top of page

నర్తనశాల - పార్ట్ 7

Updated: Jul 16

#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

ree

Narthanasala - Part 7 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 00/06/2025

నర్తనశాల - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు. నర్తన శాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు, భీముని చేతిలో హతమవుతాడు. గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు. కౌరవులను చూసి భయపడిన ఉత్తర కుమారుడిని సారధిగా ఉండమంటాడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు. గాండీవం ధరించి యుద్దానికి బయలుదేరుతాడు అర్జునుడు. 


ఇక నర్తనశాల - పార్ట్ 7 చదవండి.. 


దానితో ద్రోణుడు శాంతించెను. తరువాత అతను దుర్యోధనునికి రక్షణగా సమకూరునటుల సైన్యమును అమర్చెను. పాండవుల అజ్ఞాతవాసం పూర్తియైనదో లేదో తెలుపవలసిందిగా భీష్ముని మరొకసారి కోరెను. 


భీష్ముణ్ణి నిర్ణయము ప్రామాణికముగా పరిగణింపబడును. అతడు వెంటనే గణించి ఇలా చెప్పెను. “దుర్యోధనా; పాండవుల ఏడాది అజ్ఞాతవాసం ముగిసెను. నిజమునకు, పాండవులెన్నడును స్వప్న‌ములో కూడా మోసపూరితముగా వ్యవహరింపదలచరు. కనుక దీని విషయములో సందేహము లేదు. సత్యవంతుడైన యుధిష్టరుడు తన రాజ్యమును తిరిగి పొందుటకు ఎన్నడునూ న్యాయమార్గమున సంచరించును. అర్జునునితో పోరాడవలసి యున్నందున మనము ఇపుడు యుద్దమునకు వెంటనే సిద్దము కావలెను. ”


దుర్యోధనుడు ఇట్లు పలికెను. “తాతా, ఏమైనను నేను స్వచ్చందంగా పాండవులకు తమ రాజ్యమును తిరిగి ఇవ్వ దలచుకోలేదు. ఎట్టి ఆలస్యం చేయకుండా మనము యుద్దమునకు సిద్ధముగా సర్వసంసిద్దులు కావలెను. ”. 


“దుర్యోధనా; సేనలో మొదటి నాలుగవ వంతును తీసుకుని నీవు హస్తినకు పయనము కమ్ము. రెండవ వంతు గోవులను రక్షిస్తూ తీసుకెళ్ళవలెను. మిగిలిన అర్దసైన్యము ఇక్కడే

ఉండి అర్జునుడు మరియు విరాట రాజు సేనలతో యుద్దము చేయును. ”. 


దుర్యోధనుడు అందులకు అంగీకరించెను. భీష్ముడు మిగతా కౌరవ సైన్యమును అమర్చుటలో వ్యూహాత్మకంగా గోవులను పంపిరి. అర్జునుడు ఆ సమయంలో అక్కడకు వచ్చెను. 


అర్జునుడు నాలుగు బాణములను ప్రయోగించెను. రెండు బాణములు ద్రోణాచార్యుల పాదాల చెంత నమస్సులతో, మరో రెండు బాణాలు అతని చెవుల దగ్గర నుండి దూసు

 కెళ్ళెను. భీష్ములకు కూడా ఆ విధంగానే నమస్కార, కుశల బాణాలు ప్రయోగించెను. 


చెవుల దగ్గర గా వచ్చిన బాణాలు పాండవులు అజ్ఞాత వాసం ముగిసెనని భీష్ముడు ద్రోణులకు విన్నవించెను. సైన్యమునంతటిని గమనించే ఉద్దేశంతో అర్జునుడు తన రథమును కౌరవసేనకు మధ్యన కొద్ది దూరములో నిలుపమని ఉత్తరునికి ఆదేశించెను. దుర్యోధనుని జయింప గలిగితే మిగిలిన కురుసైన్యము యుద్దమును విరమించుదురనే ఆలోచనతో అర్జునుడు కౌరవ రాజు ఎక్కడ ఉండెనో యని చూడదలచెను.. 


దుర్యోధనుడు అక్కడ లేకుండటతో అతడు గోవులతో పాటు హస్తినకు పలాయనము చిత్తగించెనని అంచనా వేసుకొనెను. అర్జునుడు ఉత్తరుని ఇలా ఆజ్ఞాపించెను. “కౌరవ సేనను తప్పించి, హస్తినాపుర మార్గములో రథమును నడిపించుము. అలా మనము దుర్యోధనుని అధిగమించి అపహరించిన గోవులను విడిపించవచ్చును. నీకు కౌరవ మహా రథికులను పరిచయము గావించెదను. ఆలకింపుము. 


అర్జునుడు ఉత్తరకుమారునికి కౌరవసేనలోని వీరులను చూపిస్తూ)


అదిగో కాంచనమయవేదికా కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు

సింహలాంగూల భూషితనభోభాగ కేతు ప్రేంఘనవాడు ద్రోణసుతుడు

కనక గోవృష సాంద్రకాంతి పరిష్కృత ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు

లలిత కంబుప్రభాకలిత పతాకవిహారంబువాడు రాధాత్మజుండు

మణిమయోరథ రుతిజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతి

మహోగ్రశిఖర ఘనతాళతరువగు శిరమువాడు సురనరీసూనుడు

ఏర్పడజూచుకొనుము. 


అర్జునుని ఆలోచనను పసిగట్టిన కృపాచార్యులు వెళ్ళి దుర్యోదనుని రక్షించవలసిందిగా సైనికులను ఆదేశించెను. మరోవైపు అర్జునుడు గోవులను మరియు దుర్యోధనుని రక్షిస్తున్నసైనికులను చేరుకుని ఆకాశమునంతటినీ తన బాణాలతో కప్పివేసి కౌరవ సైనికులను గాఢాంధకారంలో పడవేసెను. తరవాత దీనిని అవకాశముగా చేసుకుని అర్జునుడు తన ధ్వజముపై గల కపివీరుడు కూడా భయంకరముగా సింహగర్జన చేసెను. తన వింటినారిని సారించి శంఖమును పూరించెను. ఈ ధ్వనులన్నీ ఏకమై భూమిని కంపించివేసెను. 


ఆ సమయములో సంభ్రమాశ్చర్యాలతో కౌరవసైనికులు భయభ్రాంతులైరి. అర్జునుడు ఇదే అదనుగా గోవులను రాజధాని వైపునకు తరలించెను. 


గోవులను సరియైన మార్గంలో పయణించిన పిమ్మట అర్జునుడు దుర్యోదనుని ఎదురు కొనుటకు అతని వైపునకు దూసుకు వెళ్ళెను. 


 (అర్జునుడు సుయోధనుడితో యుద్దము చేసేముందు)

ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల జాలగలరే

మణిమయంబైన భూషణాజాలములనొప్పి యొడ్డోల గంబున

నుండగలరే

కర్పూరచందన కస్తూరికాదుల ఇంపుసొంపార భోగింపగలరే

అతిమనోహరలగు చతురాంగనలతోడ సంగతివేడ్కలు 

సలుపగలరే

కయ్యముననోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధిమరలి

ఈ తనువు విడచి

సంగతివడయుము తొల్లింట చూరగలరే

జూదమిచ్చటనాడంగరాదు సుమ్ము. 


అదివరకే ఇతర కురువీరులందరూ దుర్యోదనునికి అండగా నిలిచిరి. అర్జునుడు తన రథమును మొదట కర్ణునివేపునకు తోలమని ఉత్తరుని ఆజ్ఞాపించెను. అది చూచిన అనేక

మంది వీరులు అర్జునుని ఎదురుకొనిరి. మొదటగా వికర్ణుడు అర్జునుని పై దాడి చేసెను. 


దానితో అర్జునుడు అతని విల్లును మరియు ధ్వజమును ముక్కలు చేసెను. కర్ణుని అనుజుడైన సంగ్రాముడు తో ఒక పెద్ద సైన్యము అర్జునుని మార్కొనిరి. అంత అర్జునుడు ఆగ్రహించి నరమేధమును గురిచేస్తూ కర్ణుని అనుజుడైన సంగ్రాముడుతో సహా వేల కొద్ది సైనికులు మరణించారు. 


ఆగ్రహించిన కర్ణుడు అర్జునుని వైపుకు దూసుకు వెళ్ళగా మిగతా వీరులందరూ ప్రేక్షకపాత్ర వహించిరి. ఇరువురు వీరులనూ ఒకరిపై మరొకరు బాణాలను కురిపిస్తూ ఎదుటివ్యక్తి సారథులను మరియు గుర్రాలను కూడా బాధించిరి. 


అర్జునుడు క్రోధముతో రగిలిపోతూ నిద్రిస్తున్న సింహాన్ని హఠాత్తుగా నిద్ర లేపినచో ఎలా ఉంటుందో అలా ఉండెను. నిజమునకు ఉత్సాహముతో గల అర్జునుడు కర్ణుని ప్రతి అవయవ భాగమందు తన బాణములతో బాధించెను. చివరకు కర్ణుడు ప్రాణ భయముతో యుద్దభూమిని వీడి పారిపోయెను. 


ఇతర కురువీరులు అర్జునునిపై దాడి చేసిరి. కానీ వారుకూడా అర్జునుని శరపరంపరకు చెల్లాచెదురైరి. నిజమునకు అర్జునుడు కౌరవ సేనను భయభ్రాంతులకు గురిచేస్తున్న. ఎవరు అతనిని సమీపించినను యమపురికి పయనమగుచుండిరి. ప్రతి ఒక్కరూ అర్జునుని పరాక్రమమును తిలకించుచూ నిస్చేష్టులైరి. 


మరల కర్ణుడు యుద్దరంగములో ప్రవేశించగానే, అర్జునుడు కర్ణుని కర్ణభేరి పగులునట్లుగా కర్ణుని చెవిని చిల్లులు పొడిచెను. దానితో పాటు కర్ణుని సారథిని, గుర్రములను వధించెను. 


కర్ణుడు అడ్డు తొలగిపోయెను. అర్జునుడు తన విలువిద్యా కౌశల్యాలను కృపాచార్యుని ఎదుట ప్రదర్శించదలచెను. కానీ అతడు ఉత్తరునకు ఇలా ఆదేశించెను. “ముందుగా 

రథమును కృపాచార్యులకు చుట్టూ ప్రదక్షిణ చేయుము. అతను ముందుగా మనపై దాడి చేసినప్పుడే నేను అతనితో యుద్దము చేసెదను. ఇతరలందరినీ జయించిన పిమ్మటనే 

 భీష్ముని సమీపించెదను. ఎందుకనగా అతడు మన కార్యములకు అడ్డు తగలడు. ”।


సరిగా ఆకసములోని ప్రధాన దేవతలందరూ తమతమ దివ్యరథాలథో ఆకాశమంతటా ప్రకాశిస్తుండిరి.. ‘


అర్జునుడు మరియు భీష్ముడు నడుమ ద్వందపోరు జరుగు తున్నందున మానవుల చేతుల్లో ప్రయోగింపబడే అస్త్రాలు తిలకించవచ్నని వారి ఆలోచన. వారు ధరించిన దివ్యపూలమాలలు సుగంధముతో మిళితమై మంచి సువాసనలు వెదజల్లుతూ సైనికుల అలసట తీరిపోసాగిననది. 


ఉత్తరుడు రథమును కృపునివైపు నడుపుతుండగా ఇంద్రుడు తన ప్రియపుత్రుడిని తనివితీరని కన్నులతో తిలకించెను. శరధ్వజుని కుమారుడు సమీపించగనే అర్జునుడు తన దేవదత్త శంఖమును పూరించెను. అది భయంకరమైన ధ్వనిని సృష్టించగా, అది భువి నుండి దివికి వెళ్ళి మళ్ళీ భూమిపై ప్రతిధ్వనించెను. 


కృపాచార్యుడు ఆ శబ్దమును సహించలేక అర్జునుని పై శరపరంపర కురిపించెను. ఇరువురు విలుకాండ్రు నిరంతర శరవృష్టిని కురిపించుకోసాగిరి. చివరకు అర్జునుడు కృపాచార్యుని తీవ్రమైన బాణములతో రథాశ్వములను మిక్కిలి బాధించెను. అవి వెనుకకు ఎగురుటతో కృపాచార్యులు తన రథము నుండి స్థానభ్రంశము చెందెను.


తన గురువులమీద గౌరవముతో కొంతసేపు యుద్దము ఆపి నిలిచెను. కృపుడు మరల సన్నద్దమైన పిదప అర్జునుడు కృపాచార్యుని విల్లు కవచము ఛేదించి, ఆయన విల్లువిరిచెను. అంత కృపుడు కృద్దుడై మరో విల్లందుకొనెను. దానిని కూడా అర్జునుడు విరిచివేసెను. కృపుడు విల్లందుకొనుట, దానిని అర్జునుడు ఖండించుట అనేకమార్లు జరిగెను. చివరకు కృపుడు అర్జునునిపై ఈటెను విసిరెను. అది ప్రకాశవంతముగా అర్జునునిపైకి దూసుకుపోయెను. కానీ అర్జునుడు ఆ ఈటెను మధ్యలోనే తునాతునకలు గావించెను. 


తరువాత అర్జునుడు కృపుని సారథి తల నరికి వేసి, ఆతని ధ్వజమును కూడా విరిచి వేసెను. సారథి లేనందున కృపుడు రథము నుండి దూకి అర్జునుని పై చివరి యత్నముగా గదను విసిరివేసెను. కానీ అర్జునుడు ఆ గదను తన శరములతో తుత్తునియలు చేసెను. ఆ గద చూర్ణము ఒక అద్భుత కార్యము వలె జరిగినది. కృపాచార్యుని రక్షకభటులు అర్జునునిపై దాడి చేసి ఆచార్యుని యుద్దరంగమునుండి వేగముగా తీసుకు వెళ్ళిరి. 


తరువాత ద్రోణుడు భయంకరముగా అర్జునుని పైకి దూసుకెళుతూ తన శంఖమును పూరించెను. ద్రోణునితో తలపడుటకు ముందు అర్జునుడు వారికి నమస్కారిస్తూ ఇలా

వినయముగా పలికెను. ” ఓ, గురుదేవా; మా అజ్ఞాతవాసం పూర్తైనందున గతములో మా పై జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకునుటకు ఎంతో ఆతృతగా ఉంటిని. 

 ఏమైనను, మొదట మీరు బాణము ప్రయోగించే వరకూ నేను మీపై దాడి చేయను. ”


బదులుగా ద్రోణుడు శర సంధానము గావించెను. కానీ అర్జునుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేసెను. అర్జునుడు మరియు ద్రోణుడు ఒకరిపై నొకరు శరవృష్టిని కురిపించు

కొనుటను చూసి ఇతర యోధులందరూ ప్రేక్షక పాత్ర వహించిరి. వారిరువురి అస్త్రవిద్యా నైపుణ్యము తిలకిస్తున్నట్టి ప్రతిఒక్కరూ ఇలా భావించిరి. 


“క్షత్రియుల ధర్మము ఎంత కఠినమైనది. శిష్యునకు గూడా కొన్ని సమయాల్లో తన గురువుతో యుద్ధము చేయవలసి వస్తుండెను. ”


ద్రోణుని బాణాలు గాలిలో ప్రయాణిస్తూ ఒకదాని కొమ్మును మరొకటి తగులుకొని ఒక రేఖవలె అగుపించెను. దానితో అదే శరదృతువులో పక్షులు దక్షిణము వైపునకు పయనిస్తున్నట్లుగా అగుపించెను. అర్జునుడు కూడా ద్రోణుని బాణాలను అదే స్థాయిలో ప్రతిఘటిస్తున్నందున ఆకాశమంతయూ శరములతో నిండిపోయెను. 


తన బాణాలను అర్జునుడు ఎదుర్కొనే విధానముతో సంతుష్టుడైన ద్రోణుడు తన ప్రియశిష్యునితో పోరాడసాగెను. క్రమముగా అర్జునుడు తన శరపరంపరతో అసంఖ్యాకమైన కౌరవయోధులను యమపురికి పంపెను. క్రమముగా కౌరవసైన్య వ్యూహమంతయూ ఛిన్నాభిన్నమయ్యెను. 


అర్జునుడు మరింత వేగముగా బాణప్రయోగము చేయుచూ వేలాది బాణాలతో ద్రోణుని రథమును కప్పివేసెను. దానిని చూసిన కౌరవయోధులు భయముతో వణకసాగిరి. ఆకసమున దేవతలు అర్జునుని పరాక్రమమును ప్రశంసించారు. మరల అర్జునుడు ద్రోణాచార్యుల కవచమును ఛేదించెను. అది చూచిన అశ్వత్థామ తదితర యోధులు ద్రోణునికి రక్షణగా దూసుకొస్తుండగా, అర్జునుడు అటువైపునకు తిరిగినంతనే ఆచార్యులు దానిని అవకాశముగా తీసుకుని వేగముగా అచట నుండి సురక్షితముగా వెడలిపోయెను. 


అర్జునుడు అశ్వత్థామ బాణాలను ధీటుగా ఎదురుకొనసాగెను. దానితో వారి పోరు తీవ్రతరమయ్యెను. అశ్వథామ అశ్వాలు తీవ్రమైన గాయాలతో సరియైన దిశలో పయనించలేక పోయెను. అటువంటి స్థితిలో కూడ ద్రోణపుత్రుడు అర్జునుని గాండీవపు నారిని త్రుంచెను. పైన దేవతలు కూడ ఈ అద్భుతమైన సన్నివేశమును ప్రశంసించిరి. అశ్వత్థామ వెనువెంటనే అర్జునుని యెదను తీవ్రమైన బాణముతో బాధించెను. ఏమాత్రము భయపడని కౌంతేయుడు చిరునవ్వుతో తన వింటికి మరొక నారిని బిగించి మరల పోరును ఆరంభించెను. 


చివరకు అశ్వత్థామ తూణీరములో బాణములు నిండుకొనెను. అర్జునుని తూణీరాలు అక్షయములు. ద్రోణపుత్రునితో పోరును నిలుపుటకు నిర్ణయించుకొనెను. తరువాత మరల కర్ణుడు అర్జునునిపై దాడి చేసేందుకు దూసుకు వెళ్ళెను. కర్ణుని చూచిన అర్జునుడు ఆగ్రహముతో తన వింటి నారిని భయంకరముగా లాగి విడిచెను. కర్ణుని సమీపిస్తూ ఇటుల పలికెను. 


ప్రేలితి వెన్నో సార్లు కురువృద్దుల ముందర, నేనొక్కండనే సంగరంబునందు అర్జునుని జయించెద

 

 ‘ఓ అంగరాజా; నా సోదరులతోనూ మరియు ద్రౌపదితోనూ నీ దుష్టప్రవర్తనకు నేడు ఇఫుడు అనుభవించెదవు. 


కర్ణుడు ఆ మాటలకు రోషపడి “అర్జునా; చనిపోవు వాని మాటపలుకుచుంటివి. మరణించే వాని పలుకులను విశ్వసించము. ”


అర్జునుడు ఈ విధముగా బదులిచ్చెను. ” కర్ణా; సోదరుని చావు చూసి పారిపోయిన పిరికిపందవు నీవు తప్ప మరెవ్వరు గొప్పగా పలుకగలరు. ”. 


అలా పలికి అర్జునుడు కర్ణుని పై శరవృష్టిని కురిపించెను. కర్ణుడు కూడా అటులనే స్పందించెను. ఇంతలో అర్జునుడు కర్ణుని అమ్ములపొదిని, బంధించిన త్రాటిని త్రుంచివేసెను. ప్రతీకారముగా కర్ణుడు అర్జునుని గాండీవమును పట్టుకొని చేతిపై బాణప్రయోగము చేసెను. 


దానితో అర్జునుడు క్షణకాలము తన పట్టును కోల్పోయేలా చేసెను. అర్జునుడు తేరుకుని వెంటనే ఆగ్రహముతో విల్లుని ఖండించెను. కర్ణుడు ఉక్రోశముతో ఒక బల్లెమును విసిరెను. 

 అర్జునుడు దానిని మధ్యలోనే త్రుంచివేయగా, కర్ణుని రక్షకభటులు మూకుమ్మడిగా అర్జునుని పైకి దాడిచేసిరి. 


అర్జునుడు వారు సమీపించిన వెంటనే వారిని సరాసరి యమపురికి పంపెను. తరువాత అతడు కర్ణుని గుర్రాలను వధించెను. చివరకు కర్ణుని కవచము వదులగుట గమనించి

ఆతని యెదపై తీక్షణమైన బాణములు నాటెను. అది తాత్కాలికముగా కర్ణుడు స్పృహ కోలుుపోవునట్లుగా చేసెను. 


స్పృహలోకి వచ్చిన కర్ణుడు యెదలో బాధను భరించలేక మరియు ఉత్తరుడు హేళన చేస్తుండగా యుద్ధభూమిని వదిలి పారిపోయెను. 


========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree




Comments


bottom of page