top of page

నర్తనశాల - పార్ట్ 5

Updated: 5 days ago

#AyyalaSomayajulaSubrahmanyam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #Narthanasala, #నర్తనశాల, #అజ్ఞాతవాసం, #పురాణం, #Devotional, #TeluguSerialEpisodes

Narthanasala - Part 5 - New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 28/06/2025

నర్తనశాల - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


 జరిగిన కథ:


అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాలలో చేరుతారు. భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు. కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు. నర్తన శాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు, భీముని చేతిలో హతమవుతాడు. ఉప కీచకుల బారి నుండి ద్రౌపదిని రక్షిస్తాడు భీముడు. గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు. 


ఇక నర్తనశాల - పార్ట్ 5 చదవండి.. 


ఒకవైపు ఇక్కడ యుద్దము జరుగుతుండగా, మరొక ద్రిక్కునుంచి కౌరవసేన గోపకులను తరిమి వేసి వారి గోసంపదను తరిలించుకుపోసాగిరి. దానితో గోపకుల నాయకుడు, విరాటరాజు కొడుకైన ఉత్తరుని ( భూమింజయుడు) దగ్గరకు వెళ్ళిరి. ఉత్తరుని నగర సంరక్షకుడిగా ఉంచి  మిగిలిన రథులంతా యుద్దభూమికి వెళ్ళిరి. ఉత్తరుడు ఒక్రడు మాత్రం నగర సంరక్షణ కారణం

 చేత యుద్ధభూమికి వెళ్ళలేదు. గోపకుల నాయకుడు వెళ్ళి ఉత్తరుని అర్థించెను. 


“ఓకుమారా; మన గోసంపద నంతనూ కౌరవులు స్వాధీన పరచుకొనిరి. దయచేసి శత్రువులను ఓడించి మన గోవులను రక్షించవలెను. మీరు గొప్ప యోధులని మీ తండ్రిగారు పలుమార్లు మీ గురించి గొప్పగా చెప్పుటను మేము విన్నాము”


ఈ విధముగా గోపకుల నాయకుడు అంతఃపుర స్రీలముందు ఉత్తరునికి విన్నవించగా, అతడు వెంటనే ప్రగల్భాలు పలుకసాగెను. నేను యుద్దరంగమున కౌరవులను జయించి 

గోవులను విడిపించేవాడిని. కానీ, దురదృష్టవశాత్తు మంచి చాకచక్యం గల సారథి లేనందున నా పరాక్రమము ప్రదర్శింపలేకుంటిని. ”


అది వినిన బృహన్నల ద్రౌపది తో ఇట్లనెను. “ఉత్తరునితో నేను అర్జునుని రథసారథిగా ఉండే వాడినని, అతని రథముకు సారథిగా వెళ్ళగలనని తెలుపుము. అప్పుడు అతడు అతి సులభముగా విజయము సాధింపగలడు”. 


ద్రౌపది సంకోచిస్తూనే ఉత్తరునితో ఇలు పలికెను. ” ఓ, వీరకుమారా; నేను పాండవుల పరిచారికగా ఉండేదానిని. అక్కడ ఒకరోజు నేను ఒక విషయమును వింటిని. ఖాండవ దహన సమయములో అగ్నికి రక్షకునిగా అర్జునుడు ఉన్నప్పుడు, అతని రథమునకు బృహన్నల

 రథసారథిగా ఉండెనని వింటిని”. 


ఉత్తరుడు ఇట్లు పలికెను. ” సైరంధ్రి; బృహన్నలను నాకు సారథిగా యుద్దభూమికి రమ్మనుటకు బాగా సిగ్గుపడుచుంటిని. లజ్జితుడగుచుంటిని”. 


అతని సోదరి ఉత్తర అడిగితే అందుకు బృహన్నల అంగీకరింపవచ్చునని ద్రౌపది సూచించెను. అప్పుడు ఉత్తర బృహన్నలను సమీపించి ఇట్లా అడిగెను. 


