top of page

నన్ను కన్న నా వాళ్ళు'Nannu Kanna Na Vallu' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 05/05/2024

'నన్ను కన్న నా వాళ్ళు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


శిరీ భర్తతో కలిసి మరువాడ గ్రామంలో ఉంటుంది. భర్త శరత్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. అత్తామామలు కూడా మంచివారే అయినా.. శిరి ఎప్పుడూ నిరాశతో ఉంటుంది. కారణం..? తల్లిదండ్రులు తన ప్రేమను అంగీకరించక పోయినా వాళ్ళని ఎదిరించి శరత్ని పెళ్ళి చేసుకుంది. 


నిజంగా శిరీ మంచి మనసు కలది కాబట్టే తల్లిదండ్రులు తన ప్రేమను ఒప్పుకోకున్నా  ప్రియుడితోనే వచ్చేసినా.. శిరీ కళ్ళు అన్ని తన తల్లిదండ్రులు చుట్టూ, ఆ గ్రామం కొత్తకోట చుట్టూనే ఉంటాయి. అందుకే శిరీ ఎప్పుడూ ఆనందంగా ఉండాల్సి వచ్చినా ఇది తలుచుకుంటే చాలు ఆమె ఏదో దుఃఖం సంద్రంలోకి వెళ్ళిపోతుండేది. 


ఒకరోజు శిరి ఇంట్లో వారందరికీ ఎప్పుడూ లేని విధంగా ఆనందంగా కనిపించింది. ఎందుకో భర్త శరత్ కి కానీ  అత్తామామలకు కానీ అర్థం కాలేదు. తర్వాత తెలిసింది తన కన్నవారి ఊరి నుండి కొందరు మనుషులు మరువాడలో పనికి వచ్చారని. అంతే కదండీ. ?


 ఏ ఆడపిల్లకైనా..! ఎంతో ఆనందంగా చిన్నప్పటి నుంచి సొంత ఊరిలో అందరితో గడిపి ఊరిని, వాళ్ళందరిని వదిలి అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎంత భాదనిపిస్తుందో...? తనకు చూడ్డానికి తల్లిదండ్రులు వచ్చినా.., ఏదో పని మీద కన్నవారి ఊరిలో మనుషులు వచ్చినా అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా..? తమ వీది చివర్లో కొత్తగా నిర్మిస్తున్న ఒక ఇంటి పని కోసం దాదాపు ఇరవైమంది పనివాళ్ళు శిరీ కన్నవారి ఊరు కొత్తకోట నుంచి వచ్చారని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. వారిని చూడగానే భావోద్వేగానికి గురైంది. కన్నీటితో తన గతాన్ని నెమరువేసుకుంది.


శిరీ ఓ మధ్యతరగతి కుటుంభంలో పుట్టింది. తండ్రి శ్రీరాములు, తల్లి సత్యవతి. కాయకష్టమే వారి బతుకు. ఆస్తులు ఏమీ లేవు.ఒక్కగానొక్క కూతురు శిరీనే తమ ఆస్తిగా భావించి పెంచి,కష్టపడి చదివించారు.శిరీని బాగా చదివిస్తే ఆమె తమను చూసుకుంటుందని వారి మనసులో మాట. వారు అనుకున్నట్లే శిరీ స్కూల్ లో చదువులోను,ఆటల్లోను మేటి.మంచి మనసుతో ఉపాద్యాయులు మనసును కూడా ఇట్టే గెలుచుకునేది.ఎంతో చాలికిగా ఉండేది. 


ఇక కాలం ముందుకు వెళ్ళగా శిరీ కాలేజీలో అడుగు పెట్టింది.ఆ కాలేజీ మరువాడకు ఆనుకుని ఉంది. అయితే..!చదువు, ఆటలు మంచితనం, చాలికితనంతో ఆమె కాలేజీలోను ఫస్టే.


అవే ఆమెకు ప్రేమలోకి లాగాయి.శిరీ చలాకీతనం చూసిన శరత్ సాప్వేర్ గా పట్టణంలో ఉద్యోగం చేస్తూ సెలవు తీసుకుని కుటుంబంతో గడపడానికి వచ్చి ఆమె ప్రేమలో పడ్డాడు. రోజు శిరీ కోసం కాలేజీ వద్దకు రావటం,ఆమెను చూడ్డం ఇవే శరత్ దినచర్యగా మారింది. శిరీ కూడా రాను రాను శరత్ పై మోజు పడింది. ఈరోజుల్లో వయసుకు వచ్చిన ఆడపిల్ల కానీ.., మగపిల్లలు కానీ.. ప్రేమలో పడని వారుండరు కదా..? అలాగే తమ తమ తల్లిదండ్రులు కష్టాన్ని,  తమ తల్లిదండ్రులు తమ పై పెట్టుకున్న ఆశలు తెలుసుకోలేనివారు కాదు కదా..? 


అంత తెలివైన అమ్మాయి తన తల్లిదండ్రుల కష్టాన్ని, వారి ఆశలను అర్థం చేసుకుంది. అందుకే.. శరత్ని ప్రేమించినా.. 

"తన తల్లిదండ్రుల ఆశల కోసం తాను ఏదైనా ఉద్యోగం సాధించా”లని చెప్పింది. 


