top of page
Original.png

పావురాయి పాఠాలు

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #IlaUndam, #పావురాయిపాఠాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 150

Pavurayi Patalu - Somanna Gari Kavithalu Part 150 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/12/2025

పావురాయి పాఠాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 150 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పావురాయి పాఠాలు

--------------------------------------

మూర్ఖుడైన ప్రతివాడు

కలహాలే సృష్టించును

సంస్కారం లేనివాడు

అవమానాలే పొందును


నియమాలే లేనినాడు

విచ్చలవిడితనం వచ్చును

అంతటా అరాచకము

చీకటిలా వ్యాపించును


ఉండాలోయ్! నిబంధనలు

పద్దతిగా ఉండేందుకు

బోధించాలోయ్ సూక్తులు

నేర్పించాలోయ్! నీతులు


నైతిక విలువలు లేక

మానవత్వం శూన్యము

దానవత్వం తోడై

నాట్యమాడు దౌర్జన్యము









మనోభీష్టం

------------------------

తొక్కబడిన చోటే

నిలదొక్కుకోవాలి

గొప్ప పనులతో పేరు

నిలబెట్టు కోవాలి


విత్తులా మొలవాలి

గిత్తలా సాగాలి

అన్న వారి ఎదుటే

మిన్నగా బ్రతకాలి


నిరాశ చెందరాదు

నిట్టూర్పు విడవరాదు

పిరికివాడి మాదిరి

వెనుకడుగు వేయరాదు


ఉదయించే రవిలా

నిగ్గుదీల్చు కవిలా

ఉండాలోయ్!తప్పక

గెలవాలని కోరిక











పెద్దల హితవు

----------------------------------------

కావు కావు శాశ్వతము

బ్రతుకులో వైఫల్యాలు

అనైక్యతకు రహదారులు

వద్దు వద్దు వైషమ్యాలు


ముద్దు ముద్దు బంధాలు

చేయరాదు పలు ముక్కలు

విలువైనవి కుటుంబాలు

రేపరాదు విష జ్వాలలు


శ్రేష్టమైనవి స్నేహాలు

పోగొట్టుకోరాదోయ్!

సున్నితమే హృదయాలు

కాకూడదు గాయాలు


గొప్పవి మనోభావాలు

దెబ్బతీయకూడదోయ్

పూలలాంటి జీవితాలు

నలిపివేయ కూడదోయ్!











ఉంటే-లేకుంటే

-----------------------------------------

సంకల్పం బలం ఉంటే

ఎదుగుదలను ఆపలేరు

బేలతననే ఉంటే

గొప్ప పనులు చేయలేరు


అల్పబుద్ధులే ఉంటే

పరుల హితం కోరలేరు

సోమరితనమే ఉంటే

జీవితాన ఎదగలేరు


క్షమాగుణం లేకుంటే

శత్రుత్వం మానలేరు

లక్ష్యమే లేదంటే

ఏదీ సాధించలేరు


పవిత్రత లేకుంటే

దైవాన్ని గాంచలేరు

సుగుణాలే లేకుంటే

గౌరవమే పొందలేరు










వాస్తవాల వెలుగులు

-------------------------------------------

ఓటమి ద్వారాయేగా

గెలుపు విలువ తెలిసేది

కష్టాల ఫలితంగా

సుఖమంటే రుచించేది


కొన్నిసార్లు అపజయాలు

విజయానికి సోపానాలు

నేర్పును జీవిత పాఠాలు

చక్కపరచును జీవితాలు


దీపం ఉండగానే

చక్కదిద్దుకోవాలి

ప్రాణం ఉండగానే

మంచి పనులు చేయాలి


ఊపిరి ఆగిపోతే

ఏది కూడా చేయలేము

క్షమాగుణం లేకపోతే

ఎవ్వరిని ప్రేమించలేము

గద్వాల సోమన్న







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page