top of page

రెండో లడ్డూ

#రెండోలడ్డూ, #RendoLaddu, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguKathalu, #తెలుగుకథలు

Rendo Laddu - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 12/03/2025

రెండో లడ్డూ - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు



చౌరస్తాలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి దగ్గరలోనే ఒక కళాశాల, దేవాలయం, ఆటల మైదానం ఉన్నాయి. అన్ని వైపుల నుంచి వచ్చే దారుల కూడలిలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 


కళాశాల వైపు నుంచి వచ్చే విద్యార్థులకు ఒక లడ్డూ, ఆటల మైదానం వైపు నుంచి వచ్చే యువకులకు సగం లడ్డూ, దేవాలయం వైపు నుంచి వచ్చే వృద్ధులకు పావు లడ్డూ చొప్పున ప్రసాదం పంచుతున్నాడు పూజారి. వేరేవాళ్ళకి ముఖం చూసి లెక్కపెట్టి ప్రసాదం ఇస్తున్నాడు. 


ఒక పసిపిల్లవాడు పదేపదే ప్రసాదం కోసం వస్తున్నాడు. పూజారి అది గమనించి పిల్లాడిని వెనక్కి పొమ్మని అదిలిస్తున్నాడు. అయినా పిల్లవాడు మొండిగా అక్కడే చేతులు చాచి నిలబడ్డాడు. చివరికి విసిగి ఆ పిల్లవాడి చెంపపై ఒకసారి గట్టిగా కొట్టాడు, కానీ ఒక లడ్డూ మాత్రం ఇచ్చాడు. కొంతసేపటికి ఆ పిల్లవాడు మళ్లీ హాజరు! 


పూజారికి పిచ్చి కోపం వచ్చేసింది. “మళ్ళా ఎందుకొచ్చావురా?” గట్టిగా అరిచాడు. 


పిల్లవాడు మరో చెంపను ముందుకు చాచి చెప్పాడు, “రెండు రోజుల్నుండీ ఏదీ తినలేదు సార్. ఇంకో లడ్డూ ఇవ్వరూ!”


పూజారి బిత్తరపోయాడు. వినాయకుడి బొజ్జవంక చూసాడు. పిల్లవాడి ఎండు డొక్కల వంక చాశాడు. ఈసారి చిన్నవాడి చెంప మీద దెబ్బ పడలేదు. వాడు చాచిన దోసిట్లో రెండు లడ్డూలు పడ్డాయి.

“ఒక లడ్డూ నా తరుఫునా, రెండో లడ్డూ గణేశ్ బాబా తరఫునా" అన్నాడు. 

పిల్లాడి కళ్లలో నీరు గిర్రున తిరిగింది. 

పూజారి కళ్లలో కూడా. 


***


కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


 
 
 

1 Comment



karlapalem hanumantha rao

•1 hour ago

ధన్యవాదాలు అండీ! ఎంతో బాగా చదివారు. అభినందనలు! ❤

Like
bottom of page