 "మధ్యతరగతి కుటుంభంలో పుట్టిన మనం ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం శక్తికి మించిన పని అని తాను అది కొట్టలేక సాఫ్ట్వేర్ తో అయినా మంచి జీతం వస్తుందని ఇటు వచ్చానని, తనను పెళ్ళి చేసుకుంటే నీ తల్లిదండ్రులను కూడా కష్టపెట్టకుండా నేనే చూసుకుంటా"నని చెప్పాడు.


ఆ మాటలకు శిరీకి,శరత్ లో మంచితనం కనపడింది. అలా తన ప్రేమను ఒప్పుకుంది కానీ..పెళ్ళి మాత్రం తల్లిదండ్రులును ఒప్పించే బాధ్యత శరత్ కే అప్పగించింది.


పాపం వారికి తెలియనిది ఏంటంటే.. రెండు మనసులు కలిస్తే ఇక్కడ సరిపోదు, తమ కులాలు కూడా కలవాలని. దురదృష్టవశాత్తు శిరీ కులం ,శరత్ కులం వేరే కావటంతో శిరీ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు.


శరత్ ని వదులుకోలేని శిరీ 

"మంచిగా చూసుకోవటం ముఖ్యం కానీ.. కులాలతో ఏం పని .. నన్నే కాదు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడని ఒప్పుకోమ"ని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసింది శిరీ.


"నువ్వే ఉద్యోగమో.. సద్యోగమో.. సాధించి  మమ్మల్ని చూసుకుంటావనుకుంటే వాడెవడో చూసుకుంటానంటే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలా.. ? కుదరదంటే కుదరద"న్నారు.


"మిమ్మల్ని చూసుకోటానికి ఉద్యోగమే సాదించక్కర్లేదు నాన్న ఎలాగైనా చూసుకోవచ్చు " అని ప్రాధేయపడింది.


దీంతో తల్లిదండ్రులు తన కులానికి చెందిన వేరే వాడితో పెళ్ళి కుదిర్చారు. 


తల్లిదండ్రులపై ఎంత ప్రేమ ఉన్నా.. తనకు ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం నరకం అనుభవించే కంటే ఇష్టమైన వ్యక్తితో బతికితేనే మంచిదని గత్యంతరం లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా శరత్ ని పెళ్ళి చేసుకుంది. 


పెళ్ళి చేసుకుని తర్వాత భర్త సహాయంతో తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఎలాంటి సహాయం అయినా చేయాలని కొత్తకోట వచ్చింది కానీ.. తన కూతురు చనిపోయిందని దిష్టిబొమ్మకు తల కొరివి పెట్టాడని ఊరి వాళ్ళు చెప్పటంతో అలా తనను కన్న తన వాళ్ళతో సంబంధాలు తెగిపోయాయని భావించి భర్తతో కలిసి తిరిగి మరువాడ చేరుకుంది.అలా తన వారికి దూరంగా ఉంటూ.. భర్త మంచిగా చూసుకుంటున్నా తల్లిదండ్రులపై ప్రేమ చంపుకోలేక అప్పుడప్పుడు భాదపడుతుంటుంది.


కన్నవారి ఊరి మనుషులు వచ్చారని ఆ రోజంతా వారితోనే గడిపింది.ఒక్కో సమయంలో ఒక్కో మనిషి వద్దకు వెళ్ళి అందరితోను మాట్లాడింది.వాళ్ళు కూడా తమ పని చేసుకుంటు శిరీతో మాటలు కలిపారు.తన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. తన భర్త తనకు కష్టపెట్టకుండా, కన్నీరు పెట్టించకుండా చూసుకుంటున్నాడని చెప్పింది., భర్తను వారికి పరిచయం చేసింది., ఎండలో పని చేస్తున్న వాళ్ళకి శీతల పానీయాలు తెప్పించి ఇచ్చింది. 


మధ్యాహ్నం వారందరికీ వంట చేసి స్వయంగా తానే వడ్డించింది. తాను కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఊరిలో దాదాపు అందరి నోళ్ళు లేచినా.. ఈరోజు అలాంటి ఆమె తమకు ఇంత గౌరవం ఇచ్చి కాసింత బువ్వ పెట్టి తన కన్నవారి ఊరిపైన,ఆ ఊరి మనుషులు పైనా ఇంత ప్రేమను పంచింది. కానీ.. ఏనాడూ కూడా తన ఊరి వాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. కూతురు సంతోషంగా ఉండాలే కానీ.. కులంతో పనేముంది?  కూతురు, అల్లుడిని ఇంటికి పిలిస్తే వారు ఎంతో సంతోషిస్తారని చెప్పే వారు లేరు. అలాంటి మనుషులను చూసి  శిరీ ఈరోజు ఆనందపడింది.,వారికి బువ్వ పెట్టింది. చివరగా వాళ్ళు వెళ్ళిపోతుంటే.. అప్పగింతల సమయంలో ఒక కొత్త పెళ్ళి కూతురు ఏడ్చినట్లు శిరీ కన్నీరు పెట్టింది. 


ఆ ఏడుపు ముఖంతోనే ఆఖరిగా ఒక్క మాట పలికింది.

" అమ్మలారా.. అయ్యలారా.. ‘నన్ను కన్న నా వాళ్ళు’ నామీద ప్రేమను చంపుకున్నా.. కూతురుగా నేను వారి పై ప్రేమను చంపుకోలేను. అల్లుడే అయినా.. వేరే కులపోడే అయినా.. కొడుకులా వారిని చూసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నాడని చెప్పండి" అని చెప్పి వాళ్ళని సాగనంపింది.

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

52 views0 comments

Comments


bottom of page