కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Prasava Vedana' New Telugu Story
Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
గోవర్ధనగిరి అనే ఒక చిన్న గ్రామం వుంది. ఆ గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతు కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంటిలో తాతయ్య, నాన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పిన్నమ్మ, మామ్మయ, అత్తమ్మ, కొడుకు, కోడలు, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, అక్క గారు ఇలా అన్ని బంధాలు, భాందవ్యాలు, అనుబంధాలు, ఆత్మీయతలు కలిసి జీవిస్తున్న కుటుంబం అది. మమతానురాగాలతో నిత్యం సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో కళకళ లాడుతూ జీవితాన్ని కొనసాగించారు ఆ కుటుంబ సభ్యులు.
మాధవయ్య కొడుకు కృష్ణయ్యకు, కూతురు శాంతమ్మకు మరియు ఇంటిలో వుండే అందరికీ పెళ్లి వయస్సు రాగానే వారు పెళ్లిళ్లు చేశారు. తరువాత మాధవయ్య కాలగమనంలో కలిసిపోయారు. కొంత కాలానికి ఆ కుటుంబంలో మనస్పర్థలు మొదలయ్యాయి. అందువలన బంధాలు, బాంధవ్యాలు మరుగున పడి పోయాయి. కాలానుసారంగా ఉమ్మడి కుటుంబాలు కాస్తా విచ్చిన్నం అయ్యాయి. తరువాత చిన్న కుటుంబాలుగా ఏర్పడ్డాయి.
కృష్ణయ్యకు ఇద్దరు కొడుకులూ ఒక కూతురు జన్మించారు. కృష్ణయ్య పెద్ద కొడుకును 10వ తరగతి వరకు చదివించి బడి మానిపించాడు. తరువాత పెద్ద కొడుకుకు వ్యవసాయం నేర్పించి అందులోనే వుండే విధంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాడు. కూతురును కూడా 10వ తరగతి వరకు చదివించి బడి మానిపించాడు. తరువాత కొన్నాళ్లకు కూతురుకి మంచి పెళ్లి సంబంధం చూసి, కట్నకానుకలు ఇచ్చి, వ్యాపారం చేసే ఒక అబ్బాయికి కృష్ణయ్య తన కూతురిని ఇచ్చి వివాహం చేశాడు.
సంవత్సర కాలంలో కూతురు ఒక ఆడ పిల్లకి జన్మనిచ్చింది. తరువాత పెద్ద కొడుకుకు వివాహం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఒక సాంప్రదాయమైన కుటుంబం నుండి ఒక అమ్మాయిని వెతికి, వివాహం చేయించాడు. సంవత్సర కాలంలో ఒక కొడుకు కు జన్మనిచ్చింది కృష్ణయ్య కోడలు. తరువాత సంవత్సరంలో కూతురు మగ బిడ్డకు, కోడలు ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. వారికి ఇరువురికీ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించారు.
ప్రస్తుతానికైతే పెద్ద కొడుకు, మరియు కూతురు.. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇంక మూడవ కొడుకు పేరు శివ. ఈ చిన్న కొడుకు బాగా చదువు కున్నాడు. చూడడానికి సినిమాలో నటించే హీరో వలే అందంగా ఉంటాడు. ఇతడు 10వ తరగతి తరువాత పై చదువులు చదివేందుకు పట్నం వెళ్లవలసి వచ్చింది. పట్నం వెళ్లిన మొదట్లో కొంత ఇబ్బంది పడినా తరువాత పట్నం జీవితానికి అలవాటు పడ్డాడు.
ఆ తరువాత కొన్ని రోజులకి శాంతమ్మ కూతురిని కూడా అదే కళాశాలలో చేరిపించారు. శాంతమ్మ తనకు స్వయానా మేనత్త కావడంతో ఆమె కూతురిని ప్రేమించడం మొదలు పెట్టాడు శివ. శాంతమ్మ కూతురు అయిన కల్యాణి, తన బావ అయిన శివను కొన్ని రోజులు తిరస్కరించినా తరువాత శివ ప్రేమను కల్యాణి అంగీకరించింది.
కొంత కాలానికి శివ యొక్క డిగ్రీ చదువు పూర్తి అయ్యింది. చదువు పూర్తి అయిన తర్వాత శివ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. కొన్ని నెలలు ఉద్యోగం చేశాక పెళ్లి చేసుకోవడానికి తన మేనత్త కూతురు అయిన కల్యాణిని అడగమని తన తండ్రి గారికి చెప్పాడు. అపుడు తన మేనత్త ఒప్పుకుంది గాని తన మేన మామ ఒప్పుకోలేదు. ఎందుకంటే తన కూతురిని తన సొంత చెల్లెలు కొడుకుకు ఇచ్చి వివాహం చేయాలి అని అతడు నిర్ణయం తీసుకున్నాడు.
అపుడు శివ తన తండ్రి గారితో “నాన్నా! మనం కల్యాణి ని ఇంటికి తీసుకు వద్దాము. మనకు అత్తమ్మ, కల్యాణి కూడా సపోర్టుగా ఉన్నారు కదా! ఏమీ కాదు” అని చెప్పాడు.
అపుడు కృష్ణయ్య “ఒద్దు శివా! అలా చేయడం తప్పు” అని చెప్పాడు.
“ఏం తప్పు నాన్నా? మన కల్యాణికి ఇష్టం లేకుండా తీసుకురాముగా” అని అన్నాడు.
అపుడు కృష్ణయ్య “అలా చేయడం చాలా తప్పురా, ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మాయిని 9 నెలలు మోసి, కనీ, 20 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పెంచిన తరువాత మనం తీసుకుని రావటం చాలా తప్పురా. ఎందుకంటే ప్రసవించే సమయంలో ఆ అమ్మాయిని కనటానికి ఆ తల్లి ఎంత నరక యాతన అనుభవించి వుంటుందో వూహించుకో.
ఇంక ఆ అమ్మాయిని పెంచటానికి వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు పడారో అనే విషయం గురించి ఆలోచించు ఒక సారి. అంత వరకు ఎందుకు.. మీరు పుట్టక ముందు నుంచి మీ అమ్మ, నేను ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలియదురా. పిల్లలు పుట్టాలి అని గుళ్ళు, గోపురాలు.. ఇల్లా చాలా చోట్లకు తిరిగాము. ఎన్ని నోములు వ్రతాలు చేశామో మాకు మాత్రమే తెలుసు. ఇంకా మీరు కడుపులో పిండంగా వున్నపుడు మీ అమ్మకు బాధ చాలా వుంటుంది రా. అలాగే మీ అమ్మ ప్రసవ వేదన గురించి తలుచుకుంటే కన్నీరు ఆగవురా.
ఎందుకంటే మీ అమ్మ గర్భం దాల్చిన రోజు నుంచి తిండి సరిగా తినకుండా, తినడానికి బుద్ధి పుట్టక, తిన్న తిండి వాంతుల రూపంలో బయటకు వస్తుంటే, కేవలం మంచినీటితో జీవితాన్ని కొనసాగించింది రా మీ అమ్మ. అయినా కూడా తను, నన్ను, మన ఇంటిని అందంగా చూసుకోవాలని అహర్నిశలు శ్రమించేదిరా.
తొమ్మిదో నెల దాకా ప్రతి రోజూ పనులు చేస్తూ చాలా నొప్పులను ఓర్చుకుని తొమ్మిదో నెలలో నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, వెన్నులో కూడా నొప్పులు పుడితే నా పిల్లల కోసం కదా అని ఆనందంగా భరించిందిరా మీ అమ్మ. రోజు రోజుకూ పెరిగి పోతున నొప్పులతో నరకయాతన అనుభవించింది రా మీ అమ్మ.
ఆ నొప్పులు గురించి చెప్పాలి అంటే కత్తులతో కోసినట్లు, భాకులతో పొడిచినట్లు వుంటుంది అని చెప్పేది రా. ప్రసవించే సమయంలో నరకం కంటే ఎక్కువగా నొప్పులు పుడితే, ఆ నొప్పుల గురించి ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతూ, బాధను భరిస్తూ తను పునర్జన్మ పోసుకుని మీకు జన్మను ఇచ్చింది రా. ప్రసవించిన తరువాత బక్కచిక్కి నీరసించి పోయిందిరా మీ అమ్మ.
ఇదంతా ఒక ఎత్తు అయితే మిమ్మలను కన్న తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి, మీకు అందించి, ఎదగడానికి కృషిచేసిందిరా మీ అమ్మ. తరువాత మీకు పూల కంచె వలే, పశువులకు కాపలా దారునిలాగా, కంటికి రెప్పలాగా, చేనుకు కంచె వలే కాపు కాసి కాపాడిందిరా. మీరు పెరిగి పెద్దగా అవుతుంటే ఆ రోజుల్లో మిమ్మల్ని పెంచేందుకు మేము ఎంత కష్టపడమో, ఎని రోజులు పస్తులున్నామో మీకు తెలియదురా. ఇంత కష్టపడి మిమల్ని పెంచి పోషిస్తే, మీరు మాత్రం ప్రేమ పేరుతో మాకు దూరం అవుతారు, లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులకు దూరం అవుతారు.
మీరు దూరం వెళ్లినా మీకు దగ్గరగా మేము వస్తే చేత కాక వచ్చారు అని అంటారు. ఒకవేళ అందరూ కలిసి ఉన్నారు కదా అని అన్నింటిని ఓర్చుకుని వుందాము అని అనుకుంటే, ప్రైవసీ పేరుతో మరియు ఇబ్బందులు వున్నాయి అని వృధ్రాశ్రమంలో దూరంగా పెడుతున్నారు. లేక పోతే చంపి వేస్తున్నారు.
ఇది అసలు మన సంస్కృతి కాదు, ఎవరైనా పాటిస్తున్నారా అంటే అసలు పాటించే భారతీయ సాంప్రదాయం కాదు. భారతీయ సంస్కృతి అంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ. ముఖంగా చెప్పాలంటే స్త్రీల పట్ల గౌరవ అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు, బహు భాషా పాండిత్యం, భిన్నత్వంలో ఏకత్వం, సర్వ మతాలు, అనేక కులాలు, పలు రకాల తెగలు, వెనుకబడిన జాతులు అన్నీ కూడా భారత దేశం యెక్క ఔన్నత్యాని తెలియజేస్తాయి. ఇంకా చెప్పాలి అంటే పెద్దల పట్ల గౌరవం. కాబట్టి నా మాట విని కొంచం ఓపిక పట్టు” అని చెప్పాడు.
అపుడు “సరే నాన్నా” అని చెప్పి, “మరి మామ్మయ్యని పెళ్లికి ఎలా ఒప్పిస్తారు? అని అడిగాడు శివ.
అపుడు కృష్ణయ్య “నేను కొంతమంది పెద్ద మనుషులను నాతో తీసుకెళ్ళి మాట్లాడి మెప్పిస్తాను” అని చెప్పాడు. చెప్పిన విధంగానే ఒక మంచి రోజున, మంచి ముహూర్తంలో పెద్ద మనుషులతో ఇంటికి వెళ్ళాడు.
శాంతమ్మను, ఆమె భర్తను కలిసి వారితో “మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి” అని చెప్పాడు.
“ఒప్పుకోక పోతే..?” అని శాంతమ్మ భర్త కోపంగా అన్నాడు.
అపుడు పెద్ద మనుషులు “మీ అమ్మాయిని తీసుకొని వాళ్ళు వెళ్లిపోతే మీ పరువు పోతుంది. ఎందుకంటే మీ అమ్మాయి కూడా వాళ్ళ అబ్బాయిని ప్రేమించింది కాబట్టి. అంతే కాకుండా నీవు మరలా వాళ్ళ ముఖం కూడా చూడలేవు. నలుగురిలో తల దించుకుని నడవాల్సిన పరిస్థితి వస్తుంది. నీ భార్యకు పుట్టినిల్లు దూరం అవుతుంది. ఒకవేళ నీవు మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళినా, నీకు తగిన మర్యాద ఇవ్వక పోవచ్చును. కాబట్టి ఒప్పుకుని ఇష్టంగా పెళ్లి జరిపించండి” అని చెప్పారు.
అపుడు శాంతమ్మ భర్త కాస్త ఆలోచించి, చేసేది ఏమి లేక సరే అన్నాడు. అందరూ ఒప్పుకోవడంతో శివ, కల్యాణి ల పెళ్లి మామిడి ఆకుల తోరణాలతో, మంగళ వాయిద్యాల మధ్య నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ విధంగా అంగ రంగ వైభవంగా శివ కల్యాణి ల వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లితో రెండు కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి.
తన తండ్రి మాటలను మదిలో వుంచుకున్న శివ తన భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. భావి తరాలకు మంచి ఆచార, సాంప్రదాయాలను అందించాలని, అలాగే పదిమందికీ ఆదర్శంగా వుండాలని శివ తన తండ్రి, అన్నలతోనే కలిసి వుంటూ అన్నింటిలోనూ తోడుగా వుంటూ జీవితాన్ని కొనసాగించడం మొదలు పెట్టాడు. నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచాడు....!!!!
సర్వే జనా సుఖినోభవంతు
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments