం ఆయుష్షు కొనలేరు
కోట్లకు వారసులమని విర్రవీగుతారు. చివరకు తమ వాళ్ళని తామే తగులబెడతారు.
మంచిపని చేసినప్పుడు దేవుడు చూస్తాడనే నమ్మకం, చెడ్డపని చేస్తున్నప్పుడు ఉండదు.
ప్రపంచం అంతటిని చుట్టి రాగలరు కానీ.. పరలోక ప్రయాణాన్ని తప్పించుకోలేరు.
మట్టిని నమ్ముకుని పంటలు వేసేవాడు మట్టిలోనే కలిసిపోతున్నాడు.
దొరలా ఉండి దోచుకున్నోడు అద్దాల మేడలో కూర్చుంటున్నాడు.
4జి, 5జి నెట్వర్క్ లను తెచ్చిపెట్టగలరు కానీ.. రైతన్నకు వర్ష సూచనలు సరిగ్గా ఇవ్వలేరు.
ఆటమైదానలు తడవకుండా చూసుకోలరు కానీ.. ఆకలి తీర్చే దాన్యం రాసులను కాపాడుకోలేరు.
అన్నీంటికి మించి దరిద్రం ఏంటంటే..
కాళ్ళకి వేసుకునే చెప్పులు సైతం ఏ. సి రూముల్లో పెడుతున్నారు.
కడుపునకు తినే కూరగాయలును మురికిగా ఉండే చోట పెట్టి అమ్ముతున్నారు.
ఎదిగే చోట ఒదిగి ఉండే వాడు కానీ,
సత్యమార్గంలో నడిచేవాడు కానీ,
పగను వదిలి పరిచయం పెంచుకునేవాడు కానీ,
స్వయంకృషితో జీవించి సంతృప్తిగా అనుభవించేవాడు కానీ కానరాడు.
కలియుగంలో మనిషి ఇంతటి క్రూరమైన బతుకు బతుకుతున్నా.. కొందరు ధర్మాత్ములు కూడా పుట్టి తమ పుట్టుకకు ఒక అర్దాన్ని ఇస్తున్నారు.
వారిలా అందరూ..
మనిషిలో ప్రేమను చూడాలి. ఎటువంటి పరిమితులు లేకుండా అందరిని ప్రేమించటమే ప్రేమ. అదే అసలైన దానం. మనిషి ఎప్పుడూ మంచి పనులే చేయాలి. ఎందుకంటే మనం మనిషిగా పుట్టినందుకు ఉండవల్సిన లక్షణం. అంతేకాని పేరు, ఇతరుల పొగడ్తలు కోసం ఏమీ చేయకూడదు.
ఈ విధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గుచూపుతు నడుస్తుంది.
ఇది జీవిత సత్యం అని తెలుసుకున్నోడు కూడా ధర్మవ్రతుడే.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Kommentare