top of page
Original.png

పెద్దయ్య ప్రబోధ గీతి

Nov 30, 2024
1 min read

Updated: Dec 6, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PeddaiahPrabodhaGeethi, #పెద్దయ్యప్రబోధగీతి


Peddaiah Prabodha Geethi - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 30/11/2024

పెద్దయ్య ప్రబోధ గీతి - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


గుండెల్లో కుంపట్లు

పగ ప్రతీకారాలు

తెచ్చిపెట్టు ఇక్కట్లు

వదిలిపెడితే మేలులు


కత్తుల్లాంటి మాటలు

గాయపరచును మనసులు

చెడగొట్టును! బంధాలు

దెబ్బతినును స్నేహాలు


మదిని రాగద్వేషాలు

బుసలుగొట్టు సర్పాలు

మానుకుంటే క్షేమము

లేదంటే ప్రమాదము


పెద్దలతో తమాషాలు

కాదు కాదు గౌరవము

జీవితాన వేషాలు

చేయవద్దు మోసాలు



-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page