'Nirnayam' - New Telugu Story Written By M. Bhanu
'నిర్ణయం' తెలుగు కథ
రచన: M. భాను
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఎన్నాళ్లని ఒక్కదానివే ఉoటావు అక్కడ?” కోపంగా అడుగుతున్నారు తల్లిని.
సమాధానం చెప్పకుండా తలవంచుకుని కూర్చుంది లక్ష్మమ్మ.
ఆయన పోయి నెలైంది. మాసికం పెట్టడానికి వచ్చారు. పెద్ద కొడుకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చి వచ్చాడు, పెన్షన్ కి అప్లై చేసాడు. పెద్ద కొడుకు దూరంగా ఉంటాడు. చిన్నకొడుకు దూరంగా ఉంటాడు. మూడో కొడుకు, ఇద్దరు కూతుళ్లు దూరంగానే ఉంటారు. ఉన్న ఊర్లో సొంత ఇంట్లో ఉంటున్నారు లక్ష్మమ్మ, మొగుడు రామనాథం.
పoచాయితీ లో గుమాస్తాగా చేసి రిటైరయ్యాడు. హాయిగా కాలం గడిచిపోతోంది అనుకున్నంతలో అనుకోకుండా రామనాథానికి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు.
అప్పటివరకు ఏ పనీ చేతకాని లక్ష్మమ్మకు దిక్కుతోచక అల్లల్లాడిపోతోంది. బ్యాంక్ కి వెళ్లడం తెలియదు, ఏటీఎం తెలియదు, షాపులో సామాన్లు తెచ్చుకోవడం తెలీదు. అన్ని పనులూ రామనాథం ఒక్కడే చేసేవాడు. ఏ పనీ భార్యకు చెప్పేవాడు కాదు. ఇంటిలో వంట చేసుకోవడం.. అంతే.
అలాంటి లక్ష్మమ్మకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళాలని లేదు. ఎవరు ఎలా చూస్తారో తెలుసు. పెద్ద కొడుకు ముందే చెప్పేశాడు ‘నీ ఇష్టం.. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉంటూ నీకెక్కడ స్వేచ్ఛ ఉంటే అక్కడే వుండు. ఒక మనిషిని పెట్టుకొని అన్ని చేయించుకో’ అని.
చిన్న కొడుకులు, కోడళ్లు రాత్రి మాట్లాడుకోవడం తన చెవులను పడింది. ఎలాగూ పెన్షన్ వస్తుంది కాబట్టి తలో రెణ్నెళ్లు అట్టే పెట్టుకుంటే పెన్షన్ కలిసొస్తుందని మాట్లాడుకుంటున్నారు.
‘అదీగాక మనం ఉద్యోగాలకు పోతే ఇంట్లో ఉంటుంది, పిల్లలను చూసుకుంటూ. ఇక్కడ ఒక్కత్తే ఎందుకు’ అని మాట్లాడుకుంటున్నారు.
ఆడపిల్లలు మనసు చంపుకోలేక తల్లిని ఒక్కదాన్నే ఉంచలేక, అన్నయ్యలకు చెప్పలేక కిందామీదా పడుతున్నారు.
ఆ రాత్రి లక్ష్మమ్మ అందరినీ కూర్చోబెట్టి ఇలా చెప్పింది. “మీరందరూ నా గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు. మీ నాన్నగారు లేని లోటు తీరుస్తున్నారు. కానీ నాకు ఇక్కడే ఉండడం ఇష్టం. మీ నాన్నగారి జ్ఞాపకాలతో ఇక్కడే ఉంటాను. మీరే వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి.
నాకు ఇక్కడ వాతావరణం అంతా పాతదే! ఇప్పుడు కొత్త చోటుకి వచ్చి ఇబ్బంది పడలేను. ఎప్పుడూ వచ్చిన దాన్ని కాదు, కొన్నాళ్లు ఇలాగే ఉండనివ్వండి, కాలుచెయ్యి ఆడినంత వరకు. అంతగా లేవలేకపోతే చేసుకోలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా నాన్నగారు పోయి నెల మాత్రమే అయ్యింది. సంవత్సరం వరకు మీరు నెలనెలా వస్తూనే ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఇబ్బంది లేదు. తర్వాత నెమ్మదిగా ఆలోచిద్దాము.
అందులోనూ నాకు డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. మళ్లీ కొత్త డాక్టర్లు, కొత్తగా చెకప్పులు అంటే భరించలేను. అలవాటై పోయింది. చుట్టుపక్కలవాళ్ళు కూడా వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి అవసరమైతే రాగలరు.
షావుకారు మాధవయ్య, కొడుకు చూస్తూనే ఉంటారు. ఏమీ ఫర్వాలేదు, మన పక్కనే ఉంటారు కదా!?”
కూతుళ్లతో ఇలా చెప్పింది “అమ్మాయిలు! నా గురించి అనవసరంగా బెంగపడి అత్తగారింట్లో లేనిపోని గొడవలు తెచ్చుకోకండి. ఎవరి సంసారం వాళ్లదే. ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి అందరూ.
ముందు ముందు వచ్చే పరిస్థితులన్నింటినీ అలవాటు చేసుకోవాలి కదా నేను కూడా! ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరందరూ అనవసరంగా ఆలోచించి మనసులు పాడుచేసుకోకండి” అని చెప్పింది.
ఆ మాటలకి ఎవ్వరూ మాట్లాడకుండా పడుకోవడానికి వెళ్లిపోయారు.
***
M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.
ధన్యవాదములు 🙏
Comments