top of page

నాటుదాం! మొక్కలను

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #నాటుదాంమొక్కలను, #NatudamMokkalanu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 34

Natudam Mokkalanu - Somanna Gari Kavithalu Part 34 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/03/2025

నాటుదాం! మొక్కలను - సోమన్న గారి కవితలు పార్ట్ 34 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


నాటుదాం! మొక్కలను


మొక్కలను నాటుదాం

తరువులను పెంచుదాం

ఒక్కింత శ్రద్దపెట్టి

పచ్చదనం పంచుదాం


కరువులను తరుముదాం

వానలను కురిపిద్దాం

అడవులను కాపాడి

జనులకు మేలు చేద్దాం


బాధ్యతగా తలంచి

జనాలను ప్రోగేసి

ఎండలను తగ్గిద్దాం

వనాలను పెంచేసి


ప్రాణదాతలు తరువులు

మనోహరమే మొక్కలు

పుడమితల్లికి అందము

మానవాళికి బంధము









అయ్యవారి సందేశం

----------------------------------------

తరువు ఒకటి పెంచుము

నిలుపునోయి ప్రాణము

చెరువునొకటి త్రవ్వుము

తీర్చునోయి దాహము


గురువు వెంట నడువుము

దొరుకునోయి జ్ఞానము

ఊరు పేరు నిలుపుము

దక్కునోయి గౌరవము


సజ్జనుల సహవాసము

మార్చునోయి జీవితము

పొత్తంతో పరిచయము

పెంచును లోక జ్ఞానము


మనసుతో పనిచేస్తే

ఏదైనా సాధ్యము

జత కలసి నడిస్తే

ఖచ్చితమే విజయము
















హితోక్తుల వెలుగులు

----------------------------------------

అన్నం పెట్టిని చేతిని

జ్ఞానం పంచిన గురువుని

ఎన్నడూ మరవరాదోయ్!

కృతజ్ఞతలు తెలపాలోయ్!


సరిహద్దు సైనికులను

పారిశుద్ధ్య కార్మికులను

గుర్తించుకోవాలోయ్!

సదా గౌరవించాలోయ్!


జన్మనిచ్చిన వారికి

మనం పుట్టిన ఊరికి

కీర్తి తెచ్చి పెట్టాలోయ్!

స్ఫూర్తి కొంత పంచాలోయ్!


నిజమైన స్నేహితులకు

మహిలోన మహనీయులకు

ద్రోహము తలపెట్టకోయ్!

అనిశము కాపాడుకోయ్!




















అక్షర సుభాషితాలు

----------------------------------------

వెదకరాదు తప్పులు

పెట్టరాదు తిప్పలు

మనిషిలోని మంచిని

చూసు వారు మాన్యులు


ఇతరుల భావాలను

మదిలో ఇష్టాలను

గౌరవిస్తే చాలు

అందరికి బహు మేలు


స్నేహితుల మధ్యలో

రేపరాదు గొడవలు

పచ్చని కాపురాల్లో

రగిలించకు మంటలు


ఎదుటివారి క్షేమము

కాసింత యోచించు!

అందరి సంక్షేమము

మెండుగా కాంక్షించు









నీతి సూక్తులు

----------------------------------------

పెల్లుబికిన లావాలా

పెనుముప్పు దురుసుతనము

తగలబెట్టు నిప్పులా

దహించు అహంకారము


చెట్టుకు పట్టిన చెదలలా

తినివేయును నీచగుణము

గర్జించే సింగంలా

చీల్చివేయును కోపము


ముంచివేయు ఉప్పెనలా

మదిని ఓర్వలేనితనము

వాడిపోయే పూవులా

క్షీణించునోయి అందము


వెంటాడే పీడలా

ఉండునోయి లోభత్వము

హానిచేయు చీడలా

పనిచేయు దానవత్వము


-గద్వాల సోమన్న


Comments


bottom of page