top of page

రైతే రాజు


'Raithe Raju' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 26/10/2023

'రైతే రాజు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఆరుగాలం కష్టించేది

అందరికి తిండి సృష్టించేది

పల్లెటూరి రైతురా

పొలముదున్నువాడురా


ముతకగుడ్డ తానుగట్టి

బతుకు మనది బాగు చేయు

వేగు చుక్క మొలవగానె

ఏగును పొలము దున్న


రాజనాలను పండించును

మహరాజుల కందించును

భోజనాలు చేయుటకతనికి

రోజంతా కుదురదు


అంబటేళ కాగానే

ఆరు బయట చెట్టు కింద

ఆరగించు అంబలి

ఆ కాస్త విశ్రమించు


మండుటెండ మరియు వాన

చలియైనా చీకటైనా

రైతన్న రాజ్యం లో

రాబోవు అతని దరికి

పల్లెటూరి రైతు లేక

పట్టణాన బతుకు లేదు

ఎంత దండి వాడైనా

తిండి లేక బతుకలేడు


రాజు లేని దేశమంటె

రైతులేని ఊరురా అందుకే

రైతే మహరాజురా --------

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


53 views0 comments
bottom of page