top of page

నర్తనశాల - పార్ట్ 1

Updated: 6 days ago

#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

Narthanasala - Part 1 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 02/06/2025

నర్తనశాల - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



వ్యాసప్రణీతమగు భారతములోని ( విరాటపర్వము) “నర్తనశాల “” స్వేచ్ఛానువాదము. 


శ్లో: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

 ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. 


భారతం పదునెనిమిది పర్వాలు. భగవద్గీత పదునెనిమది అధ్యాయాలు, . భారత యుద్దంలో సైన్యం పదునెనిమది అక్షౌహిణులు. ఆ యుద్దం జరిగింది పదునెనిమిది రోజులు. అలా ఇన్ని రకాలుగా పునరావృత్తమవుతున్న పదునెనిమది సంఖ్యకు గల ప్రాముఖ్యం ఏమిటీ?


సంఖ్యాశాస్త్రానికి, అక్షరశాస్రానికీ సంబంధాన్ని నిర్వచించే ప్రాచీన క్రియలు కొన్ని ఉన్నాయి. వాటిలో కపటయాది సంఖ్యా విధానం అనేది ఒకటి. దాని ప్రకారం య అంటే 1, 

 జ అంటే ఎనిమిది. “అంకానాం వామనోగతిః” అని మరో సూత్రం. దీని ప్రకారం అంకెలను వెనక్కు వేసుకుంటూ వెళ్ళాలి. 


ఈ పద్ధతి ప్రకారం పదునెనిమిది అంటే “ జయ” అనే పదం ఏర్పడుతుంది. అందరికీ జయప్రదంగా ఉండాలనే సంకల్పంతో వ్యాసభగవానుడు, ఇతర మహర్షులు పదునెనిమది సంఖ్యకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. దానిని బట్టి అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, అష్టాదశ మహావిద్యలు, అష్టాదశ స్మృతులు వంటివి ఎన్నో ఏర్పడ్డాయి. 

 ———————————————————————————————————————-

యమధర్మరాజు సూచన ననుసరించి పాండవులు అరణ్యవాసములోని చివరి సంవత్సరమైన అజ్ఞాతవాసమును పాండవుల పట్ల ప్రీతి గలవాడు, ఉదారుడు వృద్ధుడైన మత్స్య దేశాధిపతి విరాటరాజు రాజధాని నగరంలో గడుప నిశ్చయించుకొనిరి. 


యుధిష్టరుడు ఇలా తెలిపెను. ’“సోదరులారా; గుర్తింపబడకుండుటకు మనలో ప్రతి ఒక్కరము ఒక నిర్ధిష్ట పాత్రను ఎంపిక చేసుకొని విరాటమహారాజు సేవలో నియమింపబడవలెను. 


అర్జునుడు ఇట్లడిగెను “అగ్రతాంబూలం: మీరు ఏ పాత్రను పోషింపదలచితిరి?”


యుధిష్టరుడు ఈ విధముగా పలికెను “సోదరా; నేను ఒక బ్రాహ్మణుని పాత్రను కంకుభట్టు అను నామధేయంతో పోషించెదను. నేను మహారాజును సమీపించి పాచికలాట విద్యలో మిక్కిలి నిపుణత కలిగిన వాడిగా ఎల్లప్పుడు మహారాజును సంతోషింపజేసెదను. 


“భీమా: నీవు ఏ పాత్రనుపోషించదలచితివి?”


భీముడు: నేను వల్లభుడనే పాచకునిగా( వంటవాడు) నన్ను నేను పరిచయము చేసుకొందును. మహారాజు గారికి మంచి రుచికరములైన భోజన పదార్థాలను వండి పెట్టుటయే కాకుండ మల్లయుద్దములో సవాలు చేసిన వారందరినీ ఓడిస్తూ అతనికి వినోదము కలిగించెదను.

 

ఆ తరువాత యుధిష్టరుడు యోధాగ్రగణ్యుడు, మేటి విలుకాడైన అర్జునుడు పోషింప దలచుకున్న పాత్ర గురించి అడిగెను. 


అర్జునుడు ఈ విధముగా సమాధానమిచ్చెను: బృహన్నల నామధేయంతో నన్ను నేను ఒక నపుంసకునిగా( పేడిరూపము) ప్రకటించుకొందును. పొడవాటి జుట్టు, చెవుల కుండలాలతో స్త్రీ వేషధారణను ధరించెదను. హాస్యకథలతో, మహా రాజును మరియు వారి దేవేరులను, అంతఃపురకాంతలను వినోదపరిచెదను. అంతఃపుర కాంతలకు సంగీతము, నృత్యము కూడ నేర్పించెదను. 


యుధిష్టర మహారాజు నకులుని ప్రశ్నించెను. అప్పుడు అతడు ఇలా పలికెను “నేను దామగ్రంథి అను నామధేయముతో మహారాజు గారి అశ్వసంరక్షునిగా పాత్రను పోషించెదను." 


