పతాక సందేశం
- Gadwala Somanna
- Nov 27, 2024
- 1 min read
Updated: Dec 6, 2024
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్నపతాకసందేశం, #PathakaSandesam

Pathaka Sandesam - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 27/11/2024
పతాక సందేశం - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
ఎదుటివారి తప్పులు
ఎప్పుడు వెదకరాదు
పనికిరాని గొప్పలు
ప్రతిచోట చెప్పరాదు
కుటుంబాన కలతలు
సృష్టించకూడదు
ఇతరులపై నిందలు
వట్టిగా వేయరాదు
సున్నితమైన మనసులు
ఎన్నడు విరచరాదు
పచ్చని కాపురాలు
కలనైన కూల్చరాదు
గొప్పవారు పెద్దలు
హేళన చేయరాదు
కన్నవారు పూజ్యులు
కట్టబెట్ట కూడదు
-గద్వాల సోమన్న
Comments