యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త
- Nallabati Raghavendra Rao
- Mar 14
- 8 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #Yuvathi Yuvakullara Tasmath Jagrattha, #యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త, #TeluguFantacStories, #తెలుగుకథలు

Yuvathi Yuvakullara Tasmath Jagrattha - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao
Published In manatelugukathalu.com On 14/03/2025
యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
బాలవర్థి రాజు కష్టపడి తను సంపాదించిన మాయల పకీరు ప్రాణమైన గోల్డెన్ చిలుకను చేతులతో పట్టు కొని మాయల పకీరు గృహలోకి ప్రవేశించాడు.
మాయల ఫకీరును బెదిరించి తద్వారా అందరినీ శాప విముక్తులను గావించి తన తండ్రిని కూడా శిలాప్రతిమ రూపంలో నుండి మానవ రూపంగా మార్పించి.. ఆనక మాయల పకీరు ప్రాణం అయిన చిలుకను చంపి ఈ ప్రపంచానికి మాయల పకీరు బాధ లేకుండా చేసి తన తండ్రితో మళ్ళీ రాజ్యం ఏలింప చేయాలి అన్నది అతని అభిలాష.
చిలుకతో తనను ఆటపట్టించడానికి తనను చంపడా నికి బాలవర్ధిరాజు వస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకున్న మాయల పకీరు ఆ చిన్ని కుర్రాడిని ఎలా గైనా బుట్టలో తట్టలో పెట్టి మాయ చేసి మ్యాజిక్కు చేసి అతని చేతులలో ఉన్న ఆ చిలుకను అతని నుండి తాను గ్రహించి బెదిరించి భయపెట్టి బాలవర్ధి రాజు ను ఇంటికి పంపేయాలి అన్నది మాయల ఫకీరు ఆలోచన.
తన కుడి చేతిలో పట్టుకున్న గోల్డెన్ చిలుకతో బాలవర్ధి రాజు గుహలోకి ప్రవేశించాడు.. గుహ మొత్తం చాలా సేపు కలియ తిరిగి వెతికి చివరికి చాలామంది రాజ కుమారుల శిలాప్రతిమల మధ్యన తన తండ్రి శిలా ప్రతిమ ఉన్నట్టు చూసి చాలా సేపు బాధపడ్డాడు.. గోల్డెన్ చిలుక వైపు ఒకసారి చూసి కాసేపట్లో ఆ చిలు కను మెడ పిసికి చంపడం ద్వారా మాయల పకీరు ప్రాణం తీయబోతున్న ఘట్టం గుర్తు చేసుకుని చాలా ఆనందపడ్డాడు..
మాయల ఫకీరు చావుతో రాజకుమారుల శిలాప్రతి మలు మానవ రూపంలోకి మార్చబోతున్నందుకు మహదానందంగా ఉన్నాడు.. అంతేనా తన కన్న తండ్రి మహాయోధుడు పరాక్రమశాలి అందగాడు కార్యవర్థి రాజు తో రాజ్యం చేరి తన తల్లితో క్షేమంగా తన ఆనం దంగా గడిపే క్షణాలను కూడా అలా తన తన్మయ దృష్టి తో వీక్షించి మరింత మహదానంద పడిపోయాడు.
అతి చిన్న వయసులో తను సాధించబోయే ఈ ఘనకార్యానికి ప్రపంచంలో అన్ని రాజ్యాల రాజులు.. చక్రవర్తులు పొగడ్తలతో తనను ముంచెత్తబోయే సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ సంబరపడి పోయాడు.
అంతలో మాయల పకీరు వస్తున్న పాదరక్షల శబ్దం భయంకరంగా వినబడింది బాలవర్ధిరాజుకు.
వస్తు తనను చూసి వికటంగా మాయల ఫకీరు నవ్వడం, తల భయంకరంగా ఊపడం.. అలా ఊపేట ప్పుడు అతని పొడవాటి ఉంగరాల ముంగురులు అతి భయంకరంగా గింగిర్లు తిరగడం చూసి కొంచెం తడ బడ్డాడు బాలవర్ధిరాజు.. అంతేకాదు అతని కళ్ళల్లో భయంకర అగ్నిగోళాలు అగ్గినిప్పులను చల్లుతున్నట్లు అనిపించి ఒక్క అడుగు వెనక్కి వేశాడు బాలవర్ధిరాజు.
కొంచెం తమాయించుకుని నిలబడగలిగాడు.. తన చేతిలో ఆ మాయల పకీరు ప్రాణమే ఉన్నప్పుడు తను ఇలా ఎందుకు భయపడుతుండడం అనుకుంటూ తలను విదిలించుకున్నాడు.. ధైర్యం కూడ గట్టుకు న్నాడు.
'' భడవ.. వచ్చావా నచ్చావురా.. నా ప్రాణాన్ని పట్టుకు పోదాం అనుకుంటున్నావా.. శభాష్.. నా ప్రాణమైన చిలుకను పట్టావురా.. దాని పీక నులిమి దానిని చంప డం ద్వారా నన్ను చంపాలనుకుంటున్నావు కదూ.. అలాగే నాకు కూడా చచ్చిపోవాలని ఉంది రా.. నీలాంటి చిన్నపిల్లాడి చేతిలో చస్తే ఈ ప్రపంచంలో నా పేరు అందరూ చెప్పుకుంటారు గొప్పగా.. అంతకన్నా నాకు ఇంకేం కావాలిరా భడవ''''.. అంటూ సంతోషంగా మాట్లాడాడు.
బాలవర్ధిరాజుకు అర్థమైంది.. తనను తట్టలో పెట్టి బుట్టలో పెట్టి మ్యాజిక్కు చేసి తన చేతిలో ఉన్న గోల్డెన్ చిలుకను సంగ్రహించి తనను బెదిరించి భయపెట్టి పంపించేయాలని అతను ప్లాన్ వేస్తున్నట్టు బాలవర్ధి రాజుకు అర్థం అయిపోయింది.
''ఓ మాయల ఫకీరు నీ నక్క వినయాలు చాలించు.. నీ ఎత్తు పై ఎత్తు మాటలు నాకు అర్థం అవుతున్నాయి.. నీ వల లో పడే అంత అమాయకపు వెర్రి వెంగళప్పను కాదు నేను. ''
అంటూ ధైర్యంగా మాట్లాడాడు బాలవర్ధి రాజు
''చాలా సాహసివిరా డింభకా.. ఈరోజు నేను చస్తానని నాకు తెలుసు రా.. నా కర్ణపిశాచి చెప్పేసిందిరా.
అందుకు భయపడటం లేదు రా.. మనిషైనా, రాక్షసు డైన, నాలాంటి మాయల ఫకీరైనా ఎప్పటికైనా చావవ ల్సిందే కదరా డింభకా.. చచ్చేముందు చివరి కోరిక తీరుస్తారట కదా.. ఆ కోరిక నాకు తీర్చరా నేను చచ్చి పోతాను సంతోషంగా. '' అన్నాడు మాయలఫకీరు.
''సరే నాకు 30 అడుగుల దూరంలో ఉండే నువ్వు ఏదైనా కోరుకో.. నా దగ్గరకు వచ్చి నా కుడి చేతిలో చిలుకను అపహరించాలని ప్రయత్నం చేశావు అంటే మాత్రం కుదరదు. ''
అంటూ అవకాశం ఇచ్చాడు జాలి పడిన బాలవర్ధి రాజు.
''ఏం లేదురా బాలక.. ఇప్పుడు సెల్ ఫోన్లు అంటూ వచ్చాయి అంట కద.. ఇదిగో నా దగ్గర కూడా ఉంది.. అది నీ దగ్గరలో బల్ల మీదే ఉంది.. దానిని ఉపయో గించడం ఇక్కడ మాకు ఎవ్వరికి రాదు. దానిని తీసు కుని అందమైన నా ఫోటోలు కొన్ని తీసి అక్కడనుండే నాకు చూపిస్తే చాలుర.. నా ముఖం ఎలా ఉందో చూసుకొని ఆ ముచ్చట తీరాక హాయిగా చచ్చిపోతాను రా.. ఇదే నా చివరి కోరిక. '' అంటూ ప్రాధేయ పూర్వ కంగా అడిగాడు మాయల ఫకీరు.
బాలవర్ధి రాజు నవ్వుకున్నాడు అతని అంగర తింగర కోరికకు..
'పాపం తన ఫోటో తీసే వాళ్లు లేక సెల్ ఫోన్ ముచ్చట తీరలేదు అనుకుంటాను ఈ మాయల గాడికి.. దూరం నుండి నాలుగు ఫోటోలు తీసి చూపిస్తే పోయే దే ముంది.. చచ్చిపోయేటప్పుడు కొంచెం సంతృప్తిగా చస్తాడు.. అది నా మానవ ధర్మం కూడా''
అలా అనుకుంటూ బాలవర్ధిరాజు మరింత జాలిపడి తన ఎడమ చేతిలోని కి చిలుకను మార్చుకొని కుడి చేతితో సెల్ అందకొని ఆన్ చేసి మాయల ఫకీరు రకరకాల ఫోజులు పెట్టగా నాలుగు కలర్ ఫోటోలు తీసి అలా దూరం నుంచి చూపించాడు.
అవన్నీ చూసిన మాయలఫకీరు చాలా ఆనందించాడు.. మహదానందంతో భరతనాట్యం, చిందునాట్యం, కథాకళి, కూచిపూడి అన్ని చేసేసాడు.
''సంతోషం కలిగించావురా బాలకా.. చిట్టచివరి చిన్ని కోరిక తీర్చి మరింత మహదానందం కలిగించరా''
అంటూ చాలా బేలగా బాధగా అడిగాడు మాయల ఫకీరు బాలవర్ధిరాజుని.
