సాగర తీరం - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- 23 hours ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SagaraTheeram, #సాగరతీరం, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "సాగర తీరం" పుస్తకావిష్కరణ హైదరాబాద్లో
Sagara Theeram - Book Unveiling ceremony At hyderabad - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/12/2025
సాగర తీరం - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న విరచిత 83వ పుస్తకం"సాగర తీరం" పుస్తకావిష్కరణ శారదా కల్చరల్ లైవ్ స్టూడియో హాల్, హిమాయత్ నగర్,హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమన్వయ సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏ. పి. జె. అబ్దుల్ కలాం, అందెశ్రీ,దాశరథి, నెహ్రూ మరియు సత్య సాయిబాబా సంస్మరణ సభలో, జాతీయ కవి సమ్మేళనం పురస్కరించుకొని ప్రముఖ సాహితీవేత్త డా.ఓలే టి పార్వతీశం,తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా. నాళేశ్వరం శంకరం,ఆధ్యాత్మిక రచయిత డా. దుర్గాప్రసాద్( న్యూజెర్శి, అమెరికా).కళాపోషకులు ఏ. ఎల్. కృష్ణారెడ్డి మరియు డా. వి. డి. రాజగోపాల్ గార్ల చేతుల మీద ఆవిష్కరించడం విశేషం.అనంతరం ఈ పుస్తకాన్ని విశ్రాంత వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు శ్రీ పలకలూరి శివరావు గారికి అంకితమిచ్చారు.అత్యల్ప కాల వ్యవధిలో 82 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహిత్యప్రముఖు గాయకులు డా. శరత్ చంద్ర, అరవా రవీంద్ర బాబు, శివ రమ్య, మరియు రాధాకుమారి మొదలగు వారు పాలొగొన్నారు.
-గద్వాల సోమన్న


















Comments