top of page
Original.png

న్యాయ దేవత కన్నీళ్లు పెట్టింది

Updated: Feb 4

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #న్యాయదేవతకన్నీళ్లుపెట్టింది, #NyayaDevathaKanneelluPettindi, #TeluguSpecialArticle, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు

ree

Nyaya Devatha Kanneellu Pettindi - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 27/01/2025 

న్యాయ దేవత కన్నీళ్లు పెట్టిందితెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


న్యాయ స్థానంలో బ్రిటిష్ కాలంనాటి న్యాయదేవత శిల్పానికి కళ్ళకు గంతలు, ఒకచేతిలో త్రాసు, మరొక చేతిలో ఖడ్గం ఉండేది. ఇప్పుడు కొత్తగా ఆ విగ్రహానికి కళ్ళ గంతలు తొలగించి చేతిలో త్రాసును అలాగే ఉంచి, మరొక చేతిలో ఖడ్గం బదులు రాజ్యాంగ గ్రంధాన్ని ఉంచారు.. .. . అనే వార్త నేను ఆలస్యంగా చూసాను. 


బాగానేవుంది. విగ్రహానికి ఎన్ని నగిషీలు ఐనా చెక్కవచ్చు. వులకదు. పలకదు. కానీ ఆ దేవత కన్నీళ్లు పెట్టిన దారుణం జరిగింది. మరో పక్కనే జస్టిస్ అనేది జరగడంలో ఎన్ని కోర్టులు వున్నాయో అన్ని భవనాల మెట్లు ఎక్కలేక పిటీషన్ వేసేవారు అలసిపోతున్నారు. 


లేదా కొన్నిసార్లు వారే పోతే, వారసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఐతే న్యాయమైన తీర్పు వస్తుందనే

ఆశ లేదు. గతకాలం కంటే ఇప్పుడు త్వరగా తీర్పు ఇవ్వడం ఊరట కలుగుతోందని అంటున్నారు. కొంత నయం. ఈలోగా ధైర్యం, పట్టుదల, సహనం ఆరోగ్యం ఉండాలి.. . ఎదురు చూసే వారికి. 


అదొక్కటే కాదు. తీర్పులో న్యాయం జరుగుతుందా.. . అసలు నేరస్తులకు శిక్ష పడుతోందా.. ? అంటే కొన్ని కేసుల్లో రాజకీయం చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిందితులను కాపాడుతున్నది. 

ఈ ఆక్రోశం ఎందుకంటే పశ్చమబెంగాల్ నగరం కోల్కతాలోని ఆర్ జీ కర్ హాస్పిటల్ -మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యా కేసును నీరుగార్చేరు. నేరస్తులని అనుమానించే మరి కొంతమంది ( నలుగురా- ఆరుగురా?) గురించిన ప్రస్తావనే లేదు. (కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, డా. ఆసిష్కుమార్ పాండే బిపీలాపిసింగ్ సుమన్ హజారే అస్ఫర్ అలీ ఖాన్. ).


వాళ్ళు సి ఎం బంధు మిత్రులు కనుక వారిమీద ఎలాంటి చర్యలు లేవని అభియోగం. దేశమంతా విద్యార్థులు నిరసన తెలిపారు.. ఆడపిల్లల తల్లి తండ్రులు తల్లడిల్లిపోయారు. మహిళా - ప్రజా సంఘాలు ధర్నాలు చేశారు. గొంతెత్తి నిలదీశారు. నిజం తెలియాలి.. నేరస్తులకు ఉరిశిక్ష వేయాలి.. అంటూ పోరాటం చేశారు. 


రెండునెలల తర్వాత తీర్పు చెబుతూ అసలైన దోషులను తప్పించి చిల్లరనేరాలు చేసే సంజయ్రాయి అనే వ్యక్తికి జీవిత కారాగార శిక్ష విధించి చేతులు దులిపేసుకున్నారని నిరసనలు వెల్లువెత్తాయి. 


దోషులు సంఘటన జరిగిన ఆనవాళ్లు నాశనం చేశారు. ఇష్టా రాజ్యంగా కోర్టు అధికారాలను ధిక్కరించారు. చట్టాన్ని అధిగమించారు. అయినా వీరిమీద చర్యలు ఏవి? అసలు ఈ వార్తా చదివిన ప్రతి ఒక్క మహిళా వేదనతో అలమటించిపోయారు. హృదయం ద్రవించి రోదించని వారు ఉన్నారా/ అమ్మాయిల తల్లితండ్రులు కాలేజీలకు పిల్లలను పంపడం ఎలా ?వాళ్ళను ఇంటిలోనే కూర్చోబెట్టుకోవాలా.. . అని భయంతో రోజులు గడుపుతున్నారు. 