బాలవర్ధిరాజు మాయల ఫకీరు మీద చాలా జాలి పడ్డాడు.. మాయలు వచ్చినా చాలా పిచ్చివాడు అమాయకుడు ఈ మాయల ఫకీరు.. పాపం ఎలా బ్రతుకుతాడో.. అని తన మనసులో అనుకుంటూ మరో నిమిషం లో తన చేతిలో చావ బోయవాడికి ఆమాత్రం చిన్ని కోరిక తీర్చడంలో తప్పు లేదనే తన మనసును నిగ్రహించుకున్నాడు.
''ఓ.. మాయల ఫకీరు నువ్వు అనవసరంగా మాయ మంత్రాలు మాత్రం చేయకు.. నీ ముఖం చూస్తే నాకు జాలి వేస్తుంది కనుక ఈ కోరిక కూడా తీరుస్తాను అక్కడ నుండే అడుగు '' అన్నాడు.
''బాలకా.. ప్రస్తుతం సెల్ఫీలు తీసుకునే ట్రెండు విపరీతంగా ఉంది అట కదా.. నా జీవితంలో చిట్ట చివరిగా మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగాలని చిరు కోరిక రా బాలక.. అది కూడా తీర్చే వనుకో ఆనందంగా నీ చిన్నారి చేతులలో చచ్చిపోతాను రా. ''
ఏడుపు ముఖం పెట్టి అన్నాడు మాయల ఫకీరు.
బాలవర్ధి రాజుకు ఇంకా బాగా ఎక్కువగా జాలి వేసే సింది.. తన ఎడమ చేతిని దూరంగా జరిపి ఆ చేతి లోనే ఉన్న చిలుకను గట్టిగా పట్టుకొని.. మాయల ఫకీరు తో సెల్ఫీ దిగడానికి కొంచెం దగ్గరగా వచ్చాడు..
ఏ డైరెక్షన్లో నిలబడిన సెల్లో సెల్ఫీబొమ్మ రాకపోవడం తో మాయల ఫకీరు చెప్పిన డైరెక్షన్లో నిలబడడానికి ప్రయత్నించాడు.. బాలవర్ధి రాజు.. కొంచెం వెనక్కు వంగుతూ.
అంతే బాలవర్ధి రాజు ఎడమ చేతి లో ఉన్న గోల్డెన్ చిలుక మాయల ఫకీరు ఎడమ చేతికి అందేసింది.
పుటుక్కున పట్టుకొని పుసుక్కున లాక్కున్నాడు మాయల ఫకీరు ఆ గోల్డెన్ చిలుకను.. వెంటనే గుహ బయటకు వచ్చి ఆకాశంలోకి చిలుకను వదిలేశాడు.. వికట అట్టహాసంతో నవ్వుకుంటూ వెనక్కు తిరిగి వచ్చాడు.
''నా చిలకేది నా చిలకేది.. ??'' పిచ్చివాడిలా ఎర్రివాడి లా అమాయకంగా అడిగాడు మాయలఫకీరును బాలవర్ధి రాజు.
''చిలకలేదు ఎలక లేదు పిలక లేదు.. ఈ రోజుల్లో నీలాంటి కుర్రగాళ్లకు ఎలా టోపీ పెట్టాలో, ఎలాంటి రకం బుట్టలో వేయాలో నాకు తెలియదనుకున్నావా.. అసలే మాయలమరాఠీ గాడిని.. సెల్ఫీల మోజులో పడి పిచ్చి ఫోజులతో ప్రాణాలు తీసుకుంటూ మీపై ఆశలు పెట్టు కున్న తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్న మీలాంటి కుర్రకారు వీక్ పాయింట్తోనే నిన్ను దెబ్బకొట్టాను రా.. మాయల ఫకీరు తో సెల్ఫీ తీయించుకున్నాను అని ప్రపంచ దేశాలలో గొప్ప చెప్పుకోవడం కోసం ఇప్పుడు నాతో సెల్ఫీ మోజులో పడి తండ్రిని కూడా మరిచి పోయిన నువ్వు భవిష్యత్తులో ఈ రాజ్యం ఎలా ఏల గలవు రా డింభక..
ఇప్పుడు నీ వయసు అబ్బాయిలు, అమ్మాయిలు సెల్ఫీ మోజులో పడి.. ఆ పిచ్చి సరదా తో వెనక ఉన్న వాళ్ళందరిని మరిచిపోయి ప్రాణాలు కూడా వదులు కుంటున్నారు.. ఇదొక్కటే కాకుండా మాదకద్రవ్యాల మోజులో పడి కూడా కొట్టుకుపోతున్న, విలువైన ప్రాణాలు తీసుకుంటున్న మీ యువతరాన్ని బోల్తా కొట్టించడం ఎంతసేపురా.
బాలకుడివి కనుక వదిలేస్తాను పరిగెత్తుకొని పారిపో.. లేకుంటే మీ నాన్నను చేసినట్టే నిన్ను కూడా శిలా ప్రతిమను చేసేస్తాను ''
అంటూ అరిచాడు.. అతి భయంకరంగా మాయల ఫకీరు.
బాలవర్ధి రాజు చేసేది లేక.. తల గోక్కుంటూ తింగరి వాడిలా తిక్క చూపులు చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు ఆ గుహలో నుండి.
*****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments