నేరము - శిక్ష
- Veereswara Rao Moola

- Sep 7
- 3 min read
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #NeramuSiksha, #నేరముశిక్ష, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Neramu Siksha - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 07/09/2025
నేరము శిక్ష - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
స్థలం: వేట పాలెం దగ్గర చిన్న హొటల్., ఆంధ్ర ప్రదేశ్
"ఒరే ఇడ్లీ పట్రా" అని ఆజ్ఞాపించాడు రాబర్ట్.
"అలాగే, తెస్తున్నా" అన్నాడు శ్యాం.
శ్యాం ఇడ్లీ తీసుకు రావడానికి ఆలస్య మయ్యింది. రాబర్ట్ కి కోపం వచ్చింది.
"కుర్ర వెధవా, ఇంత ఆలస్యమా" అని గ్లాసు లోని నీళ్ళు శ్యాం ముఖం మీద కొట్టాడు. ఈ పరిణామానికి శ్యాం నిర్ఘాంత పోయాడు. ఏడుస్తూ కిచెన్ లోకి వెళ్ళాడు.
"కస్టమర్ లు చాలా మంది ఉన్నారు. ఓపిక ఉండద్దా" అని సమాధానపరిచాడు హొటల్ ఓనర్ పరమేశం.
"నువ్వు చెప్పక్కర్లేదు" అని కోపం గా వెళ్ళి పోయాడు రాబర్ట్.
*******
శ్యాం కి చిన్నప్పుడు తల్లి తండ్రులు మరణించారు. మేనమామ కొన్నాళ్ళు పెంచి వదిలేశాడు. ఆ తరువాత హొటల్ లో సర్వర్ గా చేరాడు శ్యాం. కష్టపడే తత్వం, వినయం ఉండడం తో పరమేశం మెచ్చుకుని, ఊరెళ్ళి నప్పుడు క్యాష్ అప్పచెప్పే వాడు.
రాబర్ట్ చెడు సావాసాలతో రౌడి గా తయారయ్యాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ, పట్టుబడి జైలు కి వెళ్ళొచ్చాడు. బుద్ది తెచ్చుకోకుండా మళ్ళీ పాత పద్దతి లోనే ఉన్నాడు.
********
"శ్యాం, మంచి టీ పట్రా" అన్నాడు రాబర్ట్ హుషారు గా స్మార్ట్ ఫోన్ చూస్తూ.
శ్యాం టీ తీసుకు వచ్చి, రాబర్ట్ చేతి లో ఉన్న వస్తువు గురించి అడిగాడు.
"ఇదా, దీన్ని స్మార్ట్ ఫోన్ అంటారు. దీనితో ఫోటోలు తియ్యచ్చు. ఎవరితో నైనా మాట్లాడ వచ్చు. ఫేస్ బుక్ లో లైక్ లు చేసి డబ్బు సంపాదించ వచ్చు. గ్లాసులు కడుక్కునే
నీ ముఖానికి ఏం తెలుస్తుంది లే. ?" అని వెటకారం గా అన్నాడు రాబర్ట్.
శ్యాం చిన్న బుచ్చుకుని వెళ్ళి పోయాడు.
*******
"శ్యాం, నేను పట్టణం వెడుతున్నా. మద్యాహ్నం వచ్చేస్తాను. నువ్వు క్యాష్ దగ్గర కూర్చో. జాగ్రర్త" అన్నాడు పరమేశం.
"త్వరగా వచ్చేయండి. అయ్యగారూ " అన్నాడు శ్యాం.
పరమేశం వెళ్ళిన గంట కి రాబర్ట్ వచ్చాడు. గల్లా పెట్టె దగ్గర శ్యాం ఉండడం చూశాడు. మెదడు లో ఒక ఆలోచన వచ్చింది.
పెసరట్టు తిని, శ్యాం దగ్గరికి వచ్చాడు. శ్యాం డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. వెంటనే రాబర్ట్ చాకు చూపించి డబ్బు ఇచ్చెయ్య మన్నాడు.
"నేను ఇవ్వను" అన్నాడు శ్యాం మూత వేస్తూ.
రాబర్ట్ మెరుపు లా చాకు తో దాడి చేసి, శ్యాం కి గాయం చేసి డబ్బు తో పరారయ్యాడు. సాయంత్రం వచ్చిన పరమేశం, విషయం తెలుసుకుని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.
పోలీసులు రాబర్ట్ ని అరెస్టు చేశారు.
*******
పదేళ్ళ తర్వాత :
వేట పాలెం లో శ్రీ ముఖి హొటల్ వెలిసింది. దానికి యజమాని శ్యాం. పరమేశం చనిపోవడానికి ముందు హొటల్ ని శ్యాం కి ఇచ్చాడు. తన కూతుర్ని శ్రీ ముఖిని ఇచ్చి పెళ్లి చేసాడు.
శ్యాం, భార్య పేరుతో శ్రీ ముఖి హొటల్ ప్రారంభించాడు.
వారం తర్వాత ఒక వ్యక్తి కుంటుకుంటూ వచ్చాడు. ఒక కాలు లేదు. ముఖం నల్లగా ఉంది కమిలిపోయినట్టు. గడ్డం బాగా పెరిగి, మనిషి దుమ్ము పట్టిన దుస్తులతో అసహ్యం గా ఉన్నాడు.
సర్వర్లు అతన్ని బయటికి గెంటివేయబోయారు.
శ్యాం ఆపాడు.
"ఎవరు?"
" నన్ను గుర్తు పట్ట లేదు కదా. రాబర్ట్ ని!"
శ్యాం ఆశ్చర్య పోయాడు.
"జైలు నుండి వచ్చాక పాత పద్దతి లోనే ఉన్నాను. ఒక సారి
పెళ్ళి వారి ఆటో ఎక్కి బంగారం దొంగతనం చేద్దామనుకున్నాను. ఆ ఆటో ను కంటైనర్ గుద్దడం తో నా కాలి కి యాక్సిడెంట్ అయ్యింది. అందుకే కాలు తీసేసారు
డాక్టర్ లు.
ఆ తరువాత చైన్ స్నాచింగ్ చేసి, బండి మీద పోతుంటే లారి గుద్దింది. ఆయిల్ లీక్ ఐయి మంటలు వచ్చి ముఖం కాలిపోయినది. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ పని ఇవ్వరు. నిన్ను క్షమించమని అడిగి, పని కోసంవచ్చాను. " తన కధ చెప్పిన తర్వాత రాబర్ట్ కళ్ళు ల్లోంచి నీళ్లు కారుతున్నాయి.
శ్యాం ఆ కధ విని చలించిపోయాడు.
"సరే మా హొటల్ లో కిచేన్ లో ఉండు"
"నువ్వు దేవుడివి శ్యాం. " అని చేతులు జోడించాడు రాబర్ట్.
"అందరికి ఆయనే దేవుడు. " అన్నాడు శ్యాం కృష్ణుడి ఫోటో
చూపిస్తూ.
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.




Comments