యుధిష్టర మహారాజు సహదేవుని అడుగగా “నేను తంత్రీపాలునిగా తనను పరిచయము చేసికొని మహారాజు గారి గోసంరక్షునిగా పాత్రను పోషించెదను” అనెను. 


యుధిష్టర మహారాజు అటుపిమ్మట బాధపడుతూ ద్రౌపదిని ఇట్లు అడిగెను: ఓ దేవీ; నీ వెన్నడునూ దాసీపనులను చేసి ఎరుగవు. నీవు మహారాజుకు ఎటువంటి సేవలను అందించదలచితివి?


ద్రౌపది ఇట్లు సమాధానమిచ్చెను: మహారాజా; బాధపడకుము. నేను సైరంధ్రిగా (కేశాలంకరణ

మరియు అట్టి ఇతర స్త్రీసహజ కళలలో నైపుణ్యము కలిగిన పరిచారిక)గా పరిచయము చేసుకొందురు. విరాటమహారాజు మహారాణి సుధేష్ణాదేవి సేవలో నియమింపబడెదను.

 

యుధిష్టరమహారాజు అందులకు అంగీకరిస్తూ ‘ దేవీ;ఎన్నడునూ నీవు కాముకుల దృష్టిలో

పడరాదు’ అని హెచ్చరించెను. 


పాండవులు మరియు ద్రౌపది గతంలో వారు యుధిష్టర మహారాజు సేవలో ఉండేవారమని 

విరాటుని తెలుప నిర్ణయించుకొనిరి. 


ధర్మరాజు తమ అనుచరులందరితో ఇట్లు పలికెను’ధౌమ్యముని వర్యా; మీరు ఇంద్రసేనుని, 

మరియు ఇతర సారథులను వెంటబెట్టుకుని వెళ్ళి ఏడాది కాలము అక్కడే నివసించవలెను. 

సారథులందరూ మా రథములతో ధ్వారక చేరుకుని యాదవుల సంరక్షణలో ఉండవలెను. 

పిమ్మట మహారాజు, రాబోయే సంవత్సరకాలము జాగ్రత్తగా ఎలా మసలు కోవాలో, ఎలా 

గడుప వలెనో దయచేసి సూచించమని ధౌమ్యులవారిని కోరెను. 


 ధౌమ్యుడు ఇట్లు సూచించెను, ‘ ఓ; మహారాజా, మీరు అజ్ఞాతవాసమున ఉండేందుకు అను

 కులముగా చేసుకొన్నది ఏర్పాట్లను నేను ఆమోదిస్తుంటిని. కానీ, మీరు ద్రౌపదిని ఎల్లప్పుడు

 నూ రక్షించగలిగేలా చర్యలు, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొనవలెను. మహారాజా, మహారాజుతో

 కలిసి నివసించుట సులభమైన విషయమేమీ కాదు. అలా చేయదలచినచో, ఆ మహా

 రాజు గారు అసంతృప్తి చెందకుండునటుల ఉన్నత మర్యాదల ననుసరించి ఖచ్చితముగా

 నడచుకొనవలెను.


రాజులు తమ అత్యున్నతమైన స్థానము మరియు అధికార విషయములలో ఎంతో సున్నితముగా ఉందురు. రాజులు తమ ఆధిపత్యం మరియు గౌరవమునకు భంగం కలిగించు వారెవరైనను చివరకు తమ సొంత సోదరుడైన వారిని క్షమించరు. 


 ‘ ఏ కారణము చేతనైనను మహారాజు అడిగితే తప్ప, అతనికి సలహా ఇచ్చేందుకు సాహసించరాదు. అంతేకాకుండా, మహారాజును తరచూ ప్రశంసిస్తూ, అతనితో మంచిగా మాట లాడుచూ, అతని కృపకు పాతృలయ్యేలా నిరంతరము ప్రయత్నిస్తూనే ఉండవలెను. 


ఎన్నడునూ అతని కంటెను మించిన అధిక సామర్థ్యములను ప్రదర్శింపరాదు. ఒకరు తమ ఇష్టమునకు అనుగుణంగా నడుచుకోవలసిందిగా మహారాజును ఎప్పుడును, ఎన్నడునూ బలవంతపెట్టరాదు. ఎల్లప్పుడు రాజును నీడకు వలె అనుసరించవలెను.


మహారాజు గారి రహస్యములను ఇతరులకు బహిర్గతము చేసి అతని ఆగ్రహమునకు గురికారాదు. రాజు నుండి పొందిన వస్త్రాలను, కానుకలను లేక ఇతర వస్తువులను జాగ్రత్తగా గౌరవముతో ఉపయోగించవలెను. ’


ధౌమ్యుని సూచనలను ధర్మరాజు ప్రశంసించెను. ఆ తరువాత, తమ మత్స్యదేశ ప్రయాణ 

సన్నా హాలలో భాగముగా అన్ని రకాల శాస్త్రవిహితమైన శుభకర్మలను చేయవలసిందిగా కోరిరి. తరువాత పాండవులు తమ దీర్ఘ ప్రయాణములో అనేక రాజ్యాలను దాటి, చివరకు వారు 

విరాట నగర రాజధాని శివారులోని చేరుకొనిరి. 


