పక్షి పలికిన సత్యాలు
- Gadwala Somanna
- Dec 21, 2024
- 1 min read
Updated: Jan 1
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #పక్షిపలికినసత్యాలు, #PakshiPalikinaSathyalu

Pakshi Palikina Sathyalu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 21/12/2024
పక్షి పలికిన సత్యాలు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
రెక్కలు చాపితేనే
పక్కి ఎగురుగల్గుతుంది
మొక్కలు నాటితేనే
చక్కదనము వస్తుంది
పువ్వులు వికసిస్తేనే
తావులు వెదజల్లుతాయి
దివ్వెలు వెలిగితేనే
వెలుగులు విరజిమ్ముతాయి
మహిళలను గౌరవిస్తే
మహిని వర్థిల్లుతుంది
పెద్దల మాట వింటే
వృద్ధి బాగా జరుగుతుంది
తరువులను పెంచితేనే
మనిషి మనుగడ ఉంటుంది
గురువులను కొలుస్తేనే
ఆశీర్వదము దక్కుతుంది
కష్టపడి పనిచేస్తే
సుఖం విలువ తెలుస్తుంది
ఇష్టపడి చదివితే
విజ్ఞానం లభిస్తుంది
సైనికులు ఉంటేనే
దేశం బాగుంటుంది
వారసులు ఉంటేనే
వంశం నిలబడుతుంది
అన్నదాతలుంటేనే
అన్నం మనకు పుడుతుంది
కన్నవారు ఉంటేనే
ప్రేమపూవు పూస్తుంది
పల్లెలు ఉంటేనే
పచ్చదనం ఉంటుంది
పిల్లలతో సదనమే
కళకళ లాడుతుంది
-గద్వాల సోమన్న
Comentarios