top of page

పంచభూతాత్ముడు శ్రీమన్నారాయణుడు


'Panchabhuthatmudu Srimannarayanudu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 28/10/2023

'పంచభూతాత్ముడు శ్రీమన్నారాయణుడు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


పంచ భూతములను పంచుకొని

బ్రతుకు లీడ్చు ప్రజల్లార

మరువకండి హరినామం

మరి కొలువరండి శ్రీహరి పాదం


కాలమందె దేవుడు కలిసి ఉన్నాడు

నేలమీద జీవులకై నిలిచి ఊన్నాడు

నీవెంట నీడలా నీ కంటిపాపలా

నిలిచి ఉన్నాడు


అంబరాన సూర్యుడై

నేలపైన అంబువై

ప్రాణమిచ్చు గాలియై

ప్రజ్వరిల్లు తేజమై నిలువ నీకు స్థానమై

పంచ భూతాలను నీ పంచ జేర్చినాడు


ప్రపంచాన బ్రతుక నీకు

పట్టు నిచ్చినాడు

తల్లి పాల లోనె నీకు

తగిన పళ్ళ ధాతువై శ్రీవల్లినాథుడు

ఆరోగ్య సిరులనిచ్చినాడు

పసిపాపగ నీవుండగ పరమాత్ముడె

నీ యందు పరివేష్టితు డయ్యాడు


ఈడు మీద పడగానే నీతో

ఆడుకొన జూస్తాడు

అడుగడుగున ఆపదలకు అతడె కారణం

అవి నివారించు శక్తి యుక్తి

రక్తి దాయకం

కష్టపడే అలవాటును

కలిగించునదతడే

కష్టానికి ఫలితాన్ని

కడకు నిచ్చున దతడే


శిక్షకుడు రక్షకుడు

శ్రీమన్నారాయణుడే

పక్షపాత మెంత లేని

పరమాత్ముడ తడే

పంచ భూతాలను పంచుకొని

బ్రతుకు నీడ్చు ప్రజల్లారా

మరువకండి శ్రీ హరినామం

మరి కొలువరండి శ్రీ హరిపాదం.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


22 views0 comments
bottom of page