top of page
Original_edited.jpg

ఓ జానకి…! నేనొస్తున్నా!

#AlluSairam, #అల్లుసాయిరాం, #Srirama, #జానకి, #తెలుగుకవిత, #TeluguPoem

ree

O Janaki Nenosthunna - New Telugu Poem Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 19/09/2025

ఓ జానకి…! నేనొస్తున్నా! - తెలుగు కవిత

రచన: అల్లు సాయిరాం


ఓ జానకి…! నేనొస్తున్నా!

ఓ జానకి…! నీ రాముడి హృదయ విరహ తాపాన్ని విను!

నువ్వు వేసే ఒక్కో అడుగు

నీ తల్లి భూమాత ఒక్కో ముద్దులా స్వీకరిస్తుండడంతో 

నీ అడుగుల సవ్వడి వినసొంపైన సంగీతాన్ని

వింటూ యి ప్రకృతి పునీతమైంది! 


నీ రాకతో బిడ్డలకై తపనపడుతున్న

జనకమహారాజు అంతరంగంలో వేదనంతా మటుమాయమైపోయి

మిథిలా నగరమే నీ అడుగులతో పరవశించిపోయింది!


స్వయంవరం తర్వాత నా భార్యగా పక్కన నడుస్తుంటే

నీ అడుగుల సందడికి అయోధ్య వీధుల్లో 

దివ్యపరిమళం విరాజిల్లి పులకించిపోయింది!


అరణ్యవాసానికి రావద్దని నేనెంత చెప్పినా వినక

నా తోడుగా వచ్చిన నీకు అరణ్యవాసంలో

గడిచిన పదమూడేళ్లలో ఎన్నో ముల్లులు గుచ్చుకుంటుంటే 

అరణ్యమే వుసురుమంటూ ప్రాధేయపడింది!


ఇప్పుడు నాతో ఒకమాటైనా చెప్పకుండా 

నీ మృదు మధురమైన అడుగుల సవ్వడితో

లంకని పావనం చెయ్యడానికి వెళ్ళావా!

నీ జ్ఞాపకాలతో నా హృదయం పరితపిస్తోంది!

నువ్వు లేని ప్రతి క్షణం విరహాగ్ని మంటలతో నన్ను తినేస్తోంది!


మళ్లీ నా అడుగుల పక్కన నీ అడుగులు పడేటంతవరకు 

నాకు ప్రశాంతత లేదు జానకి! 

నీకోసం కాదు, నాకోసం నీ దగ్గరికి నేనొస్తున్నా!!


***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


 


 



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page