top of page
Original_edited.jpg

శ్రావణ మేఘం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #SravanaMegham, #శ్రావణమేఘం, #TeluguStories, #తెలుగుకథలు

ree

Sravana Megham - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 26/11/2025

శ్రావణ మేఘం - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


“ఆహా! చిరుజల్లుల సరిగమల్లో తరించాలి, నీలి మేఘమాలికలతో మాట్లాడాలి, పచ్చని చెట్లు, రకరకాల రంగుల పువ్వులు, చేనులోని పచ్చి పెసరకాయలు ఎంత బాగుంటాయో! ఈ శ్రావణ మాసం మనకు వరమై, పరవశమాయే మదిలో" అంటూ పొలాల ప్రక్కన గట్లపై నడుస్తూ, జారిపడబోతున్న నవ్యకు చేయందించాడు వరుణ్.


“ఇంకెంత దూరం, వరుణ్! తడిచి పోతున్నా జల్లులలో.. నేను మాత్రం పొడిగా ఉన్నానా? ఇలాంటి అనుభూతి దొరకడం మన అదృష్టం.”


“మళ్ళీ మనం సిటీకి వెళ్తే ఇవన్నీ మిస్ అవుతాము నవ్య.. కొత్త కోడలువని నీతో నోములు, వ్రతాలు చేయించాలని తీసుకురమ్మన్నారు మా అమ్మా నాన్న.. శ్రవణ నక్షత్రంతో ప్రారంభమయ్యే శ్రావణమాసం శుభప్రదం.”



“శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ మాత్రమే తెలుసు. మా అమ్మతో షాపుకు వెళ్ళి వెండి, స్పాంజీ రాఖీలు కొని, మా తమ్ముడి కుడి చేతికి కట్టి, బొట్టి పెట్టీ హారతి ఇచ్చి నోట్లో స్వీటు పెట్టి ఒక ముద్దు పెట్టేదాన్నీ.నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చేవాడు తమ్ముడు. డబ్బులు ఇస్తే నాకు ఇష్టమైన బట్టలు, చెవిరింగులు కొనుక్కునేదాన్ని. అమ్మ నాన్న మాఇద్దరి ఆప్యాయతలు చూసి కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మాకు ఆశీస్సులు ఇచ్చేవారు.”


‘నరేశ్! అక్క పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్తే, నీవు అక్క దగ్గరికి వెళ్లి రాఖీ కట్టించుకోవాలి..’ అంటున్న నాన్నతో,‘నో.. నేను పెళ్లి చేసుకోను, ఇక్కడే ఉంటాను. అనేదాన్ని..

ఎక్కడున్నా నువ్వు తమ్ముడి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టాలి. అన్న తల్లితో, .నాకు గిఫ్ట్ ఇస్తాడా. అంటూ సంతోషపడేదాన్ని.


‘అక్కా! నువ్వు ఎక్కడున్నా నీకు శ్రావణ పౌర్ణమికి మంచి పట్టుచీర పంపిస్తాను"’ అని చిన్నప్పుడే మాట ఇచ్చాడు. రేపు వస్తుంది కొరియర్‌లో. ఇంకా వారం రోజులలో రాఖీ పండుగ కదా వరుణ్! పోయిన ఏడాది వరకు ఇలా సంబరంగా శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ జరుపుకునేవాళ్లం. నోములు, వ్రతాలు నాకు తెలియదు” అనగానే,"శ్రావణ పౌర్ణమి రోజు పురోహితుడు గాయత్రి మంత్రం చెప్తుంటే నేను, నాన్న జంధ్యాలు కొత్తవి వేసుకుంటాం. జంధ్యాల పున్నమి అంటారు. అన్నీ పెద్దవాళ్లే చేయిస్తారు, నేర్చుకునేది ఏమీ లేదు" అని ఇంటికి వచ్చేశారు.



ఉదయాన్నే నవ్య అని పిలుపుతో మేలుకొంది.

“పెళ్లయిన మొదటి సంవత్సరం శ్రావణమాసంలో మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి. తలస్నానం చేసి క్రొత్త బట్టలతో పూజలో కూర్చోవాలి. నేను పూజ కలశం, హారతి తయారు చేస్తాను.


రా తల్లి! మీ అత్తగారు తొందర పెడుతున్నారు. నిన్న తెచ్చిన పెసలు నాన్న బెట్టాను. ఇంకా బియ్యం పిండితో జ్యోతులు చేసి, మొదటి వాయనం నాకే ఇవ్వాలట, రెడీ అయ్యాను..” అని చెప్తుంటే నవ్యకు వింతగా తోస్తుంది.


చిన్నప్పటి నుండి ఆటపాటలు, పుస్తకాలు తప్ప ‘ఈ చీర కట్టుకోవడం నావల్ల కాదు మమ్మీ..’ అని విసుగ్గా చూస్తుంటే.. ‘అందుకే ఈ రెడీమేడ్ సారీ తెచ్చాను. ఇలా దీన్ని డ్రెస్‌లాగా వేసుకోవచ్చు’ అని చెప్పి తల్లి వెళ్లిపోయింది.


చీర కట్టుకుని అద్దంలో చూసుకొని మురిసిపోయింది నవ్య. ఇంత ఈజీనా చీర కట్టుకోవడం, బాగుంది.


"బాగున్నావు నవ్య.. ఈ చీరలో పెళ్లిరోజు చూశాను, మళ్ళీ ఈరోజు చూస్తున్నాను" అని వరుణ్ కౌగిలించుకోబోతుంటే,"పూజా సమయం ఇది.." అని వెనక్కి నెట్టేసి, "రెడీ అవండి మీరు కూడా.. పూజ కోసం.."


"నా తమ్ముడికి వెండి, స్పాంజీ రాఖీలు చేరాయో లేదో ఫోన్ చేసి తెలుసుకోవాలి."


"మనం తమ్ముడు దగ్గరికి వెళ్దా”మని తల్లితో చిన్నపిల్లలా మారాం చేస్తుంటే, "ఏమిటమ్మా! ఇదీ నీ అత్తగారిల్లు. ఇక్కడ నీవు మంగళవారం వ్రతం చేసుకోవాలి. అయినా తమ్ముడు కొత్త ఉద్యోగం, ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వరు, ఎక్కడికి రానని తన ఊరిలోనే ఉంటానని చెప్పాడు కదమ్మా!"


రాత్రి ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా రావడంతో కాస్త ఆలస్యంగా లేవడంతో గదినిండా నీళ్ళు ఉన్నాయి. పెద్ద వర్షం వరదలు వచ్చినట్టున్నాయి. ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చాయి. ఈ ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉన్నట్టుంది.. అంటూ చీపురుతో నీళ్లన్నీ బయటికి ఊడ్చేసి, పైన ఉన్న రాఖీలు గుర్తొచ్చాయి..


నరేశ్ ఫోన్ చేసి,"అక్క! మీ దగ్గర నుండి రాఖీలు వచ్చాయి. అవి నీ చేతితో కడితే ఎంత బాగుండు. అనుకున్నప్పుడు నువ్వు నా చేతికి రాఖీ కడుతున్నప్పుడు నా కళ్లలో ప్రేమ మెరుపులు మెరిసేది. ఆ కాంతిలో నువ్వు అపరంజి బొమ్మలా కనిపించేదానివి.


ఇప్పుడు కొరియర్ ప్యాక్‌ను విప్పుతున్నాను చూడు.." అంటూ వీడియో ఆన్ చేసి అక్కకు వాట్సప్‌లో కాల్ చేస్తుండగానే, డోర్‌బెల్ శబ్దం వినిపించింది.. మంచి సమయంలో డిస్టర్బ్ చేస్తారు.. ఈ పండుగ చందాల వాళ్లే కాబోలు..


"అక్క చూడు.." అంటూ చూపిస్తుంటే, పోలీస్ ఇన్స్పెక్టర్ డోర్ నెట్టుకుని లోపలికి వచ్చి, “కానిస్టేబుల్. సెర్చ్..” అని అనేసరికి వెతకడం ఆరంభించాడు.


ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, "ఎందుకు సార్? నా ఇంట్లో సోదాలు.."

"సార్! బెడ్ కింద నేల మీద మత్తు పదార్థాల పాకెట్లు ఉన్నాయి" తెచ్చి చూపించాడు కానిస్టేబుల్.


"మిస్టర్ నరేశ్ గారు — యూ ఆర్ అండర్ అరెస్ట్" అన్న మాటలు సూటిగా గుండెల్లో బాణాలు కుచ్చుకున్నట్లయింది.


అటువైపు నవ్య.. "తమ్ముడూ ఏమైంది రా! అర్థం కావట్లేదు! ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది” అంటూ ఉంటే, అత్తగారు పిలుపు విని పూజ గదిలోకి నడిచింది నవ్య తప్పదన్నట్లు.


“ఇన్స్పెక్టర్.. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఈ వంగపహాడ్ జిల్లాకు కొత్తగా వచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ నండి. నేనే తప్పు చేయలేదు. అవి ఇంట్లోకి ఎలా వచ్చాయో తెలియదు."


ప్రశ్నార్థకంగా, ఆశ్చర్యంగా, ఆందోళనగా అడుగుతున్నాడు నరేశ్.

"రాత్రంతా వర్షం పడిన కారణంగా రోడ్ల పైన నీళ్లు నిలిచి రాకపోకలకు అంతరాయం అయింది. మా కార్మికులు చెత్తను తొలగిస్తూ ఉంటే మీ ఇంటి ముందు, మీ గదిలో మత్తు పదార్థాల ప్యాకెట్లు దొరికాయి సార్. మీరు ఏమి చెప్పదలచుకున్నా కోర్టులో మాట్లాడండి. మేం మా డ్యూటీ చేస్తున్నాం సార్, క్షమించండి."


క్షణంలో చేతులకు బేడీలు పడగానే కానిస్టేబుల్‌తో నడుస్తూ వెళ్లడం తనకు అంతా కలలా తోచింది.


ఇంటి ఓనర్ కాంతయ్య శాస్త్రి ఉదయాన్నే "వార్తాపత్రిక" చదువుతుంటారు. నేలకొండ ప్రాంతంలో యువత అడ్డాలుగా చేసుకుని మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తూ అరాచకాలు జరుగుతున్నాయి అని వార్త చదివి స్పందించి, "ఇంట్లో ఉన్న నేను ఏం చేస్తాను! కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే" అని మనసులో అనుకుంటుండగానే, అలా నరేశ్ పోలీస్ వాన్ ఎక్కుతుండడం చూసి అవాక్కయ్యాడు.


ఈ మధ్యనే వచ్చిన మంచి యువకుడు నరేశ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేస్తున్నాను అని చెప్పి, మంచి కుటుంబంలో ఉన్న ఒక పోర్షన్ అద్దెకు ఇచ్చాను. వచ్చిన కొన్నాళ్లకే ఇంత దిగజారే పని చేస్తాడని అనుకోలేదు.


జేబులో ఫోన్ మ్రోగడంతో ఆన్ చేయగానే, "సార్! నరేశ్ మీ ఇంట్లో అద్దెకు ఉండే అతనేనా? నేను అతని అక్కను మాట్లాడుతున్నా, నరేశ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది."


"అవునమ్మా! మంచి కుర్రాడే. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు." అనగానే, "అవునా! దేని గురించి అండి? నేను ఫోన్ చేసినప్పుడే జరిగింది. కాసేపట్లో స్విచ్ ఆఫ్ అయింది."

"నరేశ్ గదిలో మత్తు పదార్థాల పాకెట్లు దొరికాయని అంటున్నారు. ఎక్కడ ఉన్నారమ్మా? తొందరగా రాగలరా?"


"లేదండి, మేము విశాఖపట్నం దగ్గర చిన్న పల్లెటూరు పాలెంలో ఉన్నాం. రావడానికి ఒక రోజైనా పడుతుంది."


"అయితే నాకు తెలిసిన లాయర్‌ను తీసుకెళ్లి బెయిల్ ఇప్పిస్తానమ్మ. వెళ్తున్నాను."

"చాలా థ్యాంక్స్ అండి" అని ఫోన్ పెట్టేసింది నవ్య.


గుమ్మంలో "సార్! కొరియర్" అన్న పిలుపు విని వెనక్కి చూసింది. పెద్ద ప్యాకెట్ తన పేరునే ఉంది. సంతకం చేసి తీసుకుంది.తమ్ముడు వ్యాపారం రాగానే రాఖీ పండుగకు చీర పంపిస్తాను అని చిన్నప్పుడు అన్న మాట ప్రకారం పంపించాడు.


చిలక పచ్చ రంగు కంచి పట్టు చీర, ఎరుపు రంగు పువ్వులున్న జరీ బార్డర్‌తో చాలా బాగుంది. చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

రాత్రి ఒంటిగంటకు ట్రైన్ ఉంది అని బయలుదేరారు అందరూ.


ఉద్యోగంలో జాయిన్ అయిన కొద్ది రోజులకే అడవి ప్రాంతంలో కొన్ని సాగుభూములు ఉన్నాయి. వాటిని సర్వే చేసి వ్యవసాయానికి అవసరమైన నీటిని సరఫరా చేయడానికి కాలువలు, రిజర్వాయర్లతో సౌకర్యాలు కల్పించడానికి తరచూ వెళ్లవలసి వచ్చింది.

పంటలు పండితే ఆహార భద్రత, తాగునీటి అవసరాలు తీరుతాయని ప్రణాళికలు తయారుచేశాడు నరేశ్.


గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం రహదారులు మెరుగయ్యాయి. రవాణా సులువైంది. సెలయేరు నీళ్లకు కాలువలు తీసి పొలాలు, తాగునీటికి ప్రణాళికలు చేశాడు.

కొండ ప్రాంతంలో పెంచుతున్న గంజాయి మొక్కలు అధికారుల కంటపడ్డాయి. నరేశ్ తానే పోలీసు సహాయంతో ప్రజలను ఎదుర్కొన్నాడు.


ఇల్లు పెద్దది కావడం కాకుండా చుట్టూ పెద్ద కాంపౌండ్. ఒక వైపు తన అద్దె పోర్షన్. పెద్ద వేపచెట్టు, స్వచ్ఛమైన గాలి, జామ, సపోటా, దానిమ్మ చెట్లు, పూలమొక్కలతో ఉద్యానవనంలా ఉంటుంది.


ముందు స్థలంలోనే కాంతయ్య శాస్త్రి గారు పురాణ ప్రవచనాలు చెప్తుంటారు. ఆయనకు అవే వార్ధక్య జీవితానికి తోడుగా మారాయి. వారం రోజులుగా కాంతయ్య గారికి ఆరోగ్యం బాగోలేక ప్రవచనాలు కూడా చెప్పడం లేదని తెలిసింది.

దుండగులు వచ్చే అవకాశం లేదు. డ్రగ్స్ దొరకడం ఏమిటి? ఆ రాత్రంతా ఆలోచిస్తూ తెల్లారింది.


లేచేసరికి ఊరి జనాలందరూ ఇంటి ముందర మాట్లాడుకుంటున్నారు. బయటకు వచ్చిన నరేశ్‌ను చూసి,

"సార్! మీరు చాలా మంచివారు. మా కోసం ఎన్నో మంచి పనులు చేశారు. మాకోసం ఊరికి దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తీసుకుని వచ్చి మా ఇళ్లకు కుళాయిలలో వచ్చేలా చేశారు. మీరు ఏమి భయపడకండి. నిజం ఎప్పటికీ దాగదు. మీరు నిర్దోషిగా బయటపడతారు" అని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.


సర్పంచ్ వామనయ్య గారు విషయం తెలిసి నరేష్ను కలిశారు. "ఏం జరిగింది సర్? మీరు మాకోసం ఎంత చేసారో?"


వారం రోజుల తరువాత ప్రవచనాల రోజున ఆలస్యంగా బయలుదేరాను. వర్షం భారీగా కురిసింది. చేరేసరికి భోజనం చేసి పడుకున్నాను. ఉదయం కార్మికులు డ్రైనేజీలు క్లీన్ చేస్తుంటే నీటిలో కొట్టుకొచ్చిన ప్యాకెట్లు దొరికాయట. పోలీసులకు అప్పగించారట. అవి గంజాయి, కొకైన్ పాకెట్లు. నైట్‌లో వచ్చి సోదాలు చేశారు. నాకు సంబంధం లేదని చెప్పినా వినలేదు. అంతే.”


వామనయ్య గుట్టలలో నివసించే వీరయ్యను కలిసి విచారించాడు.

"మాకు గంజాయి, డ్రగ్స్‌తో సంబంధం లేదు" అని మొదట చెప్పారు. వామనయ్య ప్రలోభపెట్టగానే నిజం చెప్పారు.


డ్రోన్లతో పట్టుబడ్డాక, నరేశ్‌ను ఇరికించాలనే పథకం వేసారని, కూరగాయల మధ్య డ్రగ్స్ పెట్టి ఇంట్లో ఉంచించారని చెప్పారు.


అన్నీ రికార్డ్ చేసి కలెక్టర్‌కు పంపించాడు వామనయ్య.

ఇన్స్పెక్టర్ సస్పెండ్, నరేశ్ నిర్దోషి.


డ్రగ్ మాఫియా పట్టుబడ్డారు. జిల్లా కలెక్టర్ నరేశ్‌ను సత్కరించారు.

నరేశ్ ఇంట్లో తల్లిదండ్రులు, అక్క బావ, అందరి సంతోషంతో రాఖీ పండుగ సందడి.నవ్య తమ్ముడి చేతికి రాఖీ కట్టి, అతడు పంపిన పట్టుచీర తీసుకుని ఆశీర్వదించింది.


శుభం. 


 యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page