“ఓ గురువర్యా; విరాటమహారాజు గోసంపదని బలవంతముగా కౌరవులు అపహరించిరి. ఒకవేళ సారథ్యము చేయగలిగితే నా సోదరునితో వెళ్ళగలరు. శత్రువులతో యుద్ధము చేసి 

న్యాయముగా మనకు చెందిన గోసంపదను తిరిగి పొందునట్లుగా విడిపించవలెను.” 


అప్పుడు ఉత్తరకుమారుడు చిరునవ్వతో బృహన్నలను సమీపించి సారథిగా ఉండుమని

 అర్థించెను. హాస్యముగా బృహన్నల ఇటుల బదులిచ్చెను. “రాకుమారా; మిమ్మల్ని సంగీత నృత్యాలతో వినోదపరచగలనే గానీ యుద్దరంగములో సారథిగా ఎలా నడుచుకోగలను?”


ఉత్తరరాకుమారుడు పట్టుబట్టగా అర్జునుడు అంగీకరించెను. అర్జునుడు హాస్యముగా తనకు అందించబడిన కవచమును ఎలా ధరించవలెనో తెలియని వాడిలా ఆందోళన చెందెను. 

 అప్పుడు ఉత్తర రాకుమారుడు కవచమును అర్జునునికి ధరింపజేసెను. అది చూసిన అంతఃపుర స్త్రీలందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకోసాగిరి. 


వారు బయలుదేరు సమయములో ఉత్తరరాకుమారి బృహన్నలను సమీపించి ఇలా అర్థించెను. 

“గురువర్యా, కౌరవులు ఓడించిన పిమ్మట నేను మరియు నా సఖులు బొమ్మలను అలంకరించు కొనుటకు వారి తలపాగా కుచ్చులను దయచేసి తీసుకురాగలరు”. 


అర్జునుడు ఈ విధముగా బదులిచ్చెను. ” మన ఉత్తర రాకుమారులు ఆ గొప్పవీరులను జయింప గలిగితే, నేను సంతోషముగా నీవు అడిగిన వాటన్నింటినీ తప్పక తీసుకు వచ్చెదను. ”


ఉత్తర రాకుమారుడు మరియు బృహన్నల కలిసి బయలు దేరిరి. త్వరలోనే వారు దుర్యోధన, దుశ్శాసన, కర్ణ మరియు కురు వృద్ధులు గురువృద్దు లగు భీష్మ, ధ్రోణ, కృపాచార్య మరియు అశ్వత్థామ మొదలగు అనేకమంది ఇతర యోధులతో పరివేష్టితమైయున్న కురుసేనను చూచిన ఉత్తరుడు వణుకుచు రోమాలు నిక్కబొడుచుకుని ఆందోళనతో అర్జునుడితో ఇట్లనెను.

 

“ఓ బృహన్నలా, నాకు మూర్చ కలిగేలా వున్నది. ఈ మహాయోధులతో నేను పోరాడే ధైర్యం లేదు. పోరాడలేను. కనుక రథమును వెంటనే వెనుకకు మరల్చుము. ”


అర్జునుడు ఉత్తరుని ఈ విధముగా మందలించెను. “ఓ వీరకుమారా; రాజభవనములో స్త్రీల ఎదుట పలికిన పలుకులను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొనుము. మీరు పిరికితనంతో వెనుకాడుటకు నేను ఇష్టపడను. కనుక నేను ఇప్పుడు కౌరవయోధుల దగ్గరకు మన రథమును తోలెదను.” 


ఉత్తరుడు మిక్కిలి భయముతో ఇట్లు బదులిచ్చెను. “కౌరవులు మన గోవులన్నింటినీ అపహరించినను, ఆ విషయమును నేను లక్ష్యపెట్టను. అందరూ పిరికివాడినని హేళన, పరిహాసము చేసినపుడు నేను పట్టించుకోను. ఏమైనను ఎట్టిపరిస్థితుల్లోనూ నేను యుద్దం

చేయను. ”


అట్లు పలికి ఉత్తరుడు రథముపై నుండి క్రిందికి దూకి, తన విల్లును విడిచి రాచమర్యాదలను మరచి వెనక్కు తిరిగి వీలైనంత వేగంగా పారిపోనారంభించెను. బృహన్నల అతని వెనుక పరుగెత్తుతూ ఈ పిరికి చర్యకంటెను క్షత్రియునకు యుద్దరంగమున శత్రువు చేతిలో మరణించుట మంచిదని హితవు పలికెను. 


నిజమునకు బృహన్నల తన పొడుగాటి జుట్టు గాలిలో ఎగురుతుండగా ఉత్తరుని వెనక పరుగెత్తసాగెను. మృగరాజుకు నపుంసక శారీరక లక్షణములు మరియు దేహధారుడ్యము చూచి కౌరవ సేనలు రథసారథిని ప్రశంసించిరి. విరాటుని పుత్రుని వెనుకకు మరలింప యత్నిస్తున్న వ్యక్తి ఎవరాయని ఊహించసాగిరి. 


కౌరవులు ఈ విధముగా ఊహాగానాలు చేస్తుండగానూరడుగుల ముందుకు బృహన్నల వెళ్ళి ఉత్తరుని జబ్బ పట్టుకుని వెనుకకు మరలింప, దానితో ఉత్తరుడు దీనముగా ఇలా 

 వేడుకొనెను. 

“ఓ, బృహన్నలా; నన్ను వెళ్ళనీయుము. ”


అందుకు బదులీయకుండా అర్జునుడు చిరునవ్వుతో ఉత్తరకుమారుని వెనక్కు లాగెను. ఉత్తరుడు భయముతో వణకసాగెను. అది గమనించిన అర్జునుడు అతడిని స్వాంతపరస్తూ ఇలా పలికెను. “యుద్దము చేయుటకు నీకు భయమైనచో పగ్గాలు పట్టుకుని రథసారథ్యము 

 చేయుము. నేను కౌరవులతో యుద్ధము చేసెదను.”

 

ఉత్తరుడు కొంత ఉపశమించి రథమును అధిరోహించి సారథి స్థానములో కూర్చుండెను. అర్జునుడు అప్పుడు అతడిని తమ ఆయుధాలను దాచిన శమీవృక్షము దగ్గరకు రథము పోనిమ్మని ఆజ్ఞాపించెను. ఉత్తరుడు సారథిగా మారి రథమును తోలుటను చూచిన కౌరవ సేన మరింత గంభీరముగా ఆ నపుంసక వీరుడు ఎవ్వరు యని వారి హృదయములో విపరీతమైన అలజడి చెలరేగెను


 కౌరవసేనజూచె వణకెన్‌దొడగెన్‌ మదిలోన నేను న

 వూరకపోవుచుంటి యిది వొప్పునే ఇప్పటి భంగి జూచినన్‌

 వీరలనేను మార్కొనది నిశ్చయము అట్లగునన్‌ రయమునన్‌

 తేరు మరల్పు ప్రాణములు తీపి మున్వినదే బృహన్నలా;


మరోవైపు శమీవృక్షము సమీపించిన అర్జునుడు ఉత్తరునితో, ”వృక్షము పైకి ఎక్కి పాండవులు దాచిన ఆయుధములను తీసుకు రమ్ము” అని ఆజ్ఞాపించాను. 


‘బృహన్నలా; ఈ వృక్షముపై శవము వ్రేలాడుచుండెను. నేను రాజకుమారుడను. కనుక అట్టి నీచకార్యములు చేయుటకు నేను వెళ్ళను’ అని చెప్పెను. 


========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








コメント


bottom of page