 ధర్మరాజు ‘ మన ఆయుధాలను ఎక్కడ దాచవలెనో నిశ్చయించుకొనవలెను. ’ అని అర్జునుని

 విచారిస్తూ ‘ వాటినిమన దగ్గర ఉంచుకొనినచో ప్రసిద్దమైన గాండీవము చేత మనలను 

 జనులు గుర్తించెదరు. ’ అనెను. 


అర్జునుడు, ‘సమీపంలోని శ్మశానవాటిక సరిహద్దులో గల విశాలమైన శమీవృక్షముపై మన 

ఆయుధాలు ఎవరి కంట పడకుండా ఉంచి నగర ప్రవేశము చేసెదము. ’

పాండవులు ఆశమీవృక్షము దగ్గరకు వెళ్ళిరి. నకులుడు వృక్షము పైకి ఎక్కి ఆయుధములను అన్నింటిని దట్టమైన శాఖల నడుమ బంధించి కట్టెను. ఆ తరువాత అతడు స్మశానంలోని ఒక శవమును ఆ వృక్షమునకు వ్రేలాడదీసెను. దానితో భరించలేని దుర్గంధము చేత జనులు ఆ ప్రాంత సరిహద్దులకు రాలేరు. 


ఆ దారివెంట వెళ్ళు కొంతమంది గోపాలకులు అనుమానముతో పాండవులను ప్రశ్నించగా, 

ధర్మరాజు ఇట్లు బదులిచ్చాడు. ’ ఇది మరణించిన మా వృద్ధురాలైన తల్లి శవము. మా వంశ

ఆచారము ప్రకారము దీనిని చెట్టుకు వ్రేలాడదీస్తుంటిమి. ’


అత్యవసర పరిస్థితుల్లో ఒకరిని మరొకరు పిలుచుకొనుటకు ఐదుగురు ఐదు గంధర్వుల నామాలను ఎంపిక చేసుకొనిరి. ఆ తరువాత వారు నగరము వైపునకు ప్రయాణము కొనసాగించిరి. ధర్మరాజు యోగమాయను స్త్రోత్రము చేసెను. ఆ యోగమాయ శ్రీ కృష్ణభగవానుని సోదరిగా జనియించి కంసుడు నేలకేసి బాదుటకు ప్రయత్నించినప్పుడు ఆకాశము లోనికి ఎగిరెను. ఆ యోగ

మాయ ( దుర్గాదేవి) కృపను స్తుతిస్తూ యుధిష్టరుడు ఆమెను వైభవోపేతంగా ప్రార్థించెను. 

జగన్మాత సంకీర్తన (మధ్యమావతి)

 ————————————

 మా యమ్మ రావమ్మ- పరమేశ్వరీ-పరమేశ్వరీ-రావమ్మ మాయమ్మ జగదీశ్వరి

 మాయమ్మ రావమ్మ- రాజేశ్వరీ-రావమ్మ మాయమ్మ భువనేశ్వరీ

 ఊఊఊ ఊఊఊ. ఊఊఊ 

 శ్రీ కనకదుర్గ-శ్రీ జగన్మాత- రావమ్మ యమ్మ

 మమ్ములను కరుణించ రావమ్మ- మా యమ్మ

 ఊఊఊ. ఊఊఊ. ఊఊఊ 

 జనని జగదంబ -మహాత్రిపురసుందరీ

 జగన్మాత—లోకమాత రాజరాజేశ్వరీ

 సర్వజగద్రక్ష —దాక్షాయినీ 

 కరుణించుమా మాత— కాత్యాయినీ

 ముల్లోకముల నేలు — సంరక్షిణి

 మమ్మేలుకోవమ్మా— మంగళప్రదాయినీ

 పరమపావనమైన — పరమేశ్వరీ

 శిష్టులను రక్షించు —అభయంకరీ

 మాయందు దయజూపు— భువనేశ్వరీ. 

 

యుధిష్టరుని పట్ల ప్రసన్నురాలైన దేవి పాండవుల ఎదుట ప్రత్యక్షమయ్యెను. ధర్మరాజుకు ఈ విధముగా వరమిచ్చాడు. ’ ఓధర్మరాజా; నా ఆశీర్వచనముతో త్వరలోనే మీకు మీ రాజ్యం 

మీ సంపద లభించును. చింతించవద్దు. మత్స్యదేశంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించజాలరు. భయం విడిచిపెట్టుము. 


అట్లు తెలిపి యోగమాయ అదృశ్యమయ్యెను. 


========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








コメント


bottom of page