top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 6

'Prema Chejarithe (bhavishyath Kalamlo) 6' New Telugu Web Series


(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)

గత భాగంలో జరిగినది...


కరోనా కారణంగా కుమార్ షాలినిని మళ్ళీ కలవలేకపోయాడు. అలా కుమార్ మూగ ప్రేమ అక్కడితో ముగిసిపోయింది.


ఇక చదవండి...


అప్పట్లో ఆ కరోనా మహమ్మారి ప్రపంచంలో ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది.


కరోనా కోరల్లో కుమార్ జీవితం కూడా ఎంతో నష్టపోయింది.


కరోనా సమయంలో దురదృష్టమో, ఏమో వీరింట్లో కూడా అందరికీ కరోనా వచ్చింది. రాఘవరావు యాబైఅయిదేళ్ళవాడైనా, చిన్నతనం నుండి రోజూ చేసే యోగా, ధ్యానం వల్ల కరోనా ఆయనను ఏమీ చేయలేక పారిపోయింది. ఇంక కుమార్ కూడా తండ్రి లాగే యోగా, ధ్యానం చిన్నప్పటి నుండి చేసేవాడు, పైగా యువకుడు. అందుకే కుమార్ను కూడా కరోనా ఏమీ చేయలేక ఓడిపోయి తోకముడుచుకోవాల్సి వచ్చిందన్న కక్ష్యతో తన ప్రతాపమంతా కుమార్ వాళ్ళమ్మ సరస్వతమ్మ మీద తీర్చుకుని విజయం సాధించి ఇద్దరినీ ఇలా జయించానని ఆనందపడిపోయింది.


సరస్వతమ్మ వయసు యాభైకి దగ్గరగా వుంది, అదీ కాక ఆమెకు ఆస్తమా వుంది...


ఆమె కూడా పెళ్ళయినప్పటి నుండి ధ్యానం చేయటం వల్ల ఆస్తమా అదుపులోనే వుండేది. కానీ ఈ కరోనా వల్ల, ఆస్తమా తిరగబట్టి ఊపిరితిత్తులు బాగా పాడయిపోయాయి. అప్పటికింకా కరోనాకు వాక్సిన్ రాలేదు, అలాగే కరోనా వచ్చిన వారి శరీరంలో కలిగే ఇబ్బందులు కూడా ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అందువల్ల ఆమె ఊపిరితిత్తులు పాడైపోయేవరకు కనుక్కోలేక పోయారు. తెలుసుకున్నాక ఆమెను ఐ.సి.యు.లో వుంచి నలబై రోజులకు పైగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయటానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఫలితం లేక పోయింది. ఆమె అనంతవాయువుల్లో కలిసి పోయింది. అలాగే కుమార్ ఇంతకాలం ఆదా చేసిన డబ్బు కూడా హారతికర్పూరంలా ఖర్చయిపోయింది. డాక్టర్లు ముందే చెప్పారు, గ్యారంటీ ఇవ్వలేమని, అది మీ సొంత నిర్ణయం, మీరు ఐ.సి.యు.లో వుంచి చూడమంటేనే మేము ఐ.సి.యు.లో వుంచి చూస్తామనీ, ఖర్చు కూడా చాలా అవుతుందని చెప్పారు. కుమార్ తన తల్లికంటే డబ్బు తనకేమీ ఎక్కువ కాదని వున్న దంతా ఖర్చు పెట్టటానికే సిద్ధపడ్డాడు. కరోనా చూస్తే ఒక కొత్త జబ్బు, డాక్టర్లు కూడా ఏ విషయాన్ని ఖరాఖండిగా చెప్పలేకపోయారు. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు. కుమార్ తన తల్లి బ్రతికే అవకాశం ఏమాత్రం వున్నా వదులుకోవాలను కోలేదు, అందుకే తన ప్రయత్నం తను చేసాడంతే. విధి వారిని చిన్న చూపు చూసిందనుకోవాలేమో.


