మిష్టర్ ఉద్యోగి
- Sairam Allu

- Sep 9
- 2 min read
#AlluSairam, #అల్లుసాయిరాం, #MisterUdyogi, #మిష్టర్ #ఉద్యోగి, #తెలుగుకవిత, #TeluguPoem

Mister Udyogi - New Telugu Poem Written By Allu Sairam
Published In manatelugukathalu.com On 09/09/2025
మిష్టర్ ఉద్యోగి - తెలుగు కవిత
రచన: అల్లు సాయిరాం
ఉద్యోగం.. ఉద్యోగం.. అసలు ఏముంది యీ ఉద్యోగంలో!
రోజువారీ కూలీ కాకుండా నెలసరి మొత్తం కూలీ
జీతంగా ఒకసారి అందుతుంది!
మనిషికి కాకుండా డబ్బుకి విలువనిచ్చే సమాజంలో
ఉద్యోగస్తులనే గౌరవం లభిస్తుంది!
అవసరమైనప్పుడు బ్యాంకుల్లో లోన్ రూపంలో అప్పు దొరుకుతుంది!
అస్తుపాస్తులతో సంబంధం లేకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది!
వీటి కోసమే, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తేనే,
మనిషికి విలువ ఉంటుందని సమాజం ఎంతలా నూరిపోస్తుందో!
ఏ ఉద్యోగం లేకపోతే ఎంత చులకనగా చూస్తుందో!!
అ ఆ లు నేర్చుకోకముందు నుంచే,
డాక్టరా ఇంజీనీరా అని ఉద్యోగాల
గురించి మొదలయ్యే చర్చలు !
మాతృభాషకి, విద్య నేర్చుకునే భాషకి
అభిప్రాయబేధాలు వల్ల చదువెక్కకపోయినా
మంచి ర్యాంకులు సాధించాలని ఒత్తిడులు!
పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదివినవారు కుడా
చిన్న ఉద్యోగాలకి పోటీలు పడుతున్న
దయనీయమైన పరిస్థితులు!
డబ్బులు పోసి కొనుక్కున్న చదువులకి
సంబంధం లేకుండా చేస్తున్న ఉద్యోగాలు!
తీరా ఉద్యోగస్తుడి కుటుంబం అని ముద్ర పడ్డాక
అమలు కాని ప్రభుత్వ పథకాలు!
ముగ్గుపిండి నుంచి గోధుమ పిండి వరకు
తడిసిమోపెడయ్యే యింటి ఖర్చులు!
చాలిచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకుంటూ రావడానికి
నెల ఎంత తొందరగా గడుస్తుందా అని పడిగాపులు!
పాపం పెరుగుతున్నట్లు పెరిగిపోతున్న నెలసరి ఈఎంఐలు!
అధిక భత్యాల కోసం ఆశపడి
పనిచేయడంతో నిద్ర లేని రాత్రులు!
సమయపాలన లేని డ్యూటీలతో
వేళాపాళా లేని తిళ్ళు!
వయసు పెరుగుతున్న కొద్దీ
సహకరించని ఆరోగ్యాలు!
ఎసి గదుల్లో కూర్చుని కూలీ బతుకులపై
చేసే అధికారుల పెత్తనాలు!
నలుగురు కలిసి న్యాయం అడుగుదామనుకుంటే
ఐక్యత నిలబడుతుందో లేదో అని అనుమానాలు!
ఒంటరిగా నిలదీస్తే, దొరికిపోతామోనని
తలవంచుకున్న చేతకాని మౌనాలు!
ఉన్న సమస్యలు చాలవన్నట్టు
కులాలని, మతాలని, బయట ఒత్తిడులు!
కలలో తప్ప నిజజీవితంలో తీరడానికి
అవకాశం లేని చిరకాల కోరికలు!
ఇస్త్రీ దుస్తులపై సెంట్లు రాసుకోవడం వల్ల
బయటికి రాని చెమట వాసనలు!
మనసుకి ప్రశాంతతను యిస్తేనే
ఉద్యోగం అనేది ఉత్తమ యోగం,
లేకపోతే అది ఉత్తుత్తి యోగమే!!!
***
అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం
హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన
ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.
ఐదు బహుమతులు గెలుచుకున్నాను.




Comments