డబ్బు తెచ్చిన తంటా
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- 17 minutes ago
- 4 min read
#డబ్బుతెచ్చినతంటా, #DabbuThecchinaThanta, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Dabbu Thecchina Thanta - New Telugu Story Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 26/11/2025
డబ్బు తెచ్చిన తంటా - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"ఏమయినాదిరా, సూరిగా! అట్టా కూకున్నావు?"
దిగులుగా కూర్చున్న చిల్లరదొంగ మిత్రుడు సూరిబాబును పలకరించేడు నారాయణ.
"ఏమి సెప్పాలిరా, ఒక సిక్కొచ్చి పడినాది. మొన్న రైలు స్టేసను ప్లాటుపారం కాడ ఒక చిన్న సూటుకేసు చేతికి చిక్కినాది.. ఇంటికాడకొచ్చి మూత తెరిచి సూస్తే
ఐదొందలు, ఎయ్యి రూపాయల నోటు కట్టలు కనొచ్చాయి.
లెక్కెడితే యాబై ఏల రూపాయిలున్నాయి. ఆటిని సూసి నా కల్లు తిరిగినాయి. నానెపుడూ అంత సొమ్ము కానలేదురా. నోటు కట్టలతో పాటు ఏవో బేంకు కార్డులు, కాయితాలు ఉన్నాయి.
పోలిసోల్ల లొల్లి తగ్గినాక ఆటిని బయిటికి తీసి మస్తుగా మందు పార్టీ సేసుకోవచ్చని, నా పెల్లం లచ్చికి బంగారం తానుగొలుసు కొనొచ్చని మురిసినా. నా ఆశలు అడియాస
లైనాయిరా, నారిగా!" మొరపెట్టుకున్నాడు.
"అయితే దిగులెందుకురా?" అడిగాడు నారాయణ.
"ఎయ్యి, ఇయిదొందల రూపాయిల నోటులు బజారులో సెల్లవని టీవీ, రేడియోలో సెప్పినారుట. అయన్నీ బేంకులో జమ సెయ్యాలట. ఇంత డబ్బెలాగొచ్చినాదని ఆదారం సూపాలట. నా కాడ ఆధారుకార్డు కూడా లేదురా. ఇప్పుడెలాగ సెప్పు. దిగులు పట్టుకున్నాది. "
"అవునురా, పాత పెద్ద నోటులు సెల్లవని నానూ ఇన్నాను. ఏదయినా ఆదారం సూపితే కాని బేంకుల్లో పెద్ద రూపాయి నోటులు జమ చేసుకోరట. మనబోటి దొంగ ఎదవల కాడ
ఆదారాలేమి ఉంటాయి. సిక్కేరా!" అని తల గోక్కొని కొద్దిసేపు ఆలోచన చేసి "ఒక అయిడియా తట్టినాదిరా" అన్నాడు నారాయణ.
"సెప్పారా బేగె?" ఆతృతగా అడిగాడు సూరి.
"మనం బంగారం దొంగ సొత్తు అమ్మే మార్వాడి శేటు కాడ కెళ్దాం. ఏదయినా దారి సూపెడతాడు. కమీసను తీసుకుని కొంతయినా ముట్ట సెబుతాడు" సలహా ఇచ్చాడు.
నారాయణ చెప్పిన సలహా నచ్చి బ్రీఫ్ కేసు పట్టుకెళ్లి శేటుకి సంగతి చెప్పాడు సూరి.
మార్వాడి శేఠ్ గిరిధారిలాల్ షాపు వెనక ప్రైవేటు గదిలో బ్రీఫ్ కేసు తీసుకెళ్లి మూత తెరిచి పెద్ద కరెన్సీ నోట్ల కట్టలు లెక్కపెట్టి యాబై వేలలో ఇరవై వేల పెద్ద నోట్లు దాచేసి బయటికొచ్చి "చూడు, సూరిబాబూ! నువ్వు మా పాత కస్టమర్‌వి. బ్రీఫ్ కేసులో ముప్పై వేల రూపాయల పెద్ద నోట్ల కట్టలున్నాయి. ఇవి బేంకులో మార్పిడి చెయ్యాలంటే కష్టమవుతుంది. నీకు ఐదు వేలు ఇస్తాను. పట్టుకు పో" అన్నాడు శేఠ్.
"అదేటి శేటూ, సూటుకేసు పెట్టెలో యాబై వేల రూపాయల పెద్ద నోట్లు ఉంటే ముప్పైవేలంటా వేటి?" ఆశ్చర్యంగా అడిగాడు సూరిబాబు.
"నేను అబద్ధం చెబుతానంటావా! పోలీసులకి ఫోన్ చేసి చెప్పమంటావా? నువ్వు మాకు దొంగ సరుకు సరఫరా చేసే రెగ్యులర్ కస్టమర్‌వని అయిదు వేలు ఇస్తానన్నా" కసురుకున్నాడు గిరిధారిలాల్.
"లేదు, నా సూటుకేసు ఇచ్చేయి. పోతా”నన్నాడు సూరిబాబు.
మాటా మాటా పెరిగి సూరిబాబు, మార్వాడి శేఠ్ వాగ్వివాదాలకు దిగారు.
అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ విషయం తెలుసుకుని పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు తెలియచేశాడు.
వెంటనే యస్. ఐ. మార్వాడి శేఠ్‌ని, దొంగ సూరిబాబును పోలీసు స్టేషన్‌కు పిలిపించి వాకబు చెయ్యగా నారాయణ కొట్టేసిన బ్రీఫ్ కేసు సంగతి బయటపడింది.
తక్షణం దాన్ని స్టేషన్‌కు తెప్పించి చూడగా ముప్పై వేల పాత పెద్ద కరెన్సీ నోట్ల కట్టలు, బేంకు క్రెడిట్ కార్డులు బయటపడ్డాయి.
దొంగ సూరిబాబు తను తెచ్చిన బ్రీఫ్ కేసులో యాబై వేలని చెప్పగా, సబ్‌ఇన్‌స్పెక్టర్ గట్టిగా పోలీసు పద్ధతిలో దర్యాప్తు చెయ్యగా తను కొంత డబ్బు నొక్కేసినట్టు ఒప్పుకున్నాడు శేఠ్.
బ్రీఫ్ కేసులోని బ్యాంకు క్రెడిట్ కార్డును బట్టి ఆ బ్రీఫ్ కేసు ఒక వాణిజ్య పన్నుల శాఖ అధికారిదనీ, తన బ్రీఫ్ కేసు ట్రైన్లో దొంగతనం జరిగిందని సమీప రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యడం జరిగింది.
ఆ వాణిజ్య పన్నుల శాఖ అధికారి లంచాల రూపంలో వసూలు చేసిన పెద్ద నోట్ల సొమ్ము పోలీసుల చేతికి చిక్కడంతో కిక్కురుమనకుండా ఊరుకున్నాడు.
మొత్తం వాడుకలోని పెద్ద కరెన్సీ నోట్లు ప్రభుత్వ పరమయ్యాయి.
చివరకు పిల్లి పిల్లీ పోట్లాడుకుంటే రొట్టె సంగతి కోతి తీర్చినట్టయింది — సూరిబాబు బ్రీఫ్ కేసు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments