నేనెవరిని?
- Neeraja Prabhala

- Jul 22
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Nenevarini, #నేనెవరిని?

Nenevarini - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 22/07/2025
నేనెవరిని? - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
నేనెవరిని? ఎందుకు జీవించి ఉన్నాను?
నాకెవరున్నారు? ఎవరికోసం ఈ దుర్భల బ్రతుకు?
పక్షికి ఉన్న స్వేచ్ఛ కూడా నాకులేదే?
నాకన్నా చెట్టుక్రింద వాడైనా సుఖంగా ఉన్నాడే!
ఏంచూసుకుని నేను బ్రతకాలి?
మనోనిబ్బరం, ధైర్యం సడలిస్తున్న వేళ,
గాలిలో దీపం పెట్టి ‘దేవుడా! నీవే దిక్కని’ బ్రతుకుతున్నాను.
ఈ ముళ్లదారి బ్రతుకులో
నా ఆశలు అడియాసలేనా?
బ్రతుకే ఎండమావాయే!
నేనొక అనాథని అనుకుంటేనే బాధ, భయం నా వెనువెంటే.
ఒంటరినై ఏటికి ఎదురీది అలసి, సొలసితిని.
అద్దరి కానరాక జీవిత సంద్రంలో మునిగిపోతిని.
ఈ నిర్జీవ బ్రతుకులో ఇంక నాకేమిటి దారి?

-నీరజ హరి ప్రభల




Comments