చిన్నపిల్లలు యువత మహిళలు వృద్ధులు ఇలా ఎందరో దారుణాలకు బలి అవుతున్నారు. కారణాలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్న మత్తుమందుగా చెబుతున్నప్పటికీ వాటి నియంత్రణ లేని అమ్మకాలు జరుగుతూనేవున్నాయి. 

 బెంగాల్ ఉదంతం మాత్రం రాజకీయం అని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఈ దుర్మార్గులకు శిక్ష పడాలి. న్యాయ మూర్తులు చిత్తశుద్ధితో దోషులు ఎవరో నిరూపించాలి. 


ఎంతోకాలంగా దేశంలో ఎక్కడో అక్కడ మహిళలు భర్త -తండ్రి- లేదా స్నేహితుల చేతిలో చనిపోతున్నారు. అందులో ఇద్దరు తప్పు ఉండవచ్చు. అటువంటప్పుడు సామరస్యంగా విడిపోతే మేలు. ప్రాణాలు తీయడం

వలన ఇద్దరూ నష్టపోతారు. పిల్లలు ఆనాధలు అవుతారు. చెడు ఆలోచన మనిషిని మృగంగా మారుస్తుంది. 


కుటుంబ సభ్యులు కనిపెట్టి చూసుకోవాలి. అది భార్యా భర్తల మధ్య గొడవలు అనివదిలేయవద్దు. కొన్నిసార్లు పెద్దలు కలగచేసుకుని వారికి ప్రమాదం జరగకుండా చూడాలి. వారిమధ్య సఖ్యతలేదని తేలికగకనిపెట్టవచ్చు. 

దారుణాలు జరిగేక ఏమి చేయలేరు. 


 ప్రతి ఇంట్లో మహిళలు వుంటారు. వారిని వేరేవారు అవమానిస్తే మీకు కోపం వస్తుంది. అలాగే మీరుకూడా ఇతర మహిళ పట్ల గౌరవం చూపండి. వారికి సమస్య వస్తే తోడుగా వుండండి. 


నాకు ఏ అంశం తీసుకున్నా ఆ డాక్టర్ (కోల్కతా) గుర్తుకువస్తు.. కళ్ళు చెమరుస్తాయి. 


ఆర్ జీ కర్ హాస్పిటల్ దారుణాలు కొందరు వ్యక్తులతో పంచుకున్నా ఆమెను ఎవరూ కాపాడుకోలేని

దుస్థితి ఎందుకు వచ్చింది అని బాధ కలుగుతుంది. 

ఇక్కడ మీడియా అతి ఉత్సాహం కూడా చిరాకు కలిగించింది. వీటివలన బాధితులు క్రుంగి పోతున్నారు. 

దీనివలన ఉపయోగం లేదు. కోర్టు వీటిని పరిగణలోకి తీసుకుంటే మీడియా ఉపకారం చేసింది అనుకోవచ్చు. 


కానీ మీడియా మిత్రులు అలంటి హెల్ప్ చేయకపోగా డాక్టర్ తల్లితండ్రులకు వేదన కలిగిస్తున్నారు. దయచేసి మరీ లోతుగా విశ్లేషించి బట్టబయలు చేయకండి. ఇదే నా తల్లికో చెల్లికో భార్యకో జరిగితే ఎంత బాధ.. . అని ఆలోచించుకోండి. అడ్డమైన చెత్త వీడియోలు పెట్టి బాధితులను అవమానించకండి. !


ఈ కేసులో మళ్ళీ కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది. ఆ తీర్పులు వచ్చేవరకూ బాధితులకు అందరమూ అండగా ఉందాము. వారి గౌరవాన్ని కాపాడుదాము. అదే ఆమెకు నివాళి. తప్పు చేస్తే శిక్ష తప్పదు! అని నేరగాళ్లకు భయం ఉండాలి. అప్పుడే న్యాయ దేవత కీ గౌరవం దక్కుతుంది.

కోర్టులో న్యాయం గెలవడం తథ్యం 

 ***

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)

ree




 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page