సరస్వతమ్మ మరణం తండ్రీ, కొడుకులనిరువురిని బాగా కృంగదీసింది. కానీ ముందుగా తేరుకున్నది రాఘవరావే. తేరుకుని కొడుకుకు ఎంతో ధైర్యాన్ని నూరిపోసాడు.


ఎవరి పయనం ఎంతవరకో అంతే, అదంతా మన చేతుల్లో లేదు. నీవు మీ అమ్మ కొరకు చేయగలిగినదంతా చేసావు. ఏ అమ్మైనా కొడుకుకు మంచి జీవితం వుండాలని కోరుకుంటుంది. తన నిష్క్రమణే తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిందని తెలిస్తే పైనున్న మీ అమ్మ ఆత్మ శాంతించదు. ఏ తల్లైనా ఆనందపడేది తన కుమారుడు తన కోసం బాధపడ్తూ జీవితంలో ఓడిపోవడం కానే కాదు. తను లేక పోయినా ఏదైనా గొప్పగా జీవితంలో సాధించినప్పుడే అనేది గుర్తు పెట్టుకోమని చెప్పి కర్తవ్య బోధ చేసి మామూలు మనిషిని చేసాడు.


తర్వాత కరోనా మరో రెండు, మూడు సంవత్సరాలు ప్రపంచాన్నంతా చుట్తూ తన ప్రతాపాన్ని చూపింది. మనుషులేం తక్కువా?!. వారు కూడా దానిని ఎదుర్కొనే జాగ్రత్తలు తీస్కుంటూ, దానికి వాక్సిన్ను కనుక్కొని తరిమి కొట్టారు.


కుమార్ ఈ రెండు సంవత్సరాలు తన ఉద్యోగం చేస్కుంటూ, తండ్రికి చేదోడుగా వుంటూ, తనకు నచ్చిన కంప్యూటర్ కోర్సులు కూడా నేర్చుకోసాగాడు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆన్లైన్లోనే నేర్చుకోగలిగే విధానాలు ఎన్నో అభివృద్ధి చెంది అందరినీ వాటిని వినియోగించుకునేలా చేసాయి. కుమార్ వాటిని చక్కగా ఉపయోగించుకున్నాడు. పైగా ఉద్యోగం ద్వారా కొంత డబ్బు కూడా ఆదా చేయగలిగాడు.


రాఘవరావు మళ్ళీ పెళ్ళి ప్రయత్నాలు చేసాడు కానీ ఈసారి బ్యాంకు బ్యాలెన్సు కూడా లేని కుమార్కు ఆ వచ్చే రెండు, మూడు సంబంధాలు కూడా రాకుండా పోయాయి. దానితో కుమార్కు పెళ్ళి మీద ఆసక్తి తగ్గిపోయింది. మళ్ళీ ముందులా చదువు మీదకే మనసు మళ్ళింది. రాఘవరావు మాత్రం పరిస్థితిని అంత త్వరగా ఒప్పుకోలేకపోయాడు. అందుకే ఆయన ప్రయత్నాలు ఆయన చేయసాగాడు.


కుమార్ పనిచేసే కంపెనీ వాళ్ళు కుమార్ ఇంజనీరింగ్ డిగ్రీని అంగీకరించినా, ఆ పోస్టు ఖాళీగా లేదని చెప్పారు. కుమార్ అలాగే హెడ్ ఆపరేటర్గా కొనసాగుతూ తన ప్రణాళికలు తను చేస్కోసాగాడు. కుమార్ మెషీన్ లాంగ్వేజ్లకు సంబంధించినవే కాక ఎన్నో కంప్యూటర్ లాంగ్వేజ్లకు సంబంధించిన ప్రాజెక్టులను సైతం స్వంతంగా తన స్నేహితులతో కలిసి చేస్తూ చాలా అనుభవాన్నైతే సంపాదించాడు కానీ, జీతంలో పెద్దగా ఎదుగుదల లేకపోయింది. అలాగే మరో మూడేళ్ళు కూడా గడిచి పోయింది.

పెళ్ళి సంబంధాలు ఎంతో వెతకగా అందరూ వద్దనుకున్నవి వచ్చాయి కానీ కుమార్కు అవి అస్సలు నచ్చలేదు. మనసుకు నచ్చని పెళ్ళి వద్దనుకున్నాడు, దానివల్ల తాను పొందే దానికన్నా కోల్పోయేదే ఎక్కువనుకున్నాడు. చూపుకూ నచ్చక, మనిషెలాంటిదో, మనసెలాంటిదో కూడా తెలియక, కేవలం పెళ్ళి చేస్కోవాలన్న ఒకే ఒక్క కారణంతో పెళ్ళి చేస్కుని, తర్వాత ప్రతిరోజూ ఒకరి ఉనికి మరొకరికి నచ్చక జీవితాంతం నలుగురి ముందు ప్రేమ నటిస్తూ, మనస్సాక్షిని సైతం అదిమిపెట్టి కలిసి వుండలేక, విడిపోయి పుట్టిన పిల్లలను బాధపెట్టలేక జీవితాంతం పడే బాధ కంటే పెళ్ళి చేస్కోకుండా వుండటమే మంచిదిగా తోచింది కుమార్కు. అందుకే స్థిరంగా పెళ్ళి వద్దనుకుని, అదే విషయాన్ని తండ్రికి చెప్పాడు. తండ్రి అది విని చాలా బాధపడ్డా, అప్పట్లో ఎన్నో జంటలు కలిసి వుండలేక విడాకులు తీస్కుంటున్న సంఘటనలు చూసినవాడై కుమార్ తీస్కున్న నిర్ణయమే సబబనుకుని ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ ఆయన మనసులో కుమార్కు నచ్చినమ్మాయితో పెళ్ళి జరిగి, ఒక కుటుంబమంటూ ఏర్పడాలని కోరుకుంటూనే వున్నాడు.


ఆ తర్వాత కుమార్ సమాజంలో ఇలా మగ పిల్లలకు పెళ్ళి చేస్కోటానికి తగిన అమ్మాయిలు దొరకకపోవటానికి గల కారణాలు, వాటికి కావాల్సిన పరిష్కారాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఆ పరిష్కారాలతో తన లాంటి వారికి చేయూత ఇవ్వటమే తన లక్ష్యమని స్థిరంగా నిర్ణయించుకున్నాడు.


ఇంతలో కుమార్కు, వాళ్ళ కంపెనీవాళ్ళే ఇంజనీర్గా ప్రమోషనిచ్చి, జర్మనీకి డిప్యుటేషన్ మీద రెండేళ్ళ అగ్రిమెంట్తో పంపిస్తామన్నారు. దాన్ని కుమార్ తన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. దానికి తండ్రిని కూడా ఒప్పించాడు. తండ్రికిష్టమైతే ఆయన కూడా తనతో పాటూ అక్కడే వుండటానికి కంపెనీ అంగీకరించిందని చెప్పాడు. కానీ రాఘవరావు తాను అక్కడుంటే ఏమీ చేయలేక పొద్దు పోదనీ, ఇక్కడే చుట్టుపక్కలున్న పిల్లలకు చదువు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తానన్నాడు.


కుమార్ రాఘవరావుకొక లాప్టాప్ కొని దాన్ని ఆయనకు అలవాటు చేయించి ప్రతిరోజూ తనతో వీడియో కాల్లో మాట్లాడ్తుండాలనీ, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే తెలియచేయమని ప్రమాణం తీస్కోని జర్మనీకి వెళ్ళి పోయాడు. అలాగే కంపెనీ వారిని కూడా ఏదైనా అవసరమొస్తే నాన్నని చూస్కోమని చెప్పాడు.


అక్కడే కుమార్ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని కమార్కు కూడా తెలీదు.


జర్మనీకి వెళ్ళిన కొత్తల్లో, కుమార్ అక్కడి వారి ఆంగ్ల యాసను అర్థం చేస్కోటానికి చాలా కష్టపడేవాడు, తర్వాత్తర్వాత అక్కడి భారతీయుల పరిచయంతో అన్నింటిని అర్థం చేస్కోగలిగాడు. ఏదిఏమైనా, మన దేశస్తులు వేరే దేశంలో కలిస్తే మటుకు చాలా అభిమానంగా మాట్లాడటమే కాదు ఏ సహాయం చేయటానికైనా వెనకాడరు. మనమే కాదు అన్ని దేశస్తుల ప్రవర్తన కూడా ఇలాగే వుంటుంది. దూరంగా వున్నప్పుడు ప్రేమ పెరుగుతుందనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. జర్మన్లు వాళ్ళ యాసలో 'కుమార్ పేరును' పలుకుతుంటే మొదట్లో చాలా తమాషాగా అనిపించేది కుమార్కు, తర్వాత ఆ పిలుపుకు అలవాటుపడిపోయాడు. అంతకుముందు షాలిని తనను పిలిచినప్పుడు కూడా ఆ పిలుపు చాలా నచ్చింది కుమార్కు.


జర్మనీకి వెళ్ళాక కుమార్ కంపెనీకి పని చేస్తూనే, రెండేళ్ళ కాలంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించాడు. ఈ రెండేళ్ళ కాలంలో కుమార్ హాకింగ్ గురించి ఎంతో సమాచారం తెలుసుకోవటమే కాక యాంటీ హాకింగ్ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ మరియు ఇంకెన్నో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లకు వెళ్ళి చాలా అనుభవం సంపాదించాడు.


కుమార్కు పెళ్ళి, పిల్లలు అనే చింత లేదు కాబట్టి నిద్ర లేచి నప్పటి నుండి మళ్ళీ నిద్ర పోయేంతవరకు ఏవైనా కొత్త విషయాలను నేర్చుకోవటమో, లేకపోతే తనే ఏదైనా కొత్తగా ఆలోచించి తయారుచేయటమో అనేదే దినచర్యయ్యింది. అదంతా కంపెనీ ట్రైనింగ్ అయినా, కుమార్ దాన్ని చాలా ఉత్సాహంగా నేర్చుకున్నాడు. అలాగే కంపెనీ వారు ఇంకో మూడేళ్ళు అక్కడే వుండాలనుంటే వుండొచ్చంటే, కుమార్ ఇంకక్కడే వుండి ఎలక్ట్రానిక్స్ లో తనకు తెలియనిది లేదనే స్థాయికి చేరాడు. ఆ సమయంలోనే తనలాంటి ఒక ఐదారుగురు భారతీయులను పోగేసాడు. వారిని కూడా తన కష్టార్జితంతోనే వారికిష్టమైన కోర్సులు చేస్తూ ప్రావీణ్యం సంపాదించటానికి ఎంతగానో ప్రోత్సహించాడు. ఆ సమయంలోనే వాళ్ళొక్కొక్కరు ఎలక్ట్రానిక్స్ లోని ఒక్కో ఉపవిభాగాలలో నిష్ణాతులు అయిపోయారు. అయినా అందరూ అన్ని విభాగాల గురించీ నేర్చుకున్నారు.


ఆ మూడేళ్ళ కాలం అయిపోగానే ఇండియా కొచ్చి కుమార్ తను పని చేసే కంపెనీకి రిజైన్ చేసి జర్మనీలోనే ఒక కంపెనీలో జాబ్ సంపాదించి జర్మనీకి వెళ్ళి పోయాడు. ఈసారి కూడా రాఘవరావు, "తనకు చేతనయినన్ని రోజులు వుండి, చేతకానప్పుడు నీ దగ్గరకు వస్తానని చెప్పి," కుమార్ని జర్మనీకి పంపాడు.


(ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తూ మరో భాగంతో మళ్ళీ కలుస్తాను, ఇక వుంటాను, బై.)

============================================================

ఇంకా వుంది============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.


27 views0 comments

Comments


bottom of page