రాయల వారి క్షమాగుణం
- Surekha Puli
- Jun 23
- 3 min read
#SurekhaPuli, #సురేఖపులి, #RayalaVariKshamagunam, #రాయలవారిక్షమాగుణం, #TeluguStory, #తెలుగుకథ

Rayala Vari Kshamagunam - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 23/06/2025
రాయల వారి క్షమాగుణం - తెలుగు కథ
రచన: సురేఖ పులి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి. తెలుగు భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య గొప్ప చక్రవర్తులలో కీర్తించబడినాడు. రాజ్యపాలనలో సామంత రాజులను నియుక్తి చేసి సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకున్న క్రమంలో కువలాపురంను విజయనగరాధీశులందరిలోకీ గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడైన మాధవ మహారాజును సామంతరాజు కు బాధ్యతలు అప్పగించారు.
కువలాపురం బంగారు గనులకు ప్రసిద్ధి. మాధవ మహారాజు తన పదవీ బాధ్యతలు చేబూని, శృంగప్పను ఆర్థికవేత్త ధనాగార కోశాధికారిగా నియమించాడు. శృంగప్పకు ఎన్నో నోముల ఫలంగా కుమారుడు జన్మించాడు, అతని పేరు జ్ఞానరాజు. జ్ఞానరాజు అస్త్ర శాస్త్రం, విలువిద్య అభ్యసించలేదు అనే కంటే తండ్రి కుమారుని ప్రోత్సహించలేదు అనుకోవచ్చును.
ప్రతి దినము శృంగప్ప తన కొడుకును తన వెంట ధనాగార మందిరం తీసుకొని పోయి అక్కడ అగుపించు వజ్ర వైడూర్యాలు, మణిరత్నాలు లెక్కించి మూటలు కట్టి, నాణ్యత పరీక్షలు గావించి పద్దతిగా అమర్చు పనిలో శిక్షణ ఇచ్చుచుండెడివాడు.
జ్ఞానరాజు తన తోటి బాలురతో ఆటలు ఆడుకొనవలేననే కోరిక వెళ్లబుచ్చినను తండ్రి సమ్మతించలేదు. ధనాగారము నందు ఉన్న కొండంత బంగారాన్ని కొడుకు ప్రమేయంతో తన ఇంటికి చేర్చి మాధవ మహారాజు సింహాసనం అధిరోహించాలని బలీయమైన కోరిక.
వజ్ర వైడూర్యాలు, మణిరత్నాలు దొంగిలించి వాటి రూపురేఖలు మార్చినచో వాటి విలువ పోగొట్టుకొనుటయే కాకుండా మరల వాటి ఉనికి తెలిసినచో ప్రమాదమని తలిచాడు.
బంగారం దొంగిలించిన పిమ్మట దాన్ని కరగించి రూపురేఖలు మార్చి ఎవ్వరికీ అనుమానం సోకకుండా జాగ్రత్త పడవచ్చునని ఒక పధకానికి ఆలోచన చేశాడు.
ప్రతిదినము కొంత బంగారం ముద్దను తవ్వి జ్ఞానరాజు చేత బలవంతంగా మింగించాడు. పని వేళలు అయిన తర్వాత గృహము చేరిన పిమ్మట చిన్న రాగి పాత్ర నిండా ఆముదం త్రాగించి, మింగిన బంగారు ముద్దను మలద్వార నుండి విసర్జన జరిగిన వెంటనే తగు రసాయనిక ద్రవాలతో శుద్ధి చేసి, శుభ్రపరచి భద్రంగా దాచుకునేవాడు. అతని భార్య కూడా ఇట్టి అసహజ పనికి చేయూతను ఇచ్చింది.
ఈ విధమైన ప్రతిదిన చర్యతో జ్ఞానరాజు జీర్ణాశయ ప్రక్రియలో లోపాలు ఏర్పడ్డాయి, ఆరోగ్యం క్షీణించసాగింది. కొడుకు ఆరోగ్యం కంటే దొంగ దారిలో ధన సంపాదన పైన మోజు హెచ్చి ఎంతో చాకచక్యంగా కొంత కొంతగా బంగారం రాజుగారు భండారం నుండి తరలింపు జరుగుచుండెడిది.
బంగారం నిల్వలు తగ్గిపోసాగినవి. రక్షకభటుల తమ వృత్తిని సానుకూలముగా నిర్వహించిననూ శరీర శల్య పరీక్ష జరుప లేనందున శృంగప్ప, జ్ఞానరాజు ఎవ్వరికీ పట్టుబడలేదు.
ఇదిలా ఉండగా మాధవమహారాజు తన ముగ్గురు పుత్రులలో ప్రధముడు సూర్యచంద్రునకు రాజ్య పరిపాలన అభ్యసించుటకు రాజకీయ శాస్త్రం నందు, రక్షణ వ్యవస్థలో ఒకటయిన సైనిక దళం ప్రధాన కర్తవ్యం కోసమై రాజ్యంలోని శాంతి భద్రతలను కాపాడుటకై శిక్షణ కొరకు ద్వితీయ పుత్రుడు రాజశేఖరునికి, తృతీయ పుత్రుడు సారంగుకు ఆయుర్వేద పాండిత్యం అభ్యసించుటకు దేశం నలుమూలలకు పంపి యుండెను.
***
దినములు, నెలలు, సంవత్సరాలు గడిచెను. రాయలు వారు ఆకస్మిక తనిఖీ చేబూని వ్యూహ నిపుణులను వెంటనిడు కొని సామంతరాజులను సంప్రదించారు.
మాధవమహారాజు రాజ్య సుభిక్షము కంటే తన పుత్రుల యోగక్షేమం వైపు ఎక్కువ ప్రీతి పాత్రుడయినందుకు శిక్షార్హులని ఆస్థాన న్యాయనిర్ణేతలకు లేఖ పంపించారు.
శృంగప్ప చేసిన తప్పుకు చంద్రగిరి కారాగారంలో బంధించారు.
విలువైన బాల్యం పోగొట్టుకొని అనారోగ్యం పాలైన జ్ఞానరాజుకు సారంగుని చేత ఆయుర్వేద వైద్యం చేయించి ఆరోగ్యవంతుని చేసెను.
సూర్యచంద్రుడు, రాజశేఖరుడు రాయల వారిని క్షమాభిక్ష కోరగా క్షమించి కువలాపురంను మరికొంత సామ్రాజ్య విస్తరణ చేసి ఇద్దరు యువకులకు రాజ్య భారం అప్పగించెను.
కొంత కాలానికి శృంగప్ప శిక్షను తగ్గించి విడుదల చేసి ఆర్థిక శాస్త్రంలో దాగివున్న నిగూఢమైన గుణగణాల గ్రంథరచనకు ప్రోత్సహించెను.
దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అష్టదిగ్గజములకు నిలయము. సమస్త కళలను పోషించిన రారాజు నందు కరుణ రసము కలిగి ఉండుట అరుదు.
వయసు మళ్ళిన మాధవమహారాజు రాయల వారి కీర్తి ప్రఖ్యాతలు ఆబాలగోపాలం తెలియచేస్తూ బాల్య జీవితం పట్ల తల్లిదండ్రుల బాధ్యతతో పాటు చేతబట్టిన వృత్తి యందు కూడా శ్రద్దాసక్తులు ఆవశ్యకత కలిగి యుండుట ఉచితమని రాజ్య ప్రజలకు భోధన చేయుచుండెను.
కన్నడ ప్రాంత గ్రామస్థులు రాయలవారి ఘనత మననం చేసుకుంటూ ఉంటారు.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli
@divikg5573
•17 hours ago
Very nice 🎉
@surekhap4148
•3 days ago
ధన్యవాదాలు 👍