నర్తనశాల - పార్ట్ 6
- Ayyala Somayajula Subramanyam
- 1 day ago
- 6 min read
#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

Narthanasala - Part 6 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 03/06/2025
నర్తనశాల - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు. నర్తన శాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు, భీముని చేతిలో హతమవుతాడు. ఉప కీచకుల బారి నుండి ద్రౌపదిని రక్షిస్తాడు భీముడు. గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు. కౌరవులను చూసి భయపడిన ఉత్తర కుమారుడిని సారధిగా ఉండమంటాడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు.
ఇక నర్తనశాల - పార్ట్ 6 చదవండి..
అక్కడ శవము లేదని నచ్చచెప్పగా, కొంచెం అయిష్టత తోనే వృక్షము పైకి ఎక్కెను. అగ్రభాగాన ఒక వస్త్రముతో చుట్టబడి యుండెను. చూపరులకు శవాకారములో భయంకరముగా
నీచు వాసనతో యుండెను. అప్పుడు కూడా ఉత్తరుడు ఆ మూటను ముట్టుకొనుటకు సందేహించుచుండగా, అది ఆయుధములకట్ట యనియు, చూపరులకు శవాకారముగనో లేక సర్పాకారమగను కనబడుచుండును. నీవు సందేహించక ఆ మూటను విప్పి అందు గాండీవమును, విల్లంబుల కట్టయును తీసుకురమ్మనెను.
ఉత్తరుడు వస్త్రమును తొలగించి చూడగా, అందు దేదీప్యమైన ఐదు గొప్ప విల్లంబులను చూచి రోమాంచితుడయ్యెను.
గొప్ప ఆశ్చర్యమునకు గురియైన ఉత్తరుడు అట్టి అస్త్రాలను గురించి తెలుసుకోదలచెను. దానితో అర్జునుడు మొదట గాండీవము గురించి వివరించెను. తరువాత అర్జునుడు ఇలా వివరించెను.
“ఈ విల్లును మొదటిసారి శివుడు ఉపయోగించెను. ఇది అతని వద్ద వేయి సంవత్సరాలు ఉండెను. తరువాత బ్రహ్మ కు ఇవ్వగా, ఆయన దీనిని ఐదువందల ఏళ్ళు ఉపయోగించి, తరువాత ఇంద్రునకు ఎనుబది ఐదు సంవత్సరాలు, సోమునకు ఇచ్చెను. ఆ తరవాత ఐదువందల సంవత్సరాల కు వరుణుడి చేరెను. వరుణుడు నూరు సంవత్సరాలు తన దగ్గర ఉంచుకుని, ఆ తరువాత అరవైఐదు సంవత్సరాలు అగ్నిదేవునికి ఇచ్చెను.
అగ్నిదేవుడు ఉంచుకుని ఖాండవదహన సమయములో దీనిని నాకు అందించెను.
అర్జునుడు మిగిలిన విల్లుల గురించి మరియు ఆయుధాల గురించి వివరించెను. వాటి గురించి వినిన ఉత్తర కుమారుడు ఇలా అడిగెను. “బృహన్నలా, పాండవులు ఇప్పుడు ఎక్కడ కలరు. ?”
అర్జునుడు తన గురించి ఇటుల చెప్పెను. తన సోదరుల గురించి, ద్రౌపది గురించి తెలిపెను. ఆశ్చర్యచకితుడై ఉత్తరుడు “నీవు అర్జునునికి గల పదినామాలు కలుగుటకు కారణములను చెప్పగలిగితే నీ పలుకును నేను విశ్వసించెదను” అనెను.
అర్జునుడు ఇటుల బదులిచ్చెను. నేను వివిధ కారణముల చేత అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీబత్స, విజయ, జిష్ణు, సవ్యసాచి మరియు ధనంజయ అనే పది నామాలతో పిలువబడుచుంటిని.
అనేకమంది రాజులను జయించి విస్తారమైన ధనము సేకరించినందున నన్ను ధనంజయుడు అందురు. యుద్దములో ఎల్లప్పుడూ శత్రువుపై విజయము సాధించినందున నన్ను విజయుడు అందురు. నా జన్మ సమయంలో ఉత్తరఫల్గుణి నక్షత్రకూటమి తో హిమాలయాల్లో జన్మించి నందున నన్ను ఫల్గుణుడు అందురు.
ఇంద్రుడు స్నాతకోత్సవంలో నా తలపై ప్రకాశవంతమైన
కిరీటమును ధరింపచేసినందున నన్ను కిరీటి అందురు. యుద్దరంగములో ఎన్నడునూ భయంకరమైన రూపంతో కనబడువాడును కావున నన్ను భీబత్సుడు అందురు.
నా రథము తెల్లటిగుర్రాలతో కూడియున్నందున నన్ను శ్వేతవాహనుడు అందురు. గాండీవమును రెండు
చేతులతో సంధించ గలిగినందున నన్ను సవ్యసాచి అందురు. నా స్పష్టమైన రంగు మరియు పవిత్రమైన నడవడి చేత నన్ను అర్జునుడు అందురు. ఇంద్రుని కుమారుడనైనందున మరియు యుద్దములో నన్ను ఎవరూ దహింప లేనందున నాకు జిష్ణు అను నామము ఏర్పడెను.
చివరకు నా శ్యామవర్ణముతో అందరినీ ఆకర్షించునందున నన్ను కృష్ణ అందురు.
అంతట ఉత్తరుడు నమస్కరిస్తూ ఇట్లనెను. “అర్జునా; నీ వాస్తవ రూపమును తెలుసుకొనగా నాకు ఎంతో ఆనందముగా ఉంది. ఇప్పుడు నా భయము పూర్తిగా తెలగిపోయెనని హామీ ఇచ్చుచుంటిని. నా పిరికితనమునకు నన్న క్షమింపుము.
ఇఫుడు నీ సాటిలేని పరాక్రమము తిలకించుటకు నీ రథ పగ్గములను చేపట్టెదను.
తరువాత అర్జునుడు ఇట్లు పలికెను. “ఉత్తరకుమారా; ఆవశ్యముగా ఆయుధములన్నింటినీ రథములో ఉంచుము. నేను జయింపగలననే విశ్వాసమును నీవు ఎల్లప్పుడునూ కలిగి ఉండవలెను.”
ఉత్తరుడు తన భయమును వీడి, వృక్షము పైనుండి ఆయుధములను అన్నింటినీ రథములో నుంచెను.
”అర్జునా; నేనొక విషయమును అడుగుటకు ఆతృత గా నుంటిని. నీకు అభ్యంతరం లేకున్నచో గొప్ప వీరుడవైనప్పటికీ నీవు నపుంసకునిగా మారుటకు గల కారణమును తెలుప గలవు.
“అర్జునుడు ఇటుల బదులిచ్చెను. “అదియొక పెద్దకథ. కొన్ని అనుకోని సంఘటనల వలన రంభ నాకు శాపము ఇచ్చినది. ఆ శాపమును నేను వరముగా చేసుకొని మీ దగ్గర
అజ్ఞాతవాసము గడుపుచుంటిని. ఆ శాపము తీరిపోవు సమయము ఆసన్నమైనది. ఇప్పుడు మా అజ్ఞాతవాసము పూర్తి అయినందున నా పురుషత్వము పునరిద్దరింపబడెను”
ఇట్లు పలికి అర్జునుడు తన గాజులను తొలగించి విల్లును ధరించుటకు వినియోగించు చేతి తొడుగులను ధరించెను. మనస్సును ఏకాగ్రత పరచి దివ్యాస్త్రము లన్నింటినీ ఆవాహన చేసెను. ఆ అస్త్రములన్నీ వెంటనే ప్రత్యక్షమై అతని సేవకొరకు సిద్ధముగా నుండెను. అర్జునుడు ఆ ఆయు
ధనులకు నమస్కరించి ఎల్లప్పుడూ తన స్మృతి పథములో ఉండుమని అర్థించెను.
అర్జునుడు తన వింటినారిని బిగించి ధ్వనింపచేయు టతో ఒక్కసారిగా ఆకాశమంతయూ భయంకరమైన కంపనతో నిండిపోయెను. ఆ ధ్వనిని విని కౌరవులు నిస్సందేహముగా ఆ అజ్ఞాతయోధుడు అర్జునుడే యని నిర్ధారించుకొనిరి.
తరువాత వారు బయలుదేరు చుండగా ఉత్తరకుమారుడు ఇలా సంధ్హించెను. “అర్జునా; నీ అపారశక్తిపై నాకు విశ్వాసము ఉన్నప్పటికిని, ఇంతమంది మహారథులను ఎదిరించవలసి ఉన్నందున నాకు కొంత భయముగా ఉంది” అనెను.
అర్జునుడు చిరునవ్వుతో ఇట్లు బదులిచ్చెను. “గతములో నేను గంధర్వులు, దేవతలు, మరియు రాక్షసులతో యుద్ధము చేసిన విషయమును స్మరించుము. ద్రౌపది స్వయంవరంలో నన్ను ఎదిరించిన వీరులనందరినీ నేను ఓడించితిని. ఆ పైన నేను నివతకచులను, పౌలోములను లొంగదీసుకొంటిని. కనుక ఎట్టి భయము లేకుండ బయలుదేరుము.”
అట్లు ఉత్తరుని సారధిగా చేసుకొని శమీవృక్షమునకు ప్రదక్షిణలు చేసి అగ్నిదేవుడు తనకిచ్చిన రథమును స్మరింపగనే, అది ధ్వజపతాకములతో ప్రత్యక్షమయ్యెను. దానిని అధిరోహించి ఒక్కసారిగా అర్జునుడు తన శక్తివంతమైన శంఖుని పూరించగా, ఆ ధ్వని వినిన
అశ్వాలు మోకాళ్ళపై పడిపోయెను. ఉత్తరుడు భయంతో నిశ్చేష్టుడై రథములో చతికిలపడెను. శత్రువులు భయంతో రోమాంచితులైరి.
అర్జునుడు పగ్గాలను అందుకొని చతికిలపడిన గుర్రాలను నిలబెట్టి, ఉత్తరకుమారుని ఆలింగనము చేసుకొని ఇలా పలికెను. “శాంతించుము. భయపడ నవసరం లేదు. నీవు శక్తిమంతమైన శంఖధ్వనులను గతములో విని ఉందువు. ఇప్పుడు ఇలా ఎందుకు నిశ్చేష్టుడగుచుంటివి?’”
ఉత్తరుడు ఈ విధముగా బదులిచ్చెను. “అర్జునా; నీగాండీవ ధ్వని, దేవదత్తశంఖము పూరించుట చేత ఏర్పడిన ధ్వని మరియు ధ్వజపతాకముపై సుండిన కపి( హనుమంతుని)గర్జ
నలు మిళితమై నా మనస్సును కలవరపెట్టెను”
అర్జునుడు ఇటుల బదులిచ్చెను. “ఉత్తరకుమారా; నీ కాళ్ళను రథములో స్థిరముగా నిలుపుము. పగ్గాలను గట్టిగా పట్టుకొనుము. నేను మరోసారి నా శంఖమును పూరించ
బోతుంటిని.”
మరోసారి శక్తి వంతమైన దేవదత్తమును పూరింపగా పర్వతశిఖరాలు వణికెను. ఉత్తరుడు తన స్థానము నుండి ఎగిరిపడి రథపు ఊచలను పట్టుకొని వ్రేలాడసాగెను. అర్జునునికి మరోసారి అతడిని శాంతపరచవలసి వచ్చెను.
మరోవైపు ద్రోణుడు అనేక దుశ్శకునాలు చూచెను.
“ఓ దుర్యోధనా; ముందుగా మనము గోవులను తరలించి, ఆ తరువాత జరగబోయే యుద్దమునకు సిద్దపడుతూ సైనిక దళాలను వ్యూహాత్మకంగా అమర్చుకోవలెను’.”
అందుకు దుర్యోధనుడు కినుక వహించి “గురువర్యా; పదమూడవ సంవత్సరం ఇంకనూ పూర్తి కాలేదు. ఒకవేళ అతడు అర్జునుడు అయినచో మరో పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం, ఒక్క ఏడు అజ్ఞాతవాసం చేయవలసి యుండును. ”
దుర్యోధనుడు సందేహముగా భీష్ముని వైపు చూసి ప్రశ్నించెను. “పితామహా; దయచేసి ఖచ్చితముగా లెక్కించి పాండవుల అజ్ఞాతవాసము ఎప్పటికి పూర్తవుతుందో తెలుపగలరు”
“అధికమాసములతో కలిపి నేటితో వారి అజ్ఞాతవాసము పూర్తి అయినది. నేడు విజయదశమి. విజయాభిలాషియై వచ్చుచున్నాడు.
వచ్చినవాడు ఫల్గునుడు, అవశ్యము గెల్తుమనంగ రాదు, రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే?
హెచ్చేగుంగుందగున్ దొడరు తెల్ల విధంబుల కోర్చుటట్లుగా
కిచ్చదలంచి యొక్క మెయి నిత్తరి బొందగు చేతయున్ దగున్
అంత దుర్యోదనుడు ద్రోణునివైపు తిరిగి ఆచార్యా; అర్జునుడు మనపై యుద్దమునకు వచ్చునని నేను భావించుటలేదు. పదమూడు సంవత్సరాల పిమ్మట వారు శాంతియుతంగా తమ రాజ్యాన్ని తిరిగి పొందవలెనని ఆశతో వచ్చి ఉండవలెను. అర్జునుడు యుద్దరంగమునకు ఏవిధంగా వస్తున్నాడో ద్రోణుడు ఎంతో హృద్యంగా
వర్ణించాడు.
సింగంబు ఆకటితో గుహాంతరమునం జేడ్పాటు మైనుండి
మాతంగ స్ఫూర్తితో యుూధ దర్శన సముద్యత్క్రోదమై
భీష్ముడు, ద్రోణుడు యుద్ధము చేయుటకు విముఖత వహించియున్నారని దుర్యోధనుడు భావించెను.
దుర్యోధనుడు ఆగ్రహించెను. అతడిని ఉత్సాహపరచుటకు కర్ణుడు ఇటుల పలికెను.
“ఓ కురురాజా; భీష్మ ద్రోణాదులు ఎల్లప్పుడునూ అర్జున పక్షపాతులు ఐనందున వారి మాట వినుట వ్యర్థము. పాండవులే వారిద్దరినీ మనమధ్య ఉంచబడినట్లు నాకు అగు
పించును. వారు ఎల్లప్పుడునూ అతిశయోక్తిగా ప్రశంసించెదరు. అదేవిధముగా మనలను బయపెట్ట దలచి మనలను నిరుత్సాహ పరచుచున్నారు. నేను అర్జునుని జయించి నా ప్రతిజ్ఞ ను నెరవేర్చుకొనెదనని హామీ ఇచ్చుచుంటిని. అతడు కఠినమైన అరణ్యవాసముతో మిక్కిలి బల హీనుడై ఉండును.”
“నిజమునకు, ఎవరికైనను యుద్దము చేయుటకు అవసరమేమిటీ? భీష్మ ద్రోణులుద్దరూ విరాటుని గోవులను తోలుకొనిపోవచ్చును. లేక మీకిష్టమున్నచో ఇక్కడే యుండి యుద్ధములో నా పరాక్రమము ను వీక్షింపగలరు”
కృపుడు ఈ ప్రగల్భాలు భరించలేక, ఇలా ప్రతిఘటించెను. “కర్ణా; అర్జునుని వీరోచిత విజయాలను బహుశా నీవు విస్మరించినట్లుగా ఉంది. లేనిచో, ఒంటరిగా అతడిని జయించెదనని మూర్ఖముగా ఎట్లు పలుకగలవు. ? ఇటువంటి ప్రకటన అనేది కేవలము ఒక వ్యక్తి తన కాళ్ళు చేతులను బంధించుకొని, మెడలో బండను వ్రేలాడ దీసుకుని, నేను ఇలా సముద్రమును ఈదెదను’ అనునట్లుగా కలదు.
మనమందరమూ - నీవూ నేను, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మరియు అశ్వత్థామ వంటివారము కలిసి అర్జునుని నిరోధింప యత్నింపవచ్చును.
కానీ, నీవు ఒక్కడివే అతనితో యుద్దము చేసి గెలిచానని ప్రగల్భాలు పలుకుట ఉన్మాదచర్య అగును.
అంత అశ్వత్థామకు తండ్రి మేనమామ హేళన అవుతుండడం చూసి కోపముతో ఇట్లు పలికెను.
“ఓ, కర్ణా; నీవు ప్రగల్భాలు పలికే మూర్ఖుడవు. నీ గర్వమునకు ఆధారమేమి? నీవు అర్జునుని, ఆ విషయమున కొస్తే, పాండవులలో ఎవరినైనను ఎప్పుడు ఓడించితివి? యుధిష్టరుని రాజ్యమును అపహరించి దుర్యోధనునికి కట్టబెట్టుటకు మోసపూరితమైన మార్గమును ఎంచుకొనిన నీవు ఇంతలా ఎట్లు గర్విస్తుంటివి? నిస్సహాయురాలైన ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చుకొచ్చినందులకా ఈ గర్వము? ఇవి ఒక నిజమైన క్షత్రియునికి గర్వింపదగిన కారణములా?
ఇప్పుడు పాండవులతో పాచికలతో కాకుండా బాణాలతో శకునిని తలపడమను. చూచెదము. అర్జునునితో అక్రమముగా పోరాడబోతున్న ఇతర యోధులందరితో కలిసి నేను నా ఖ్యాతికి మచ్చ తెచ్చుకొనలేను.
( కర్ణుడు గొప్ప యోధుడు అర్జునుడి కన్నా గొప్పవీరుడు అని అంటున్నారుకానీ, అది ఎంతమాత్రం నిజం కాదు. అసలు మహాభారతంలో ఎక్కువ సార్లు ఓడిపోయిన వీరుడు కర్ణుడొక్కడే. అతను ఓడిపోయిన యుద్దాలలో కొన్నింటిని చెబుతాను.
ద్రౌపదీ స్వయంవరంలో అర్జునునితో ఓడిపోతాడు.
ఆదిపర్వం 189 వ అధ్యాయంలో 10, నుండి 22 వ శ్లోకాలు.
ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడితో ఓడిపోతాడు.
సభాపర్వం 30 వ అధ్యాయం 18:నుండి 21 శ్లోకాలు.
అరణ్యపర్వం లో గంధర్వులతో ఓడిపోతాడు ఘోషయాత్రలో
241 అధ్యాయం లో 15 నుండి 32 శ్లోకాలు.
విరాటపర్వం లో అర్జునుడితో మూడు సార్లు ఓడిపోతాడు.
54 వ అధ్యాయం 1 నుండి 36 శ్లోకాలు.
60 వ అధ్యాయం 1 నుండి 27 శ్లోకాలు.
ద్రోణపర్వంలో అభిమణ్యుడితో ఓడిపోతాడు.
41 వ అధ్యాయం 1 నుండి 8 శ్లోకాలు.
భీముడి చేతిలో ఓడిపోతాడు చాలా సార్లు, ద్రోణపర్వం 14 వరోజు యుద్దం 129వ అధ్యాయం
నుంచి చదివితే అనేక సార్లు ఓడిపోయి పారిపోయినట్టు ఉంటుంది. అదే రోజు అర్జునుడు
చేతిలో ఓడిపోతాడు. తరవాత 17 వరోజు యుద్దంలో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు.
కానీ ఇంకా ఓడిపోయిన అనేక సందర్భాలు ఉన్నాయి. కర్ణుడు చరిత్రలో గొప్ప యోధుడు.
కానీ అదే చరిత్ర లో అతని కన్నా గొప్ప యోధులు ఉన్నారు. అందులో అర్జునుడు ఒకడు.
చరిత్ర ను వక్రీకరిస్తే ఆ చరిత్ర పాడవదు. దానికి ఏం కాదు. కానీ పాడయ్యేది మన బుర్రలు.
ఇవి తెలియక వీడు’ గొప్ప వాడు గొప్ప’ అని మీకై మీరే అనేసుకుని సినిమాలు, సీరియల్స్ తెలివితేటలతో.
పురాణాలు తెలుసుకోవాలంటే ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు చదవండి.)
భీష్ముడు అతని పలుకులను ప్రశంసిస్తూ ఇలా హెచ్చరించెను. ’ అశ్వత్థామ, ఒకవేళ అర్జునుడు మనపై దాడి చేసినచో, అతనితో పోరాడుట మనందరి తక్షణ కర్తవ్యం. నీలోనూ, నీ తండ్రిలోనూ కేవలము పరుశురాముడు మాత్రమే అధిగమించగల బ్రాహ్మణ మరియు క్షత్రియ
పరా క్రమాల కలయిక కలదు. ఇఫుడు నీవు కర్ణుని మన్నించవలెను.
అతని ప్రగల్భములు లేక అవమానకరమైన పలుకులు కేవలము కౌరవులను రంజింప చేసేందుకు మాత్రమే ఉద్దేశింపబడెనని గ్రహింపుము”
దుర్యోధనుడు ద్రోణుని వైపు తిరిగి ఇలా వేడుకొనెను. “ఆచార్య; మన ఐకమత్యము కొరకు కర్ణుడు ఏదైనా అపరాదము చేస్తే, దయచేసి క్షమించగలరు. ”
========================================================================
ఇంకా వుంది..
నర్తనశాల - పార్ట్ 7 త్వరలో..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments